బంగారం కొనడానికి మంచి రోజులు ఇవే..!

First Published | Aug 9, 2024, 3:11 PM IST

బంగారం ధర తగ్గిందని తెలిస్తే చాలు.. బంగారం షాపుల్లో వాలిపోతారు. కానీ జ్యోతిష్యం ప్రకారం.. బంగారాన్ని వారంలో కొన్ని రోజుల్లోనే కొనాలి. అవి ఏ రోజులు? ఎందుకో తెలుసా?
 

ప్రతి ఒక్కరికీ.. వీలైనంత ఎక్కువ బంగారం కొనాలని ఉంటుంది. నిజానికి బంగారం కూడా ఒక ఆస్తే. అవసరానికి దీన్ని వాడుకోవచ్చని చాలా మంది భావిస్తారు. అందుకే డబ్బులుంటే ముందుగా గుర్తొచ్చేది, కొనాలనిపించేది బంగారమే. చాలా మంది ధర కాస్త తగ్గినా బంగారాన్ని కొనేస్తుంటారు.

హిందూ మతంలో బంగారాన్ని ఒక పవిత్రమైన లోహంగా భావిస్తారు. అందుకే దీనిని కొనే ముందు శుభ, అశుభ సమయాలు, రోజులను చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో బంగారాన్ని కొంటే బంగారం అనేక రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. ఈ విధంగా వారంలో ఏ రోజు బంగారం కొంటే అదృష్టం కలుగుతుందో ఇప్పడు తెలుసుకుందాం.. పదండి.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బంగారం కొనడానికి వారంలోని మంచి రోజుల గురించి మాట్లాడితే.. సోమవారం, మంగళవారం, గురువారం, ఆదివారాలు ఉత్తమమైన రోజులుగా భావిస్తారు. ఈ రోజుల్లో మీరు బంగారాన్ని కొంటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 

పుష్య నక్షత్రం

ఈ నక్షత్రానికి చెందిన బృహస్పతి.. పుష్య నక్షత్రం నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ఈ రోజుల్లో మీరు బంగారాన్ని కొంటే మీ ధనం రెట్టింపు అవుతుంది. 
 

సూర్య గ్రహానికి చిహ్నం శనివారం. సూర్యునికి శని మధ్య శత్రుత్వం ఉన్నందున శనివారం నాడు బంగారాన్ని కొనకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయినా సరే శనివారం నాడే మీరు బంగారాన్ని కొంటే మీ ఆర్థిక పరిస్థితి ప్రభావితం అవుతుంది. అలాగే శని భగవానునికి కోపాన్ని కలిగిస్తుంది.

Latest Videos

click me!