ఈ రాశివారు ఎలాంటి ఒత్తిడినైనా హ్యాండిల్ చేయగలరు..!

Published : Mar 03, 2022, 02:22 PM IST

అయితే.. కొందరు మాత్రం ఎలాంటి ఒత్తిడినైనా ఈజీగా తట్టుకోగులుగుతారు. చిరునవ్వుతో ఆ ఒత్తిడి నుంచి బయటపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులు ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొంటారట. మరి ఆ రాశులేంటో చూద్దామా..

PREV
16
ఈ రాశివారు ఎలాంటి ఒత్తిడినైనా  హ్యాండిల్ చేయగలరు..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. వారిలో చాలా మంది ఒత్తిడి కారణంగానే ఈ సమస్యలతో బాధపడుతూ ఉండటం గమనార్హం. ఒత్తిడిని హ్యాండిల్ చేయం అంత సులభమైన విషయం కాదు.  అయితే.. కొందరు మాత్రం ఎలాంటి ఒత్తిడినైనా ఈజీగా తట్టుకోగులుగుతారు. చిరునవ్వుతో ఆ ఒత్తిడి నుంచి బయటపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులు ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొంటారట. మరి ఆ రాశులేంటో చూద్దామా..

26

1.వృషభ రాశి..
వృషభరాశి ప్రజలు చాలా కంపోజ్డ్ గా ఉంటారు.  క్లిష్ట పరిస్థితుల  నుంచి  ఎలా బయటపడాలో వీరికి బాగా తెలుసు. ఎంత ఒత్తిడి ఉన్నా.. వీరు ప్రశాంతంతను కోల్పోరు. దానికి బదులు.. ప్రశాంతంగా ఆలోచించి.. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. 

36

2.తుల రాశి...
ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు, ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కోవడంలో వీరు  చాలా తెలివిగా ఆలోచిస్తారు.  వారు ప్రతిదానిలో సమతుల్యతను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.  ఒత్తిడి ఎలా జయించాలో వీరికి బాగా తెలుసు.

46

3.కన్య రాశి..
కన్యారాశికి సంబంధించినంత వరకు, వారు ప్రతిదానిపై నియంత్రణ కలిగి ఉంటారు. అవి ఆచరణాత్మకమైనవి, సహేతుకమైనవి. ఎల్లప్పుడూ అందరికంటే ఒక అడుగు ముందుంటారు. ఒత్తిడి తమ దరి చేరనివ్వరు. నియంత్రణ కోల్పోకుండా.. ముందే సమస్య రాకుండా చూసుకుంటారు. ఎక్కడ ఎలా చేస్తే సమస్య రాకుండా ఉంటుందో ముందే ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటారు.

56

4.మకర రాశి..
అత్యంత తార్కిక , ఆచరణాత్మక రాశిచక్రం చిహ్నాలలో ఒకటి,  ఎంత ఒత్తిడి దరిచేరినా వీరు  చాలా కంట్రోల్డ్ గా ఉంటారు. చాలా నియంత్రణతో ఉంటారు. వారు తెలివైనవారు మాత్రమే కాదు, మానసికంగా చాలా బలంగా ఉంటారు. బాధ పడేబదులు దాని గురించి తెలివిగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలో చాలా వ్యూహాత్మకంగా ఉంటారు.

66

5.మీన రాశి..
అన్ని రాశిచక్రాలలో, మీనం అత్యంత సున్నితమైన రాశులలో ఒకటి. వారు తీవ్రమైన భావోద్వేగాలను అనుభవిస్తారు, కానీ ఒత్తిడిని నిర్వహించడానికి చాలా ఓపికగా ఉంటారు. ఉద్రిక్త పరిస్థితులతో ఎక్కువ పని చేయకుండా, వారు గందరగోళాన్నితగ్గించుకునేలా  శాంతపరచడానికి మార్గాలను అన్వేషిస్తారు. 

click me!

Recommended Stories