తల్లిదండ్రులను ప్రేమించని, గౌరవించని పిల్లలు ఉండరు. తల్లిదండ్రులంటే అందరికీ అభిమానం ఉంటుంది. అయినప్పటికీ, కొంతమంది పిల్లలు వారి తండ్రి లేదా తల్లితో ప్రత్యేకంగా సన్నిహిత బంధాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రుల పట్ల సమానమైన గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ, వారిలో ఒకరి పట్ల వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మానసిక స్థితి వారి రాశిని బట్టి ఏర్పడుతుంది. అంటే కొన్ని రాశుల వారు తమ తల్లి లేదా తండ్రికి ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. కొన్ని రాశుల వారు తమ తండ్రులకు చాలా దగ్గరగా ఉంటే మరికొన్ని రాశుల పిల్లలు తమ తల్లులకు చాలా దగ్గరగా ఉంటారు. కుంభం, ధనుస్సు రాశులతోపాటు నాలుగు రాశుల వారికి తండ్రితో సన్నిహిత సంబంధాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశులవారికి తండ్రి అంటే అమిమైన ప్రేమ. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..