వాస్తు ప్రకారం.. బెడ్ రూం ఏ కలర్ లో ఉండాలి?

First Published | Mar 23, 2024, 9:51 AM IST

వాస్తు ప్రకారం.. ఇళ్లు ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు రావని చెప్తారు జ్యోతిష్యులు. మరి వాస్తు ప్రకారం.. బెడ్ రూం ఏయే రంగులో ఉంటే మంచిదో తెలుసా? 
 

చాలా మంది వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మిస్తారు. అలాగే ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడుంటే మంచిదో అక్కడే పెడతారు. వాస్తు ప్రకారం.. ఇంట్లోని గోడల కలర్ ను కూడా చూసుకోవాలి. గోడల రంగు కూడా శుభ, అశుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ధాంపత్య జీవితం బాగుండాలంటే బెడ్ రూంలోని గోడలక ఏ కలర్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వైట్ కలర్

చాలా మంది వైట్ కలర్ ను బాగా ఇష్టపడతారు. అందుకే ఇంట్లో మొత్తం వైట్ పెయింట్ నే వేస్తారు. వైట్ కలర్ ను శాంతికి చిహ్నంగా భావిస్తారు. మీ పడకగది గోడలకు తెల్ల రంగు ఉంటే మీ లైఫ్ సాఫీగా సాగుతుంది. కష్టాలు అనేవి రావు. అలాగే మీ జీవితంలో శాంతి నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


పచ్చరంగు  

కొంతమంది ఆకుపచ్చ రంగును కూడా బాగా ఇష్టపడతారు. మీ పడకగది గోడలు ఆకుపచ్చ రంగులో ఉంటే అంతా మంచే జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతున్నారు. దీనివల్లో మీ ఇంటిని వ్యక్తులందరి వ్యక్తుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే  ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉండదు. 

నారింజ

బెడ్ రూం కు నారింజ రంగును వేయడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఇది బెడ్ రూంను మరింత అట్రాక్ట్ గా మారుస్తుంది. అయితే పడకగదిలో నారింజ రంగు ఉంటే మీ సృజనాత్మకత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య భావోద్వేగ సంబంధం మెరుగుపడుతుంది. 

నీలం రంగు 

నీలం రంగు కూడా బెడ్ రూం ను మరింత అందంగా మారుస్తుంది. కలర్ ఫుల్ గా చేస్తుంది. మీ పడకగదిలో నీలం, ఆకాశం, నీటి రంగు ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలాంటి రంగు బెడ్ రూం కి ఉంటే మీ ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. 
 

పసుపు రంగు

పసుపు రంగు చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే బెడ్ రూంలో ఇలాంటి కలర్ ను వేస్తారు. అయితే పసుపు కలర్ ను తెలివితేటలకు చిహ్నంగా భావిస్తారు. పడకగదిలో  ఎల్లో కలర్ ఉంటే మిమ్మల్ని సులభంగా సంపద, కీర్తి, విజయాలను ఆకర్షిస్తుంది.

Latest Videos

click me!