Zodiac sign: ఈ రాశులవారికి గొడవలంటే భయం..!

First Published Aug 9, 2022, 11:28 AM IST

అభిప్రాయాలు చెప్పడం వల్ల.. గొడవలు జరుగుతాయని  చాలా మంది భయపడుతూ ఉంటారు. కొందరు ఎలాంటి వణుకు, బెరుకు లేకుండా తమ మనసులో మాట చెప్పేస్తారు. కానీ కొందరు వణికిపోతారు. 

ప్రతి ఒక్క విషయంపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని కొందరు వెంటనే భయటపెడుతూ ఉంటారు. కొందరు మాత్రం.. తమ అభిప్రాయాన్ని కూడా తొందరగా బయటపెట్టలేరు. అభిప్రాయాలు చెప్పడం వల్ల.. గొడవలు జరుగుతాయని  చాలా మంది భయపడుతూ ఉంటారు. కొందరు ఎలాంటి వణుకు, బెరుకు లేకుండా తమ మనసులో మాట చెప్పేస్తారు. కానీ కొందరు వణికిపోతారు. ఈ కింద రాశుల వారు కూడా అంతే... గొడవలు అంటే భయంతో వణికిపోతారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

1.తుల రాశి..

ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో వీరికి సరిగా తెలీదు. తొందరగా గొడవల జోలికి వెళ్లరు. ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు.. ఎవరో ఒకరి పక్షాన నిలపడటం  ఎలాగో కూడా వీరికి తెలీదు. రెండు వైపుల వారికీ ఏమీ చెప్పలేరు. వీరు గొడవలను చాలా ద్వేషిస్తారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీరు చాలా ఇబ్బంది పడతారు.

2.మీన రాశి...

వీరు కనీసం కొద్దిగా ఒత్తిడిని కూడా భరించలేరు. వీరు గొడవలకు దూరంగా ఉంటారు. అలా అని వారిని రెచ్చగొడితే మాత్రం విశ్వరూపం చూపిస్తారు. అందుకే.. మరీ అవసరమైతే తప్ప.. వీరు గొడవల జోలికి వెళ్లరు. వీరికి నచ్చదు. ఎలాంటి గొడవల జోలికి వెళ్లకుండా.. ఉత్తమంగా ఉండేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు.

3.సింహ రాశి..

ఎదుటివారు కూడా తమపై వాదనకు దిగుతున్నారు అన్నప్పుడు వీరు చాలా ఆందోళన చెందుతారు. వీరు కూడా వీలైనంత వరకు ఒత్తిడిని భరించలేరు. గొడవలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్య అయినా.. సామరస్యంగానే పరిష్కరించాలని వారు అనుకుంటూ ఉంటారు. అయితే.. సమస్య వచ్చినప్పుడు వారి కోసం  వారు నిలపడతారు.
 

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు ఏదైనా సున్నితమైన విషయంలో పాలుపంచుకున్నప్పుడు విషయాలు అధ్వాన్నంగా ఉంటాయి. వారు చాలా సున్నితంగా ఉంటారు కానీ తమ ప్రియమైన వారికి ఏదైనా జరిగితే వారు కోపంగా ఉంటారు. వారు బహిరంగ ఘర్షణలకు దాదాపు దూరంగా ఉంటారు. సమస్య ప్రైవేట్‌గా పరిష్కరించడానికి హామీ ఇస్తారు.

5.ధనస్సు రాశి..
బంతి తమ కోర్టులో లేనప్పుడు వారు చాలా దూకుడుగా ఉంటారు. వారు నిష్క్రియాత్మకంగా-దూకుడుగా ఉంటారు. మానిప్యులేటివ్ పదాలు, చర్యలతో పరిస్థితిని మార్చగలరు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడాన్ని వారు ద్వేషిస్తారు, ఎందుకంటే వారు వినోదాన్ని ఇష్టపడే స్వేచ్ఛా-ఉద్వేగ వ్యక్తులు.

మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం రాశులవారు తమ తలరాతను మార్చుకుంటారు. వచ్చిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. వారు వెనక్కి తగ్గరు.

click me!