ఇండియాలోకి మరో క్లాసిక్ బైక్ బ్రాండ్ రిఎంట్రీ.. టిజర్ వీడియోలో లాంచ్ కానున్న బైక్స్ ఇవే..

First Published | Jan 13, 2022, 4:14 PM IST

పాత టూ-వీలర్ బ్రాండ్‌లను రిస్టోర్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉన్న క్లాసిక్ లెజెండ్స్(classic legends), మహీంద్రా(mahindra) బ్రాండ్ భారత మార్కెట్లోకి యెజ్డీ (Yezdi)ని తిరిగి తీసుకొస్తుంది. ఈ  క్లాసిక్ బైక్ తయారీ సంస్థ భారతదేశంలో కొంతకాలం క్రితం  ఉత్పత్తిని నిలిపివేసింది, అయితే జనవరి 13న  మళ్ళీ  భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

యెజ్డీ   (Yezdi) కంటే ముందు క్లాసిక్ లెజెండ్స్ ఐకానిక్ జావా బైక్స్ మూడు కొత్త ఉత్పత్తులను భారతదేశంలో విజయవంతంగా లాంచ్ చేసింది.

యెజ్డీ  లైనప్‌ను టీజర్‌ ద్వారా చూపిస్తూ రిఎంట్రీని వెల్లడించింది, ఇందులోని మూడు మోడళ్లలో అడ్వెంచర్ బైక్, ఒక క్రూయిజర్ అండ్ స్క్రాంబ్లర్‌ను ఉన్నాయి. క్రూయిజర్  లీకైన ఫోటోలలో దాని డిజైన్ గురించి చిన్న క్లూని అందిస్తాయి. ఫోటోల ప్రకారం, బైక్‌లో స్కూప్డ్ డిజైన్‌తో లో సీటు, హై హ్యాండిల్‌బార్లు, బార్-ఎండ్ మిర్రర్‌లు ఉన్నాయి. ఇంకా విల్స్ అల్లాయ్ వీల్స్ లాగా కనిపిస్తాయి.

ఫుట్‌పెగ్‌లు క్లాసికల్ బైక్‌ల రూపాన్ని చూపిస్తూ న్యాచురల్ రైడింగ్ ని అందించడానికి రూపొందించబడ్డాయి. ఇంకా రెగ్యులర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాకర్‌లు ఉండవచ్చు. కంపెనీ ఆప్షనల్ గా పిలియన్ బ్యాక్‌రెస్ట్ అండ్ పొడవైన విండ్‌స్క్రీన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.


క్రూయిజర్ కాకుండా, మిగతా రెండు మోడళ్లకు ఆఫ్-రోడర్ పేరు ఉంది. స్క్రాంబ్లర్ కి సింగిల్-పీస్ సీట్‌తో ఫ్లాట్ హ్యాండిల్‌బార్‌ ఉంటుంది ఇంకా ట్రెడిషనల్ డిజైన్‌ను అనుసరించి మొత్తం సింపుల్ డిజైన్‌ ఉంటుంది. అయితే, అడ్వెంచర్‌లో పొడవాటి హ్యాండిల్‌బార్, స్పిల్డ్ సీట్, ట్యాంక్‌పై జెర్రీ క్యాన్ మౌంట్‌లు, ట్రయల్‌పై విండ్‌స్క్రీన్ అండ్ పానీయార్ మౌంట్‌లు ఉంటాయి.

స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ మోడల్‌లు రెండింటికి వైర్-స్పోక్ వీల్స్ ఇంకా డ్యూయల్-పర్పస్ టైర్‌లు ఉంటాయి. ఈ రెండిటికి ముందు  టెలీస్కోపిక్ ఫోర్క్స్ , అడ్వెంచర్ కోసం మోనో-షాక్,  స్క్రాంబ్లర్ కోసం డ్యూయల్ రియర్ షాక్‌ పొందుతాయి.
 

బైక్‌లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈ‌డి లైటింగ్, డ్యూయల్-ఛానల్ ఏ‌బి‌ఎస్ రెండు డిస్క్ బ్రేక్‌లకు స్టాండర్డ్ గా ఉంటాయి. ఈ బైక్స్ లో ఉండే ఇంజన్ జావా పెరాక్ ఇంజన్‌ని పోలి ఉండే అవకాశం ఉంది. అంటే 334cc, సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్.

క్రూయిజర్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350తో పోటీపడుతుంది, అయితే స్క్రాంబ్లర్ హోండా సి‌బి350 ఆర్‌ఎస్, రాబోయే RE స్క్రామ్ 411తో పోటీపడుతుంది. ఆర్‌ఈ హిమాలయన్, కే‌టి‌ఎం 250 అడ్వెంచర్ యెజ్డీ ఏ‌డి‌వికి పోటీగా ఉంటాయి.

Latest Videos

click me!