ప్రపంచంలోనే ఫస్ట్ ఫోల్డబుల్ ఇ-బైక్‌పై ప్రయాణించిన ఆనంద్ మహీంద్రా..ఆఫీస్ చుట్టూ తిరుగుతూ.. ట్విట్టర్ లో పోస్ట్

First Published Oct 27, 2023, 1:36 PM IST

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా హార్న్‌బాక్ ఎక్స్1 ఇ-బైక్ గురించి ట్విట్టర్ లో పోస్ట్  షేర్ చేసారు. ఐఐటీ బాంబే విద్యార్థులు డెవలప్ చేసిన ఈ ఇ-సైకిల్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అన్నింటికంటే ఇక్కడ హార్న్‌బాక్ X1 స్పెసిఫికేషన్‌లు, ధర, కంపెనీ గురించి ఆసక్తికరమైన సమాచారం మీకోసం... 
 

మహీంద్రా ఆటోమొబైల్ కి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్కెట్‌ ఉంది. అత్యుత్తమ కార్లను విక్రయిస్తున్న మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి మీకు తెలిసందే.
 

ప్రతిరోజూ కొత్త ఆలోచనలను షేర్ చేసుకునే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు E బైక్ గురించి సమాచారాన్ని పోస్ట్ ద్వారా షేర్ చేసారు. హార్న్‌బాక్ X1 E బైక్‌ను నడిపి తన అనుభవాన్ని కూడా  వెల్లడించారు.
 

ఐఐటీ బాంబే విద్యార్థులు ఈ-బైక్ ని అభివృద్ధి చేసారు. ఈ బైక్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ ఈ-బైక్. ఇతర ఫోల్డబుల్ బైక్‌ల కంటే దీనికి 35 శాతం ఎక్కువ సామర్థ్యం ఉంటుంది.
 

ఆనంద్ మహీంద్రా హార్న్‌బాక్ ఎక్స్1 ఇ బైక్‌లో పెట్టుబడి కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ బైక్ అంతర్జాతీయ మార్కెట్‌ను సొంతం చేసుకుంది.
 

Hornbock X1 E బైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.44,999. ఇ-బైక్‌లో 36V బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు.
 

ఇ-బైక్ 250W మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. హార్న్‌బాక్ ఎక్స్1 ఈ-బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 
 

ఆనంద్ మహీంద్రా ఈ ఇ-బైక్‌ని తన ఆఫీసు చుట్టూ తిరిగేందుకు ఉపయోగించారు. ఆ తర్వాత దాన్ని మడిచి కారులో పెట్టారు. E బైక్‌ను చాలా సులభంగా మడతపెట్టవచ్చు ఇంకా  హాయిగా ప్రయాణం చేయవచ్చు.
 

మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ-బైక్‌ని మెట్రో, ట్రైయిన్ ఇంకా  బస్సులో కూడా తీసుకెళ్లవచ్చు. సూట్‌కేస్‌లా మడతపెట్టే ఈ ఫోల్డబుల్ బైక్ అందరికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతోంది.
 

click me!