రైలు ఇంజిన్ ఎన్ని సీసీలు ఉంటుంది? ఎంత మైలేజ్ ఇస్తుంది?

First Published | Nov 4, 2024, 1:34 PM IST

Train Engine Capacity-Mileage: భారతీయ రైల్వేలో ఉపయోగించే ఇంజిన్ (లోకోమోటివ్‌) ల‌ను భారతీయ రైల్వేలు, BHEL యాజమాన్యంలోని ఐదు తయారీ యూనిట్లు తయారు చేస్తాయి. 2021 నాటికి 37% రైళ్లు డీజిల్ లోకోమోటివ్‌లతో న‌డుస్తున్నాయి. మిగిలినవి ఎక్కువగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో న‌డుస్తున్నాయి. డిసెంబర్ 2023 లెక్క‌ల ప్ర‌కారం.. భారతీయ రైల్వేలో 10,238 ఎలక్ట్రిక్, 4,543 డీజిల్ ఇంజన్లు ఉన్నాయి.
 

Indian Train Engine Capacity-Mileage: మీరు ఇప్ప‌టికే రైలులో ప్రయాణించి ఉంటారు. మీతో పాటు చాలా మంది రైలు ప్ర‌యాణం చేసి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రైలు చాలా ముఖ్యమైన రవాణా సాధనంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలైనా లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలైనా రైలు ప్ర‌యాణం ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో కీల‌క పాత్ర పోషిస్తోంది. అయితే, ఇక‌రు ఇద్ద‌రు ప్ర‌యాణించే బైకులు సాధార‌ణంగా 100 సీసీ నుంచి 500-600 సీసీల ఇంజిన్ ల‌ను క‌లిగి ఉంటున్నాయి. అయితే, వంద‌లాది మంది ప్ర‌యాణించే రైలు ఇంజన్ సీసీ ఎంత ఉంటుంది? 

How many CCs will the train engine have?

రైలు ప్ర‌యాణం - త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ప్ర‌యాణం

ప్ర‌పంచ వ్యాప్తంగా రైళ్లు ఎల్లప్పుడూ ప్రసిద్ధ రవాణా సాధనంగా ఉన్నాయి. రైళ్లు రవాణాకు ఆర్థికపరమైన ఎంపిక మాత్రమే కాదు, ఈ రోజుల్లో హై-స్పీడ్ రైళ్ల సంఖ్య పెరుగుదలతో ప్రజలు తమ గమ్యాన్ని చాలా వేగంగా చేరుకునే విధంగా మార్పులు వ‌చ్చాయి. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. 

ప్రైవేట్ వాహనం లేదా విమానం కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో సుదుర ప్రాంతాల‌కు వెళ్ల‌వ‌చ్చు. భార‌తీయ రైల్వేలు కొత్త టెక్నాల‌జీని అందిపుచ్చుకుని ప్ర‌యాణ స‌మ‌యాన్ని మ‌రింత‌గా త‌గ్గించాయి.  రైలు మొత్తం ప్రయాణంలో ఉపయోగించే ఇంజిన్ సామర్థ్యం ఎంత? ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుంది? అనే విష‌యాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు ! 


Train Engine How much mileage does it give?

భారతీయ రైళ్ల మైలేజీ ఎంత? 

ఇది చాలా మందికి మదిలో మెదిలింది, కానీ ఎవరూ దీనిని పట్టించుకోలేదు. కార్ల మాదిరిగానే, కొంతమంది రైలు ఇంజిన్ల సీసీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉంటారు. అయితే,  రైలు ఇంజిన్ కు చెందిన ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ (CC) సాధారణ కార్లు లేదా బైక్‌ల మాదిరిగా కొలవ‌రు. ఎందుకంటే రైలు ఇంజిన్‌లు చాలా శక్తివంతమైనవి.. చాలా పెద్దవి కూడా.

WDM-3D లేదా WDP-4D వంటి భారతీయ రైల్వేల డీజిల్ ఇంజిన్‌లు 2,600 నుంచి 4,500 హార్స్‌పవర్ (HP) మధ్య పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్లు 16 నుండి 20 సిలిండర్‌లతో వస్తాయి. వాటి మొత్తం స్థానభ్రంశం లక్షల సీసీల‌లో ఉంటుంది.

Vande Bharat Train

రైలు మైలేజీ గురించి మాట్లాడినట్లయితే ఈ ఇంజిన్లు లీటరుకు 4-6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఇది రహదారిపై నడుస్తున్న వాహనాల కంటే చాలా తక్కువ. అయితే, రైళ్లు ఒకేసారి వందల సంఖ్యలో ప్రయాణీకులను తీసుకువెళతాయి, కాబట్టి ఒక వ్యక్తికి లేదా కిలోమీటరుకు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ సంఖ్య రైలు వేగం, లోడ్, మార్గంపై ఆధారపడి ఉంటుంది, అయితే మొత్తం మీద రైలు మైలేజ్ ప్రతి వ్యక్తికి చాలా పొదుపుగా ఉంటుంది.

Indian Train Engine Capacity-Mileage

భార‌తీయ రైల్వేల‌లో ఉప‌యోగించే ఇంజన్ ఎవ‌రు త‌యారు చేస్తారు? 

భారతీయ రైల్వేలో ఉపయోగించే ఇంజన్ (లోకోమోటివ్‌) ల‌ను భారతీయ రైల్వేలు, BHEL  యాజమాన్యంలోని ఐదు తయారీ యూనిట్లు తయారు చేస్తాయి. 2021 నాటికి 37% రైళ్లు డీజిల్ లోకోమోటివ్‌లతో న‌డుస్తున్నాయి. మిగిలినవి ఎక్కువగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో న‌డుస్తున్నాయి. డిసెంబర్ 2023 లెక్క‌ల ప్ర‌కారం.. భారతీయ రైల్వేలో 10,238 ఎలక్ట్రిక్, 4,543 డీజిల్ ఇంజన్లు ఉన్నాయి.

Indian Train Engine Capacity-Mileage-Price

భారతీయ రైలు ఇంజిన్ ధర ఎంత?

రైలు ఇంజిన్ ధ‌ర‌లు కోట్ల‌లోనే ఉంటాయి. డ్యూయల్-మోడ్ లోకోమోటివ్ ధర సుమారు రూ. 18 కోట్లు కాగా, 4500 హెచ్‌పి డీజిల్ లోకోమోటివ్ ధర రూ. 13 కోట్లు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు విద్యుదీకరించబడిన ట్రాక్‌ల కోసం మాత్రమే. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ధర దాదాపు ₹45 కోట్లుగా ఉంటుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, ప్ర‌స్తుతం టెక్నాల‌జీ పెరుగుద‌ల కార‌ణంగా లెటెస్ట్ ఇంజిన్ల ధ‌ర‌లు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. వాటి మ‌న్నిక కూడా ఎక్కువ‌. 

Vande Bharat Train Price

వందే భారత్ రైలు ఇంజిన్ ధర ఎంత?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేల నుండి వ‌చ్చిన‌ ప్రీమియం సెగ్మెంట్ రైలు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, సెమీ-హై-స్పీడ్ రైలు ఇది. మొదటి వందే భారత్ రైలును 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలును మొదట ట్రైన్ 18 అని పిలిచేవారు, అయితే దీనిని పూర్తిగా భారతదేశంలో భారతీయ ఇంజనీర్లు నిర్మించారని గుర్తించడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చారు. 

లెటెస్ట్ టెక్నాల‌జీ వందే భార‌త్ రైలు ఇంజిన్ ధ‌ర 115 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. అయితే, ఇది రైలు కోచ్ ల సంఖ్య‌ను బ‌ట్టి ఇంజిన్ మారుతుంటుంది. ధ‌ర‌లు కూడా మారుతాయి. 8-కోచ్ వందే భారత్  రైలు ధ‌ర సుమారు ₹52 కోట్లుగా ఉంటుంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Latest Videos

click me!