వీళ్లు బంగారాన్ని పెట్టుకోకూడదా?

Published : Jan 27, 2024, 10:32 AM ISTUpdated : Jan 27, 2024, 10:34 AM IST

బంగారాన్నిఇష్టపడని వారు ఒక్కరూ కూడా ఉండరు. అందులో ఆడవాళ్లకైతే బంగారమంటే పిచ్చి. ఫంక్షన్లు, పెళ్లిళ్లకు వాళ్లదగ్గరున్న బంగారు నగలను ఒంటినిండా వేసుకెళ్తుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు బంగారాన్ని ధరించకూడదు. 

PREV
16
వీళ్లు బంగారాన్ని పెట్టుకోకూడదా?

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆభరణాలు ధరించేటప్పుడు రాశి చక్రాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని రాశుల వారిని బంగారు ఆభరణాలు ప్రభావితం చేస్తాయట. కాగా పెళ్లైన తర్వాత ఆడవారు బంగారు ఆభరణాలనే ఎక్కువగా వేసుకుంటారు. కానీ బంగారు ఆభరణాలను ధరించడం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా పరిగణించబడదు. ఏయే రాశుల వారు బంగారు ఆభరణాలను వేసుకోకూడదో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

26

బంగారు ఆభరణాలు

పెళ్లికాని అమ్మాయిలు బంగారు ఆభరణాలను ఎక్కువగా వేసుకోరు. కానీ పెళ్లైన తర్వాత మొత్తం బంగారు ఆభరణాలను మాత్రమే వేసుకుంటారు. నిజానికి బంగారం ఆడవాళ్ల అందాన్ని మరింత పెంచుతుంది. అందుకే డబ్బులుంటే చాలు రకరకాల బంగారు ఆభరణాలను కొంటుంటారు. 
 

36

వృషభ రాశి

బంగారు  ఆభరణాలు మీ అందాన్ని పెంచేవే అయినా.. కొన్ని రాశుల వారు వీటిని ధరించకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృషభ రాశి వారు బంగారాన్ని పెట్టుకోకూకడదు. ఒకవేళ వీళ్లు బంగారాన్ని పెట్టుకుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. 
 

46
Gemini

మిథున రాశి 

మిథున రాశి వారు కూడా బంగారు ఆభరణాలను పెట్టుకోవడం మానుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇది సూర్యుని ప్రతికూల శక్తితో కనెక్ట్ అవుతుంది. ఈ కారణంగానే వీళ్లు బంగారాన్ని ధరించడం సరైందిగా పరిగణించరు. 
 

56
Scorpio Zodiac

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు కూడా బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరించడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ రాశి వారు బంగారు ఆభరణాలను ధరించడం వల్ల ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి జాతకులు బంగారం ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని నమ్ముతారు. అలాగే ఇది ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.
 

66
Aquarius


కుంభ రాశి

కుంభ రాశి వారు కూడా బంగారు ఆభరణాలకు దూరంగా ఉండాలట. ఎందుకంటే ఇది వారి జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపదు. ఎందుకంటే కుంభ రాశి ప్రభావంలో శని ఉందని నమ్ముతారు. అలాగే సంబంధాలలో అసమతుల్యత ఏర్పడుతుందని నమ్ముతారు.
 

Read more Photos on
click me!

Recommended Stories