రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం పెట్టుబడి మొత్తం నిధులను 285 మిలియన్ల డాలర్లకు పెంచుతుంది. అయితే ఈ పెట్టుబడి కేవలం వారం వ్యవధిలో హీరో మోటోకార్ప్ ప్రకటించిన రెండో అతిపెద్ద పెట్టుబడి. అంతకుముందు, భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ ఏథర్ ఎనర్జీలో రూ. 420 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
హీరో మోటోకార్ప్ ప్రెసిడెంట్ అండ్ సిఈఓ పవన్ ముంజాల్ మాట్లాడుతూ, "గోగోరోలో మా పెట్టుబడి 'బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ' అనే మా దృష్టికి అనుగుణంగా ఉంది. ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకురావడానికి గొగోరోతో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది.
"మేము భవిష్యత్తు అవసరాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాము అలాగే ప్రపంచవ్యాప్తంగా క్లీన్ మొబిలిటీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాము" అని చెప్పారు.
"లాంగ్ టర్మ్ వాల్యు సృష్టించడంపై దృష్టి సారించిన ద్విచక్ర వాహనాలలో గ్లోబల్ లీడర్ హీరో మోటో కార్ప్ అండ్ ఇంజిన్ నంబర్ 1 మాతో భగస్వామ్యం కావడం మాకు గర్వకారణం" అని గోగోరో వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ అండ్ సిఈఓ హోరేస్ ల్యూక్ అన్నారు.
"అర్బన్ మొబిలిటీ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి అలాగే ఆసియాలో ఉన్న ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ ట్రాన్సిషన్‌ను మార్చడానికి మేము ఉన్నత స్థానంలో ఉన్నాము" అని ఆయన చెప్పారు.
గోగోరో బ్యాటరీ స్వాపింగ్ ఎకోసిస్టమ్ అనేది లైట్ అర్బన్ వెహికిల్ ఎలక్ట్రిక్ రీఫ్యూయలింగ్ కోసం స్థాపించబడిన మార్గదర్శక పరిష్కారం. ఐదేళ్లలోనే యూఎస్ 1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని , 4.5 లక్షల బ్యాటరీ స్వాప్ కస్టమర్‌లను సాధించింది.