ప్రేమ.. అద్భుతమైన విషయం. ఇందులో పడినవారికి ప్రపంచం అంతా ప్రేమమయంగానే కనిపిస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడుతుంటారు. అయితే కొంతమంది సినిమాతారలతో ప్రేమలో పడతారు. అలాంటి రాశులు ఏవంటే..
Valentine's Day 2023- 6 Zodiac Signs Will Find Love This Year
ప్రపంచంలో ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. అంతేకాదు ప్రేమకు సాధ్యం కానిది ఏదీ లేదని చాలామంది నమ్ముతారు. అందుకే తమ సోల్ మేట్ కోసం వెతుకుతారు. మరికొందరు మరో అడుగు ముందుకువేసి తమ అభిమాన సినీ తారలతో ప్రేమలో పడుతుంటారు. వారే తమ జీవిత సర్వస్వం అని గుడ్డిగా నమ్ముతుంటారు. వారితో రిలేషన్ అనే ఊహల్లో విహరిస్తుంటారు. అయితే, ఇది వారి రాశిప్రభావమేనట. మరి అలాంటి రాశులు ఏవో మీరే చూడండి.
27
వృషభం : ఈ రాశివారికి విలాసవంతంగా, గ్రాండ్ గా ఉండాలి ఏదైనా. ప్రేమ విషయానికి వచ్చేసరికీ ఇదే వర్తిస్తుంది. అందుకే తాము ప్రేమించే వ్యక్తి ఎంతో గొప్పవ్యక్తి అయి, నేమ్, ఫేమ్, మనీ ఉన్నవారై ఉండాలనుకుంటారు. అందుకే తరచుగా సినీతారల నేమ్, ఫేమ్ కు పడిపోతుంటారు. వారితో ప్రేమలో పడి.. ఆ ఊహల్లో తేలుతుంటారు.
37
సింహరాశి : వీరికి సినీ నటుల ప్రతీ కదలికా ఓ అద్భుతమే. అంతరాంతరాల్లో వారిలా ఉండాలని కోరుకుంటుంటారు. అందుకే సినీ నటులతో ప్రేమలో పడుతుంటారు. ఆ జీవితాన్ని, వారి కీర్తిని.. పేరును ఎంజాయ్ చేయాలనుకుంటారు.
47
తులారాశి : వీరికి మెరిసేదంతా ఇష్టమే. అందుకే ఎప్పుడూ వెండితెరమీద వెలిగిపోయే సినీ తారలతో ప్రేమలో సులభంగా పడిపోతారు. వారితో సంబంధం కోసం ఎంతకైనా వెడతారు. సినీ నటులతో సంబంధం వారి జీవితంలో జరిగే ఉత్తమమైన విషయాలలో ఒకటి.
57
ధనుస్సు : ఈ రాశి వారు విలాసవంతమైన, కాలుమీద కాలేసుకుని గడిపేసే జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు, కాబట్టి వారు సినిమా నటులతో ప్రేమలో పడే అవకాశం ఉంది. సినిమా తారలు అనుభవించే లావిష్‌నెస్, సౌకర్యాలు, సుఖాలు వీరికి బాగా ఇష్టంగా ఉంటాయి. వారితో చిన్నపాటి పరిచయం, ప్రేమ, సంబంధం ఏదైనా కానీ వీరిని బాగా సంతోష పెడుతుంది.
67
మీనరాశి : వీరికి పూలపాన్పులపై తేలిపోతూ... శృంగారంలో మునిగిపోవడం మాత్రమే ఇష్టమైన కలలు. అందుకే సినీ నటుల జీవితాల్లో అలాంటి సందర్భాలే ఉంటాయని నమ్ముతారు. వారితో ప్రేమలో పడతారు. సినీ పరిశ్రమలోని జంటల మీద వారి అంచనాలు భారీగానే ఉంటాయి. కాబట్టి, వారు తమను తాము ఇలాంటి సంబంధంలో ఊహించుకుంటారు. అది వారిని సంతోషపరుస్తుంది.
77
ప్రేమలో చాలా వాస్తవికంగా ఉండే రాశులేవంటే...
మేష, మిథున, కర్కాటక, కన్యా, వృశ్చిక, మకర, కుంభ రాశుల వారు ప్రేమ విషయంలో చాలా వాస్తవికంగా ఆలోచిస్తారు. సౌకర్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపగలిగే జీవిత భాగస్వామి కావాలనుకుంటారు. దీనికోసం చాలా వాస్తవిక ప్రమాణాలు, అంచనాలను పెట్టుకుంటారు.