కర్కాటక రాశి అబ్బాయిల లక్షణాలు ఇలానే ఉంటాయి..!

Published : Mar 02, 2022, 11:15 AM IST

సంబంధంలో ఉన్నప్పుడు, వారు సాధారణంగా వారితో ఉన్న వ్యక్తి పట్ల నమ్మకద్రోహంగా ఉంటారు. వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే, ఎమోషనల్ గా..  భాగస్వామిని కంట్రోల్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు.  

PREV
17
కర్కాటక రాశి అబ్బాయిల లక్షణాలు ఇలానే ఉంటాయి..!

కర్కాటక రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. వారి మాటలు సైతం చాలా మృదువుగా ఉంటాయి.  ఈ రాశి అబ్బాయిలు.. చాలా బలహీనంగా ఉన్నారు అనుకునేలోపు.. తమ బలహీనతలనే బలంగా మార్చుకుంటారు. మరి ఈ రాశి అబ్బాయిలకు ఉన్న ఇతర లక్షణాలేంటి..? వీరు ప్రేమ, పెళ్లి విషయంలో ఎలా ఆలోచిస్తారు అనే విషయాలు తెలుసుకోవాల్సిందే.

27


కర్కాటక రాశి పురుషులు భావోద్వేగంగా ఉంటారు. శ్రద్ద కూడా చాలా ఎక్కువ. అయితే.. వృత్తిరీత్యా చాలా సోమరిపోతులు. వారు కొన్ని పనిని పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటారు 

37

వారు పనిలో జాప్యం చేస్తారు.సంబంధంలో ఉన్నప్పుడు, వారు సాధారణంగా వారితో ఉన్న వ్యక్తి పట్ల నమ్మకద్రోహంగా ఉంటారు. వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే, ఎమోషనల్ గా..  భాగస్వామిని కంట్రోల్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

47

కర్కాటక రాశివారు.. తాము ప్రేమించిన వారి విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు. వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేయడానికి ముందుంటారు. జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు.

57

ఈ రాశివారికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. వీరు ప్రేమ విషయంలో గతంలో జరిగిన దేనినీ మర్చిపోరు. ఎవరైనా తప్పు  చేస్తే క్షమిస్తారు. కానీ దానిని మర్చిపోయారు అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. అన్నీ గుర్తుంటాయి. కానీ మర్చిపోయినట్లే ఉంటారు.

67

కర్కాటక రాశి అబ్బాయిలకు మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ. ఒక్కోసారి మంచిగా ఉంటారు.. మరోసారి చాలా చిరాకుగా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారో.. ఎప్పుడు డల్ గా ఉంటారో అస్సలు ఊహించలేం.

 

77

కర్కాటక రాశి పురుషులు భావోద్వేగంగా ఉంటారు కానీ మూర్ఖులు కాదు. చాలా మానిప్యూలేటివ్ గా ఉంటారు. ఎదుటివారు చెప్పిన దానిని మొత్తం మార్చేయగలరు. తమ పని పూర్తి చేసుకోవడానికి ఏమైనా చేస్తారు.
 

click me!

Recommended Stories