ఈ రాశివారు చాలా తెలివిగలవారు..!

Published : Sep 21, 2021, 02:16 PM IST

 మీరు ఏ విషయాన్ని ఎలా ఆలోచిస్తారు.. ఎంతలా వాటిని ఆచరణలో పెడతారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే.. ఈ తెలివి తేటలను రాశుల ప్రకారం చెప్పవచ్చట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎంత తెలివైన వారో  చెప్పొచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

PREV
113
ఈ రాశివారు చాలా తెలివిగలవారు..!

తెలవి తేటలను ఐక్యూ లెవల్స్ తో కొలుస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. మీ ఆలోచనలు, చేసే పనులను పట్టి కూడా మీ తెలివి తేటలను అంచనా వేయవచ్చు. మీరు ఏ విషయాన్ని ఎలా ఆలోచిస్తారు.. ఎంతలా వాటిని ఆచరణలో పెడతారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే.. ఈ తెలివి తేటలను రాశుల ప్రకారం చెప్పవచ్చట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎంత తెలివైన వారో  చెప్పొచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

213

1.మేష రాశి..
ఈ రాశివారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకుంటారు. దాని వల్ల ఈ రాశివారు తెలివి తేటలను  పెంచుకుంటారట.  ఈ రాశివారు చాలా మంచివారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. జీవితంలో మార్పులకు అనుగుణంగా వీరు ఉండకపోవచ్చు. వీరు చేయాలి అనుకున్నది మాత్రం చేస్తుంటారు.  అన్నింట్లో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు తమ సొంత మార్గంలో ముందుకు దూసుకుపోతుంటారు. వీరు అన్ని విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. తాము కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వీరు చాలా కష్టపడతారు. అన్ని మార్గాల్లోనూ వీరు ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు.

413

3. మిథున రాశి..
వీరు ఎక్కువగా గందరగోలంలో ఉంటారు. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. విభిన్నమైన మార్గంలో వెళ్తుంటారు. వీరు చాలా తెలివిగలవారు.. కానీ లక్ష్యాలను చేరుకోవడంలో మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

513

4. కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా స్వచ్ఛంగా ఉంటారు. అందరితోనూ చాలా నమ్మకంగా ఉంటారు. వీరు తమ మనసు చెప్పినట్లు నడుచుకుంటారు. తమ సొంత ప్రయోజనాల కోసం చాలా తెవివిగా ఎదుటివారితో కనెక్ట్ అవుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. వీరికి జీవితంలో అన్ని ఆనందాలు, విలాసాలు లభిస్తుంటాయి.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు చాలా ఆడంబరంగా ఉంటారు. దాని వల్ల వీరు ఆధిపత్యం కలిగి ఉంటారు. అయితే.. వీరు అనూహ్యంగా తొందరపాటుతో తప్పులు చేస్తుంటారు. కానీ వీరు ఆచరణాత్మకంగా ఆలోచించి.. దానికి తగినట్లు వ్యహరిస్తుంటారు.  మీరు  చాలా వేగంగా పనిచేస్తుంటారు. కాబట్టి ఇతరులకు వీరు చాలా తెలిగలవారిలా కనిపిస్తుంటారు.
 

713

6.కన్య రాశి..
ఈ రాశివారు చాలా బలహీనంగా ఉంటారు. కాబట్టి ఏ విషయంలోనూ తొందరగా నిర్ణయం తీసుకోలేరు. ఎదుటివారి అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.  పరిస్థితులను తొందరగా అర్థం చేసుకోలేరు. అన్ని విషయాలను అర్థం చేసుకోవాడనికి వీరికి చాలా సమయం పడుతుంది. 
 

813

7. తుల రాశి..
ఈ రాశివారికి గొప్ప తెలివితేటలు ఉన్నాయి. ఏది కరెక్ట్.. ఏది రాంగ్ అనే విషయం వీరికి బాగా తెలుస్తుంది. వీరు తమ జీవితంలో లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరి తెలివితేటలే వీరికి చాలా గొప్ప బలాన్ని చేకూరుస్తాయి.

913

8. వృశ్చిక రాశి..
ఈ రాశివారికి తెలివి తేటలు వారసత్వంగా వస్తాయి. కాబట్టి.. వీరు చాలా సహజంగానే తెలవితేటలు కలిగి ఉంటారు. తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకు కూడా చక్కగా వివరించగలరు. వీరికి అపారమైన జ్ఞానం ఉంది. టీచర్ జాబ్ వీరికి బాగా సూట్ అవుతుందనే చెప్పాలి.
 

1013

9. ధనస్సు రాశి..
ఈ రాశివారు కష్టపడి పనిచేయడానికి ముందుంటారు. వీరిది మృదు స్వభావం. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటారు. కష్టపడి పనిచేసి విజయాన్ని అందుకుంటారు. తెలివితేటలతోపాటు.. వీరికి శ్రద్ధ కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు.

1113


10. మకర రాశి..
ఈ రాశివారు చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. వీరి మనస్తత్వమే వీరికి మంచి వ్యాపారం అని చెప్పొచ్చు. వీరు సాధారణంగా అత్యంత విజయవంతమైన వారిలో ఒకరుగా చెప్పొచ్చు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు.

1213

11. కుంభ రాశి.
ఈ రాశివారు చాలా తెలివిగలవారు. వీరికి మేధోశక్తి చాలా ఎక్కువ. చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. దానికి తగినట్లుగానే నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రశాంతంగా ఆలోచిస్తారు.  అదే వీరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.

1313

12. మీన రాశి..
ఈ రాశివారు చాలా ఎమోషనల్. ప్రతి విషయంలో ఎదుటివారిపై ఆధారపడుతూ ఉంటారు.  అయితే.. వీరికి చాలా తెలివి తేటలు. అవి వారికి బలాన్ని ఇస్తాయి. అయితే.. వాటిని వేరే విధంగా పోగొట్టుకుంటారు. విజయం చేరుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతుంటారు. 

click me!

Recommended Stories