Published : Apr 14, 2022, 02:05 PM ISTUpdated : Apr 14, 2022, 02:08 PM IST
కొంతమందిలో కొన్ని లక్షణాలు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తాయి. వారితో స్నేహం చేసేలా చేస్తాయి. అయితే ఈ సుగుణాలు జాతకరాశి ప్రకారం ఉంటాయని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మరి మీ రాశి ప్రకారం మీలో ఎలాంటి సుగుణాలున్నాయో చూడండి.
మేషరాశి (Aries)
మీ నిజాయితీనే మిమ్మల్ని ఎదుటివారు ఇష్టపడేల చేస్తుంది. నమ్మకస్తులుగా, ఎలాంటి కల్మషం లేని మనస్తత్వం మిమ్మల్ని నలుగురిని ఆకర్షించేలా చేస్తుంది.
212
Representative Image: Taurus
వృషభరాశి (Taurus)
వృషభరాశి వారు ఎలాంటి నిర్ణయాన్నైనా చిటికెలో తీసుకుంటారు. ఈ స్వభావామే వీరిని నలుగురిలో ఆకర్సించబడేలా, స్నేహం చేయడానికి ఇష్టపడేలా చేస్తుంది.
312
మిధునరాశి ( Gemini)
అందరితో సులభంగా కలిసిపోవడం, స్నేహపూరితంగా ఉండడం, సోషల్ లైఫ్ ఈ రాశివారిలో ఆకర్షంచే సుగుణం.
412
కర్కాటకరాశి ( Cancer)
కర్కాటకరాశి వారు పాటించే విలువలు, బాధ్యతల పట్ల కట్టుబడి ఉండే తత్వం అందరినీ ఆకర్షిస్తుంది. అన్నిటికంటే మించి మీలోని ప్రేమగుణమే మిమ్మల్ని ప్రత్యేకంగా మార్చేస్తుంది.
512
Leo
సింహరాశి (Leo)
సింహరాశివారి వ్యక్తిత్వమే వారికి ఆభరణం. దయాగుణం, తెలివైన, చురుకైన వ్యక్తిత్వం అందరిలో వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది.
612
(Virgo)
కన్యారాశి (Virgo)
కన్యారాశివారు తరచుగా విమర్శిస్తూనే ఉంటారు. అయితే వీరికి ఇష్టపడేవారికి ఈ రాశివారు ప్రేమించిన వారికోసం ఎంతగా తపిస్తారో.. వారి బాగుకోసం విమర్శిస్తారో తెలుసు.
712
(Libra)
తులారాశి (Libra)
తులారాశివారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి పరిస్తితుల్లోనూ తమ ప్రశాంతతను కోల్పోరు. అందుకే తులారాశివారంటే అందరూ ఆకర్షిస్తుంటారు.
812
Scorpio
వృశ్చికరాశి (Scorpio)
వృశ్చికరాశి వారు సున్నిత మనస్కులుగా ఉంటారు. బైటికి కఠినంగా, భయంకరంగా కనిపించినా లోపల మాత్రం వీరు చాలా మృధుస్వభావులుగా ఉంటారు.
912
ధనుస్సురాశి (Sagittarius)
మీ ప్రియమైన వారి పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు ఈ ధనుస్సు రాశివారు. అదే వీరిలోని ఆకర్షించే సుగుణం. అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ జనాలుంటారు.
1012
Capricorn
మకరరాశి (Capricorn)
మకర రాశివారు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడరు. తము నమ్మినదానికోసం పనిచేసుకుంటూ వెళ్లిపోతారు. వీరి నిబద్ధతకే జనాలు ఆకర్షితులవుతారు.
1112
(Aquarius)
కుంభరాశివారు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో, కఠిన పరిశ్రమ చేస్తారు. ఇదే ఎదుటివారిని ఆకర్షిస్తుంది.
1212
(Pisces)
మీనరాశి (Pisces)
మీనరాశివారు గట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అదే సమయంలో అంతే సున్నితమనస్కులు ఉంటారు. ఇది అరుదైన మంచి కాంబినేషన్.