ఈ రాశివారికి పిల్లలు చుక్కలు చూపిస్తారు..!

First Published Sep 23, 2021, 10:48 AM IST

కొన్ని రాశుల తల్లిదండ్రులకు మాత్రం.. ఈ రాశి పిల్లలు పుడితే నరకం కనపడుతుందట. కొన్ని రాశుల పేరెంట్స్ కి.. ఈ రాశుల పిల్లలు చెత్త కాంబినేషన్ అట. ఇద్దరికీ ప్రశాంతత ఉండదు. ఆ రాశుల కాంబినేషన్ ఏంటో ఓసారి చూసేద్దామా.

అన్ని బంధాల్లోకెల్లా.. తల్లీ- బిడ్డ బంధం చాలా గొప్పదని అందరూ చెబుతుంటారు. ఎలాంటి స్వార్థం లేకుండా.. పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తారు. వారి నుంచి తిరిగి కేవలం  ప్రేమ తప్ప.. మరేమీ ఆశించనివారినే తల్లిదండ్రులంటారు.  అయితే.. ఈ కొన్ని రాశుల తల్లిదండ్రులకు మాత్రం.. ఈ రాశి పిల్లలు పుడితే నరకం కనపడుతుందట. కొన్ని రాశుల పేరెంట్స్ కి.. ఈ రాశుల పిల్లలు చెత్త కాంబినేషన్ అట. ఇద్దరికీ ప్రశాంతత ఉండదు. ఆ రాశుల కాంబినేషన్ ఏంటో ఓసారి చూసేద్దామా.
 

1.మేషం-కర్కాటకం..

మేష రాశివారి పిల్లలు లక్ష్యాలు, ఆశయాల పట్ల అత్యంత ఉత్సాహభరితంగా ఉంటారు. ఈ రాశివారు విజయం సాధించడం కోసం , ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కానీ.. కర్కాటక రాశివారిలో మాత్రం ఆ ఉత్సాహం ఉండదు. కర్కాటక రాశివారు మంచి మనసు కలిగి ఉంటారు. కానీ.. సాధించాలనే ఉత్సాహం మాత్రం పెద్దగా ఉండదు. ఈ క్రమంలో.. ఈ రెండు రాశులు పేరెంట్, చైల్డ్ అయితే.. ఇద్దరి అభిప్రాయాలు తేడాగా ఉండి.. ఇబ్బంది పడే అవకాశం ఉందట.

2.మిథునం-వృషభం..
మిథునం, వృషభం ఈ రెండు రాశులు పూర్తిగా భిన్నమైన వ్యక్తులు అని చెప్పొచ్చు.  మిథున రాశివారు చాలా గొప్ప మాట్లాడగలరు. ఎక్కువ మంది జనాల మధ్య ఉండాలని కోరుకుంటారు.  అయితే.. వృషభ రాశివారు మాత్రం అలా కాదు.. వీళ్లు అంతర్ముఖులు. మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టరు. ఎక్కువ మందిలో కూడా కలవలేరు. ఈ రెండు రాశులు.. పేరెంట్, చైల్డ్ అయితే.. అభిప్రాయాలు కలవక.. ఇద్దరూ దూరమయ్యే అవకాశం ఉంది.

3.సింహం-కుంభ రాశి

సింహ రాశిలో పుట్టిన వారు అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు. అందరూ తమను గుర్తించాలని అనుకుంటారు. ఎక్కువ మందితో స్నేహం చేయాలని అనుకుంటారు. తాము చేస్తున్న పనిని అందరూ గుర్తించాలని అనుకుంటారు. అయితే... కుంభ రాశివారు దీనికి భిన్నం. వీరు తొందరగా ఎవరితోనూ కలవరు. ఎదుటివారి నిర్ణయాలను పెద్దగా పట్టించుకోరు. ఈ క్రమంలో.. ఈ రెండు రాశుల కాంబినేషన్ ముఖ్యంగా పేరెంట్, చైల్డ్ విషయంలో అస్సలు సెట్ కాదు.

4.తుల- కన్య రాశి..
తుల రాశివారు ఎప్పుడూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అంతేకాకుండా.. ఎప్పుడూ భద్రత గురించి ఆలోచిస్తుంటారు. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే.. కన్యా రాశివారు అలా ఉండరు. పూర్తి భిన్నంగా ఉంటారు. ఈ క్రమంలో ఈ రెండు రాశుల మధ్య బేధాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఒకరికి భిన్నంగా మరొకరు వ్యవహరిస్తూ ఉంటారు.

5.మకరం- ధనస్సు..
ఈ మకర రాశి, ధనస్సు రాశులు కూడా పూర్తిగా వ్యతిరేకులు. ఒకరు పాజిటివ్ గా ఉంటే.. మరొకరు నెగిటివ్ గా ఉంటారు. ఒకరు ప్రాక్టికల్ గా ఉంటే.. మరొకరు ఊహల్లో బతికేస్తూంటారు.ఈ రెండు రాశులు.. ఒకరి జీవితాన్ని మరొకరు ఇష్టపడరు. ఈ క్రమంలో వీరి మధ్య తేడాలు వస్తూ ఉంటాయి.
 

6.వృశ్చికం- సింహం..
వృశ్చిక రాశి.. సింహ రాశి.. ఈ రెండింటికీ అనుకూలత అస్సలు ఉండదు. ఈ రెండు రాశుల్లో న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి. అయితే.. వీరు ఒకరి మాట మరొకరు వినాలి అనుకోరు. ఇద్దరూ ఆధిపత్యం చలాయించాలని చూస్తంుటారు. దాని వల్ల విభేదాలు వస్తూ  ఉంటాయి.

7.మీనం- ధనస్సు..
ఈ రాశులు నిజంలో కంటే.. కలల్లోనే ఎక్కువగా విహరిస్తూ ఉంటారు. అయితే.. ధనస్సు రాశివారు తమ కలలను నిజం చేసుకోవాలని.. వాటిని కార్య రూపం లోకి తీసుకురావాలని చూస్తుంటారు. కానీ.. మీన రాశివారు మాత్రం.. ఆ కలను నిజం చేసుకోవడానికి భయపడిపోతుంటారు. దీంతో.. వీరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.

click me!