పిల్లిని దురదృష్టంగా ఎందుకు చూస్తారో తెలుసా?

First Published | Mar 25, 2024, 10:50 AM IST

ఎటైనా వెళ్తున్నప్పుడు పిల్లి అడ్డురావడం అశుభంగా భావిస్తారు. దీనివల్ల ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకునేవారు కూడా ఉంటారు. కొంతమంది అయితే పిల్లలను ఇంట్లోకి కూడా రానీయరు. అసలు పిల్లులను అశుభంగా ఎందుకు చూస్తారో తెలుసుకుందాం పదండి.

పిల్లుల గురించి జనాల్లో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అయితే చాలా మంది పిల్లలను చెడుగా, అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లులు దారికి అడ్డురావడాన్ని పెద్దలు అశుభంగా భావిస్తారు. అందుకే పిల్లి అడ్డు వచ్చినప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేస్తుంటారు. లేదా కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరుతారు. అసలు పిల్లలను అశుభంగా ఎందుకు భావిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పిల్లి ఎవరి వాహనం? 

పురాణాల ప్రకారం.. పిల్లిని రాహువు వాహనంగా భావిస్తారు. రాహువు రాక్షస గ్రహంతో సంబంధం కలిగి ఉంటాడు. అందుకే పిల్లిని చెడుగా, అశుభంగా పరిగణిస్తారు. అందుకే వీటిని చాలా మంది ఇండ్లలోకి రానీయరు. 


Cats

నల్ల పిల్లి 

నల్ల పిల్లిని అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా ఇది దారికి అడ్డురావడం మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే నలుపు రంగు శనితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఇది మంచిది కాదని చెప్తారు.
 

Cats

నల్లపిల్లి

నల్ల పిల్లి మన ఇంట్లోకి నెగిటివిటీ తెస్తుందని నమ్ముతారు. అలాగే పురాతన కాలంలో.. రాత్రిపూట పిల్లి కళ్లను చూసి భయపడేవారు. ఎందుకంటే రాత్రిపూట నల్లపిల్లి కళ్లు ఒక్కటే కనిపిస్తాయి. అలాగే అవి మెరుస్తాయి. ఇప్పటికైనా చాలా మంది రాత్రిపూట పిల్లులను చూడాలంటే భయపడతారు.
 

Cats

పరిశుభ్రత కారకాలు 

పిల్లులు చిన్న చిన్న జీవులను, ఎలుకలను వేటాడి తింటుంటాయి. కానీ దీనివల్ల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అలాగే పిల్లులు తన నాలుకతో తనను తాను శుభ్రం చేసుకుంటాయి. అందుకే వీటికి చాలా మంది ఇండ్లలోకి రానీయరు. అలాగే పిల్లలు ఇళ్లునంతా మురికిగా చేస్తాయి. వీటివల్ల చిన్న పిల్లలకు సమస్యలు వస్తాయి. 
 

ప్లేగు కారణాలు 

ప్లేగు కారణంగా ఐరోపా జనాభాలో సగం మంది మరణించారు. ఈ వ్యాధి ఎలుకల ద్వారా వ్యాపించింది. ఎందుకంటే పిల్లి ఎలుకలను తింటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

పురాణాల కారణాలు

ఈజిప్టులో పిల్లిని పైశాచిక జీవిగా భావించేవారు. అందుకే పిల్లులను అశుభంగా భావిస్తారు. వాటిని ఇంట్లోకి రానీయరు. 

Latest Videos

click me!