airbags compulsory:ఇప్పుడు అ వాహనాలకు కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి.. ప్రకటించిన మంత్రి..

Ashok Kumar   | Asianet News
Published : Jan 14, 2022, 07:59 PM ISTUpdated : Jan 14, 2022, 08:08 PM IST

భారత మార్కెట్లో విక్రయించే వాహనాల్లో ప్రయాణీకుల భద్రత(passengers safety) గురించి తరచుగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళనలపై పరిష్కారానికి ప్రభుత్వం (government)పలు చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది ప్రయాణించే వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు(airbags) తప్పనిసరిగా ఉండేలా జిఎస్‌ఆర్ ముసాయిదా నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari)శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. 

PREV
14
airbags compulsory:ఇప్పుడు అ వాహనాలకు కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి.. ప్రకటించిన మంత్రి..

"ఈ చర్య ఖచ్చితంగా వాహనం ధర/వేరియంట్‌తో సంబంధం లేకుండా అన్ని విభాగాలలో ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తుంది" అని గడ్కరీ చెప్పారు.

డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌ల ఫిట్‌మెంట్‌ను 1 జూలై 2019 నుండి అలాగే ఫ్రంట్ కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ల ఫిట్‌మెంట్‌ను ఈ సంవత్సరం జనవరి 1 నుండి అమలు చేయడాన్ని మంత్రిత్వ శాఖ ఇప్పటికే తప్పనిసరి చేసింది.
 

24

ఎం1 (M1) వెహికల్ కేటగిరీలో అంటే గూడ్స్ క్యారియర్ లేదా ప్యాసెంజర్ క్యారియర్ ముందు అలాగే వెనుక రెండు కంపార్ట్‌మెంట్‌లకు వెనుక ఢీకొనే ప్రమాదం ప్రభావాన్ని తగ్గించడానికి నాలుగు అదనపు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి అని నిర్ణయించబడింది.

34

ఇందులో రెండు సైడ్/సైడ్ టోర్సో ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు వైపులా కర్టెన్/ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి, ఇవి కారులోని ప్రయాణికులందరినీ కవర్ చేస్తాయి. భారతదేశంలో మోటారు వాహనాలను మునుపెన్నడూ లేనంత సురక్షితమైనదిగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన దశ అని ఆయన అన్నారు.
 

44

రోడ్డు ప్రమాదాలలో మరణాలు
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న అగ్ర దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో మరణాలు, తీవ్ర గాయాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రమాదాలకు ట్రాఫిక్‌ ఉల్లంఘనలే ప్రధాన కారణమని చెబుతున్నారు. కానీ తగిన భద్రతా చర్యలు లేనందున ముఖ్యంగా చిన్న ఎంట్రీ-లెవల్ వాహనాలలో కూడా పెద్ద సంఖ్యలో మరణాలకు కారణం అవుతున్నాయి.

click me!

Recommended Stories