ఈ రాశివారికి పొగడ్తలే ఇంధనం.. కాస్త మెచ్చుకుంటే చాలు రెచ్చిపోతారు..

Published : Jul 07, 2022, 10:52 AM ISTUpdated : Jul 07, 2022, 10:55 AM IST

పొగడ్త.. బూస్ట్ లాంటిది.. శరీరానికి చక్కటి ఉత్సాహాన్నిస్తుంది. మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఇక కొన్ని రాశులవారికైతే చిన్న మెచ్చుకోలు చాలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. 

PREV
16
ఈ రాశివారికి పొగడ్తలే ఇంధనం.. కాస్త మెచ్చుకుంటే చాలు రెచ్చిపోతారు..

పొగడ్తలు, ప్రశంసలు ఎవరికైనా నచ్చుతాయి. ఉత్సాహాన్ని పెంచుతాయి. మరింతగా పనిచేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అసూయా, ద్వేషాలతో నిండిన ప్రపంచంలో ఓ వ్యక్తిని మెచ్చుకోవడం.. పొగడడం అంటే అంత మామూలు విషయం కాదు. అందుకే అలాంటి అభినందన వస్తే వారు బాగా ఇష్టపడతారు. ఇంకొంతమంది ఇవ్వేమీ పట్టించుకోరు తాము చేసే పనిని అభినందించినా.. లేకపోయినా చేసుకుంటూ వెళ్లిపోతారంతే. చిన్న మెప్పుకోలుకు అద్భుతంగా పనిచేసే...రాశుల వారు ఎవరో ఒకసారి చూడండి. 

26

మేషం
మేషరాశివారు తాము చేసిన పనిని నలుగురికీ చెప్పి మెప్పు పొందాలని చూస్తారు. అయితే, అది పైకి కనిపించకుండా ఏదో కాజువల్ గా చేసినట్టుగా కనిపిస్తారు. మెప్పు కోసమే పనులు చేస్తారని కూడా అనుకోవచ్చు. తాము చేసిన పని మీద చాలా నమ్మకంగా ఉంటారు. ఇది ధృవీకరించడానికి పొగడ్తలు ఉండనే ఉన్నాయి. 

36

కర్కాటకం 
వీరు చాలా సున్నితమనస్కులు. పొగడ్తలను ఇష్టపడతారు. పొగడ్తలు వీరికి అహాన్ని పెంచడానికో... తృప్తి పరచడం కోసమో కాదు. వారు చేసిన చిన్న పనైనా ప్రశంసలు, గుర్తింపు పొందడం వారికి చాలా ఇష్టం. చివరికి కళ్లతో ప్రశంసాపూర్వకంగా చూసినా వారు సంతోషిస్తారు. అయితే పొగడ్తలు అందుకోవడం ఎలాగో వీరికి తెలియదు. అందుకే చాలా లోప్రొఫైల్ తో, షై గా ఉంటారు. అంటే వీరికి పొగడ్తలు ఇష్టం లేదని కాకపోవచ్చు. 

46
Leo

సింహం
వీరికి తమను ఎవరినైనా గుర్తించాలని.. పొగడ్తలతో ముంచెత్తాలని కోరుకుంటారు. పొగిడే వాళ్లను బాగా ఇష్టపడతారు. అతిగా పొగుడుతున్నారని అర్తమైనా వారు మిమ్మల్ని ఇష్టపడతారు. ఏ పని చేసినా ఎదుటివారు గుర్తించాలని, మెచ్చుకోవాలని, పొగడాలని చూస్తారు. 

56

తులారాశి
తులారాశివారు అంతగా గుర్తింపు కోరుకోరు. కానీ తమకే తెలియకుండా పొగడ్తలను ఆకర్షించే విధంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. తాము లోప్రొఫైల్ లో ఉన్నామని తెలపడానికి ఇష్టపడతారు. అలా కూడా పొడ్తలు వస్తే ఈజీగా అంగీకరిస్తారు. 

66

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి కూడా పొగడ్తలు ఇష్టం. అయితే ప్రతీసారి పొగడ్తలు కావాలని అనుకోరు. అయితే, డ్రెస్సింగ్ సెన్స్ మీదో, వంట మీదో అభినందనలు అందకపోతే బాధపడతారు. 

Read more Photos on
click me!

Recommended Stories