ఈ రాశివారికి సంగీతమంటే ప్రాణం..!

Published : Jun 16, 2022, 10:06 AM IST

మరి కొందరు ఆ సంగీతాన్ని ఆలపించడం మొదలుపెడతారు. ఈ కింద రాశులు మాత్రం.. సంగీతమే ఊపిరిగా జీవిస్తారు. ఆ సంగీతాన్ని మరింత ఎక్కువగా ఇష్టపడే ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

PREV
16
 ఈ రాశివారికి సంగీతమంటే ప్రాణం..!

సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. సంగీతాన్ని ఎక్కువగా వినే ఉంటారు. అయితే.. చాలా కొద్ది మంది మాత్రం సంగీతమే ప్రాణంగా బతుకుతారు. వారికి ఆనందమేసినా.. బాధ వేసినా కూడా సంగీతం వినడానికి ఇష్టపడతారు.  మరి కొందరు ఆ సంగీతాన్ని ఆలపించడం మొదలుపెడతారు. ఈ కింద రాశులు మాత్రం.. సంగీతమే ఊపిరిగా జీవిస్తారు. ఆ సంగీతాన్ని మరింత ఎక్కువగా ఇష్టపడే ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

26

వృషభ రాశి..

 పని ఒత్తిడి..ఏదైనా గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడటానికి  వీరు సంగీతాన్ని ఎంచుకుంటారు.  వీరికి సంగీతం.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉపశమనం కలిగిస్తుంది.  సంగీతాన్ని ఇష్టపడే వారితో వీరు ఎక్కువగా స్నేహం చేయాలని అనుకుంటారు. రోజంతా అలసిపోయినా వీరికి సంగీతం వినగానే ఉపశమనం లభిస్తుంది. విశ్రాంతి లభించినట్లు ఫీలౌతారు.
 

36

సింహ రాశి..

సంగీతం ఈ రాశివారికి వారికి తెలియకుండానే విశ్వాసాన్ని నింపుతుంది. ఈ రాశివారు ఎక్కువగా పాటలు వినడానికీ, పాడటానికి ఇష్టపడతారు. అదే సంగీత అభిరుచి ఉన్న వ్యక్తులకు మరింత చేరువ కావడానికి కూడా ఇది సహాయపడుతుంది. వారి స్ఫూర్తిని నింపే పాట విన్నప్పుడల్లా వారిలోని నిప్పు రాజుకుంటుంది. వీరికి సంగీతం అంటే ప్రాణం.

46

తులారాశి

 ఈ రాశివారికి సరదాగా పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. అయితే... ఆ పార్టీలో పాటలు లేకుంటే మాత్రం వీరికి నచ్చదు. అది అసంపూర్ణంగానే వీరు భావిస్తారు. వీరు ఎప్పుడూ జోష్ ఉన్న పాటలను వినడానికి ఎక్కువగా ఇష్టపతారు. సంగీతం నిత్యం వీరిలో ఉత్సాహం నింపుతూ ఉంటుంది. డల్ గా ఉన్న సమయంలో వీరు సంగీతం వినడానికి ఇష్టపడారు. 
 

56


కుంభ రాశి..

వీరు సంగీతాన్ని అమితంగా ఇష్టపడతారు. సంగీతం ఎలాంటి సమస్యనైనా నయం చేస్తుందని వీరు భావిస్తుంటారు.  వారు తమ పనిని చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే చేయడానికి ఇష్టపడతారు. పాటలు వింటున్నప్పుడు వారు వ్యక్తులతో ఎక్కువగా కనెక్ట్ అవుతారని వారు భావిస్తారు, అది వారి హృదయాన్ని ఆనందింప చేస్తుంది.

66

మీన రాశి..

వారు అత్యంత సృజనాత్మక రాశిచక్రం అందువల్ల, వారు సంగీతాన్ని ఇష్టపడతారు, అది లేకుండా వారి జీవితాన్ని ఊహించలేరు. మారుతున్న సంగీత అభిరుచులతో, వారు మంచి కోసం ఒక వ్యక్తిగా కూడా మారతారు. సంగీతం మీన రాశివారి  సురక్షితమైన స్వర్గధామం.

click me!

Recommended Stories