Venus and Saturn: శుక్ర శని షడాష్టక యోగంతో ఈ 4 రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలే లాభాలు

Published : Jun 29, 2026, 07:46 AM IST

Venus and Saturn: జ్యోతిషశాస్త్రంలో షడాష్టక యోగం ఎంతో బలమైనది. శుక్ర, శని గ్రహాలు 150° వద్ద కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తాయి.ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారికి గొప్ప విజయాలు దక్కుతాయి. ఆనందకమైన జీవితాన్ని గడుపుతారు. 

PREV
14
మేష రాశి

షడాష్టక యోగం వల్ల మేష రాశి వారికి వృత్తిపరమైన విజయాలు దక్కుతాయి. ఉద్యోగం వ్యాపారం చేసే చోట ఈ రాశి వారి ప్రత్యర్థులు ఓడిపోతారు. ఈ రాశి వారిలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి. వీరి జీవితంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

24
మిథునం

షడాష్టక యోగం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను తెస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు బాగా వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి పేరున్న వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన కోర్టు తీర్పు వారికి అనుకూలంగా రావచ్చు.

34
కర్కాటక రాశి

శుక్ర, శని గ్రహాల ఈ కలయిక కర్కాటక రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జీవితం నుండి ప్రతికూలత తొలగిపోయి, సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధాలు మరింతగా బలపడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

44
తులా రాశి

శుక్ర, శని గ్రహాల ఈ కలయిక తులారాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారు మానసికంగా మరింత బలంగా మారుతారు. వ్యాపార ఒప్పందాలు వీరికి దక్కే అవకాశం లభించవచ్చు. వీరు విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories