మళ్ళీ ట్రాక్ లోకి ఆటో పరిశ్రమ.. జూలైలో అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ 5 కార్లు ఇవే..

First Published Aug 7, 2021, 6:13 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, దేశంలో దీర్ఘకాలంగా లాక్ డౌన్ ఆటో పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ ఇప్పుడు ఉపశమనం లభించడంతో   ఆటో పరిశ్రమ మళ్ళీ మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి నిదర్శనం జూలై నెల ఆటో గణాంకాలు. 

దీనికి నిదర్శనం జూలై నెల ఆటో గణాంకాలు. ఈ గణాంకాలు కార్లపై ప్రజల ఆసక్తి మళ్లీ పెరుగుతోందని అలాగే కార్లు కొనడానికి ముందుకు వస్తున్నారని చూపిస్తున్నాయి. కస్టమర్లకు బాగా నచ్చిన, జూలైలో అత్యధికంగా అమ్మకాలు జరిగిన ఐదు కార్ల గురించి  తెలుసుకోండి..

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

జూలైలో అత్యధికంగా అమ్ముడైన మిడిల్ క్లాస్ కారు మారుతి సుజుకి వ్యాగన్ఆర్. జూలైలో ఈ కారు 22,836 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జూలైలో  13,515 మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు దాదాపు 69 శాతం పెరిగాయి. 

మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ జాబితాలో రెండవ కారు కూడా మారుతి సుజుకిదే. ప్రముఖ ప్రీమియం స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి స్విఫ్ట్ జూలై నెలలో 18,434 యూనిట్లను విక్రయించింది. జూలై 2020లో 10,173 స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఈ కారు అమ్మకాలు 81 శాతం పెరిగాయి. ఈ కారు కూడా యువతకు బాగా నచ్చింది.

మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి బాలెనో ఒక శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. జూలైలో 14,729 యూనిట్ల విక్రయంతో చాలా మంది వాహదారులను ఆకర్షించింది. గత ఏడాది జూలైలో 11,575 యూనిట్లను విక్రయించింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఈ కారు అమ్మకాలు దాదాపు 27 శాతం పెరిగాయి. ఈ కారు ప్రీమియం సెగ్మెంట్‌లో వేగంగా స్థానం సంపాదించుకుంది.

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి సుజుకి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ తో ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంది. జూలై నెలలో ఈ కారు మొత్తం 13,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జూలైతో పోలిస్తే ఈ కారు అమ్మకాలలో దాదాపు 58 శాతం పెరుగుదల ఉంది. జూలై 2020 లో మారుతి సుజుకి ఎర్టిగా 8504 యూనిట్లు మాత్రమే విక్రయించింది.
 

హ్యుందాయ్ క్రెటా

సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఎన్నో లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉన్న హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఈ కారు 13000 యూనిట్లు జూలై నెలలో అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జూలైలో  11,549 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఈ కారు అమ్మకాలు 13 శాతం పెరిగాయి.
 

click me!