500 కి.మీ. మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లతో టొయోటా తొలి ఎలక్ట్రిక్ SUV

First Published | Nov 4, 2024, 5:21 PM IST

500 km Mileage - Toyota First Electric SUV: టొయోటా వచ్చే ఏడాది ప్రారంభంలో మారుతి సుజుకి eVX ఆధారంగా తయారైన ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. 500 కిలో మీటర్ల మైలేజీతో టొయోటా అర్బన్ SUV కాన్సెప్ట్ డిజైన్ కొత్త లుక్ తో వస్తోంది.

టొయోటా తొలి ఎలక్ట్రిక్ SUV

టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) వచ్చే ఏడాది ప్రారంభంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలోకి ప్రవేశించనుంది. జపాన్ వాహన తయారీ సంస్థ తొలి ఎలక్ట్రిక్ కారుతో ఈ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తూ మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV రీ-బ్యాడ్జ్ వెర్షన్ కొత్త ఈవీ కారుతో మార్కెట్ లోకి వస్తోంది. టొయోటా తన తొలి ఎలక్ట్రిక్ SUV ని 2025 మొదటి అర్ధభాగంలో విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు సంస్థలు దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

రానున్న టొయోటా ఎలక్ట్రిక్ SUV, మారుతి eVX ఉత్పత్తి సుజుకి వెర్షన్ ఉత్పత్తి గుజరాత్ కేంద్రంలో జరుగుతుంది. టొయోటా తన ఎలక్ట్రిక్ వాహనాన్ని యూరోపియన్, జపనీస్, ఆఫ్రికన్ మార్కెట్లకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

500 km Mileage.. Toyota to Launch First Electric SUV with amazing features

కొత్త టొయోటా ఎలక్ట్రిక్ SUV, దాని డోనర్ మోడల్ (eVX) ప్రత్యేకమైన డిజైన్, ఆకర్షణీయమైన శైలిని కలిగి ఉంటాయి. గత సంవత్సరం విడుదలైన టొయోటా అర్బన్ SUV కాన్సెప్ట్ నుండి దాని డిజైన్ ప్రేరణ పొందుతుంది. కొన్ని కొత్త మార్పులు కూడా చేస్తున్నారు. 

SUV కాన్సెప్ట్ టొయోటా 40PL ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ డిజైన్ నుండి పుట్టిన కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. సుజుకి, టయోటా, డైహట్సు సంయుక్తంగా అభివృద్ధి చేసిన BEV మోడల్ 4WDని కలిగి ఉంది. 


500 km Mileage.. Toyota to Launch First Electric SUV with amazing features

టొయోటా అర్బన్ SUV కాన్సెప్ట్ 4,300mm పొడవు, 1,820mm వెడల్పు, 1,620mm ఎత్తుతో ఉంటుంది. అంటే మారుతి eVX అంత పెద్దదిగా కనిపిస్తుంది. అయితే, దాని ఎత్తు, వెడల్పు దాని డోనర్ మోడల్ కంటే 20mm తక్కువగా ఉంటుంది. రెండు ఎలక్ట్రిక్ SUVలు 2,700mm వీల్‌బేస్ కలిగి ఉంటాయి.

SUV కాన్సెప్ట్‌లో టొయోటా సుపరిచితమైన గ్రిల్, C-ఆకారపు LED DRLలు, కనిష్ట డిజైన్ ఫ్రంట్ బంపర్, C-పిల్లర్-ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

500 km Mileage.. Toyota to Launch First Electric SUV with amazing features

లోపలి భాగం గురించిన సమాచారం ఇప్పటికీ  పంచుకోలేదు. అయితే, రాబోయే టయోటా ఎలక్ట్రిక్ SUV క్యాబిన్ లోపల కూడా మినిమలిస్ట్ డిజైన్ విధానాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. క్యాబిన్ కూడా అద్భుతమైన డిజైన్ తో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రోటరీ డయల్‌తో ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రేమ్‌లెస్ రియర్‌వ్యూ మిర్రర్, 360 డిగ్రీ కెమెరా, ADAS సూట్‌గా పనిచేసే డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉండవచ్చు.

మారుతి eVX లాగా, టొయోటా తొలి ఎలక్ట్రిక్ SUV 60kWh బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చుని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది FWD సెటప్ లేదా AWD సెటప్‌తో అందుబాటులో ఉంటుందని సమాచారం. 

500 km Mileage.. Toyota to Launch First Electric SUV with amazing features

ఆటో దిగ్గజాలు విడుదల చేసిన ఒక ప్రకటనలో సుజుకి టయోటాకు అభివృద్ధి చేసిన బ్యాటరీ EV స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) మోడల్ సరఫరాలో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. 

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) అనేది టయోటా మోటార్ కార్పొరేషన్ (TMC) భారతీయ అనుబంధ సంస్థ అయితే మారుతీ సుజుకి ఇండియా (MSIL) సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC) భారతీయ అనుబంధ సంస్థ. 
 

Latest Videos

click me!