మీ బైక్ మైలేజ్ అకస్మాత్తుగా తగ్గిపోయిందా? డ్రైవింగ్ చేసే విధానం, టైర్లలో గాలి, ఇంజిన్ ఆయిల్ లాంటివి ఇందుకు కారణం కావచ్చు. మరి మైలేజ్ పెంచుకునే మార్గాలేమిటో ఇక్కడ చూద్దాం.
మీరు బైక్ నడిపేటప్పుడు సడన్ గా స్పీడ్ పెంచడం అంటే అనవసరంగా యాక్సిలరేటర్ ఇవ్వడం, పదేపదే బ్రేకులు వేయడం లాంటివి చేస్తే పెట్రోల్ త్వరగా అయిపోతుంది. అలాగే క్లచ్‌ను ఎక్కువసేపు పట్టుకుని డ్రైవ్ చేయడం కూడా బైక్ పనితీరును దెబ్బతీస్తుంది. ఇలాంటి చిన్నచిన్న డ్రైవింగ్ తప్పులు చేయకండి.
రోడ్డు పరిస్థితిని బట్టి ఒకే స్పీడ్‌తో బైక్ నడపడం అలవాటు చేసుకోండి. అనవసరంగా గేర్లు మారుస్తూ, యాక్సిలరేటర్ పెంచడం, తగ్గించడం చేయకుండా ఒకే స్పీడ్ మెయింటేన్ చేస్తే పెట్రోల్ ఆదా అవుతుంది… తద్వారా డబ్బులు ఆదా అవుతాయి.
25
నాణ్యత లేని పెట్రోల్ వాడకండి
బైక్ మైలేజ్ విషయంలో పెట్రోల్ క్వాలిటీ చాలా ముఖ్యం. మీరు నాణ్యత లేని లేదా కల్తీ పెట్రోల్ వాడితే అది ఇంజిన్ పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల బైక్ ఎక్కువ పెట్రోల్ లాగేస్తుంది, మైలేజ్ తగ్గుతుంది.
అందుకే నమ్మకమైన పెట్రోల్ బంకుల్లోనే ఇంధనం నింపుకోవడం మంచిది. బయట బాటిల్స్ లో అమ్మే పెట్రోల్ వాడకపోవడం మంచిది. పెట్రోల్ బంకుల్లోనూ క్వాలిటీపై అనుమానం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయండి… అలాగే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో బైక్‌ను చెక్ చేయించండి.
35
ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసుకొండి
బైక్ ఇంజిన్ స్మూత్‌గా పనిచేయాలంటే ఇంజిన్ ఆయిల్ చాలా కీలకం. మీరు సరైన సమయంలో ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే, ఇంజిన్ లోపలి భాగాల మధ్య రాపిడి పెరిగి దాని పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది.
అలాగే ఎయిర్ ఫిల్టర్‌లో మురికి చేరితే ఇంజిన్‌కు గాలి సరిగ్గా అందదు. ఇది కూడా మైలేజ్ తగ్గడానికి ఒక కారణం. కాబట్టి కంపెనీ చెప్పిన టైమ్‌కి ఇంజిన్ ఆయిల్ మార్చడంతో పాటు ఎయిర్ ఫిల్టర్‌ను క్లీన్ చేయడం లేదా కొత్తది వేయడం మర్చిపోకండి.
బైక్ కండిషన్ బాగుండాలంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ తప్పనిసరి. మనం కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలను పట్టించుకోము. అవే తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్‌గా మారుతాయి.
టైమ్‌కి సర్వీసింగ్ చేయిస్తే ఇంజిన్, బ్రేకులు, ఇతర ముఖ్యమైన పార్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. బైక్‌లో ఏదైనా లోపం ఉంటే ముందే గుర్తించి రిపేర్ చేయిస్తే పెట్రోల్ వృథా కాకుండా చూసుకోవచ్చు.
అలాగే ట్రాఫిక్, రోడ్డును బట్టి గంటకు 50 నుంచి 70 కి.మీ. స్పీడ్‌తో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది. అయితే సరైన స్పీడ్ అనేది బైక్ మోడల్, రోడ్డు పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ సేఫ్ స్పీడ్‌లోనే వెళ్లండి.
55
ఎండలో ఎక్కువసేపు పార్కింగ్ చేయకండి
బైక్‌ను ఎక్కువసేపు ఎండలో పార్క్ చేయడం గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఎండ వేడికి పెట్రోల్ ట్యాంక్, బైక్ ఇతర భాగాలు వేడెక్కుతాయి. ట్యాంక్ డిజైన్, ఫ్యూయల్ సిస్టమ్‌ను బట్టి పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు బైక్‌ను నీడలోనే పార్క్ చేయండి.
అలాగే సరైన గేర్ వాడటం కూడా చాలా ముఖ్యం. తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు టాప్ గేర్ వేస్తే ఇంజిన్‌పై భారం పడుతుంది. ఎక్కువ స్పీడ్‌లో తక్కువ గేర్ వేసినా ఇంజిన్ స్పీడ్ పెరిగి పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి స్పీడ్‌కు తగ్గ గేర్ వాడితే ఇంజిన్ లైఫ్ పెరగడంతో పాటు మైలేజ్ కూడా వస్తుంది.