ఈ రాశుల వారికి పెళ్లి నరకమే..!

Published : May 28, 2022, 11:15 AM ISTUpdated : May 28, 2022, 11:17 AM IST

ఎప్పుడెప్పుడు ఈ వివాహ బంధాన్ని వదిలేద్దామా అనే భావన చాలా మందిలో కలుగుతుంది.  జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు వివాహాంలో కష్టాలను మాత్రమే ఎక్కువగా చూస్తారు. 

PREV
16
 ఈ రాశుల వారికి పెళ్లి  నరకమే..!
Divorce

జీవితంలో పెళ్లి ఒక సంపూర్ణతకు తీసుకువస్తుంది. మనకంటూ ఓ వ్యక్తి ఉన్నారు అనే భావన మనకు పెళ్లితో కలుగుతుంది. అందుకే.. ఒక వయసు వచ్చాక అందరూ పెళ్లి గురించి ఆలోచిస్తారు. అయితే.. పెళ్లి తర్వాత అందరి జీవితం ఆనందంగా ఉంటుందనే గ్యారెంటీ ఇవ్వలేం. కొందరి లైఫ్ ఆనందంగా సాగితే.. మరి కొందరికి మాత్రం నరకం చూపిస్తుంది.  ఎప్పుడెప్పుడు ఈ వివాహ బంధాన్ని వదిలేద్దామా అనే భావన చాలా మందిలో కలుగుతుంది.  జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు వివాహాంలో కష్టాలను మాత్రమే ఎక్కువగా చూస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...

26

1.మేష రాశి..
ఈ రాశివారికి విపరీతమైన కోపం. చిన్న విషయానికే కోపంతో ఊగిపోతారు. ఇక ఎవరైనా రెచ్చగొడితే వీరిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇక వివాహ బంధంలో తమ జీవిత భాగస్వామి విషయంలో ఏదైనా గొడవ జరిగితే.. ఇక వారిని ప్రశాంతంగా ఉంచడం ఎవరి వల్లా కాదు. అయితే.. కోపం తగ్గిన తర్వాత మాత్రం తమ పార్ట్ నర్ క్షమాపణలు చెబుతారు.. తమదే తప్పు అని ఒప్పుకుంటారు. కానీ.. వారు కోపంలో అన్న మాటలు, చేష్టలను తమ పార్ట్ నర్ భరించలేరు. ఈ క్రమంలో.. వారి మధ్య తేడాలు రావడం ఖాయం.

36

2.మిథున రాశి..

ఈ రాశివారికి జీవితాంతం ఒక్కరితోనే కలిసి ఉండటం అనేది నచ్చదు. ఆ  కాన్సెప్ట్ ని వీరు ఇష్టపడరు. వారి తీవ్రమైన షెడ్యూల్‌తో బిజీగా ఉండటమే కాకుండా, వారు తమ జీవిత భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చించలేరు, దీని ఫలితంగా వారు ఒకరికొకరు దూరంగా ఉంటారు. మిథునరాశి వారు ఆ తర్వాత దాన్ని భర్తీ చేయడానికి కూడా ప్రయత్నించరు.

46

3.కన్య రాశి..
కన్య రాశివారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉండాలని అనుకుంటారు. వారు ఉన్నట్లే అందరూ ఉండాలని భావిస్తారు. వీరు అన్నింట్లోనూ పర్ఫెక్షన్ కోరుకోవడం వల్ల.. వారి వివాహ బంధంలో సమస్యలు రావడం మొదలౌతాయి. ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే.. ఏ జీవిత భాగస్వామికి అయినా చిరాకు రావడం సహజమే కదా. అదే వీరి విషయంలోనూ జరుగుతుంది.

56

4.వృశ్చిక రాశి..
వీరికి కాస్త భయం ఎక్కువ. తమకు ఎవరి వల్ల అయినా ఏదైనా గాయం కలుగుతందని వారు భయపడుతుంటారు. ఆ సమయంలో తమ జీవిత భాగస్వామిని కూడా దగ్గరకు రానివ్వరు. సింగిల్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇలా వారిని దూరంగా ఉంచడం తమ పార్ట్ నర్ కి నచ్చకపోవడం వల్ల.. వారి మధ్య విభేదాలు రావడం మొదలయ్యే అవకాశం ఉంది.

66

5.మకర రాశి..
ఈ రాశివారికి ఎక్కువగా పనిమీద మాత్రమే దృష్టి ఉంటుంది.  పని, వృత్తి గురించి మాత్రమే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఇది వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఎదురుచూసే వారి భాగస్వామిని చాలా నిరాశపరుస్తుంది. మకరరాశి వారు తమ భాగస్వామి భావాలను అంగీకరించడానికి నిరాకరిస్తారు కాబట్టి వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం

Read more Photos on
click me!

Recommended Stories