వృషభ రాశి స్త్రీలు ఎంతో సాధారణంగా ఉంటారు. వారు కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరిలో ప్రేమ, ఆప్యాయత, అందం, సంబంధాలకు విలువ ఇచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు పెళ్లి తర్వాత భర్త అవసరాలు అడగకుండానే అర్థం చేసుకుంటారు. కుటుంబాన్ని చక్కగా నడిపించడంలో వీరు నిష్ణాతులు. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మానసికంగా సపోర్ట్‌గా ఉంటారు. భర్త ఆర్థిక ఎదుగుదల కోసం ఉపయోగపడే సలహాలు ఇస్తారు.