ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ పెట్టాలి?

First Published | May 17, 2024, 3:21 PM IST

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి. అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి? ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది. వాస్తు ప్రకారం.. వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే.. దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అప్పుడే ఆ వస్తువు నుంచి మీరు ప్రయోజనాలను పొందుతారు. ఇలాంటి వస్తువులను తప్పుడు ప్రదేశంలో పెడితే అశుభం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో వెండి వస్తువులను సరైన ప్రదేశంలోనే ఉంచడం చాలా అవసరం. మరి ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

వెండి వస్తువులను ఇంట్లో ఎక్కడ ఉంచాలి?

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. వెండి తెలుపు రంగులో ఉంటుంది. అయితే ఈ తెలుపు రంగును చంద్రుడికి చిహ్నంగా భావిస్తారు. వెండికి అధిపతి చంద్రుడు. అందుకే ఇంట్లో వెండిని ఉంచడానికి సరైన ప్రదేశం చంద్రుని దిక్కుగా భావిస్తారు.


జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. చంద్రుడు పడమటి దిశలో ఉదయించి తూర్పు దిక్కులో అస్తమిస్తాడు. ఏదైనా గ్రహానికి సంబంధించిన ఏదైనా లోహాన్ని గ్రహం ఉద్భవించే దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఇది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. 
 


మీ ఇంట్లో వెండి వస్తువులు ఉంటే అంటే ఆభరణాలు లేదా మరేదైనా వస్తువు ఉన్నట్టైతే వాటిని మీ ఇంటికి పడమర దిశలో ఉంచండి. అప్పుడే మీరు వెండి నుంచి ప్రయోజనాలను పొందుతారు. వెండి వస్తువులను ఇంట్లో ఉంచడానికి కూడా ఒక మార్గం ఉంది. వెండి వస్తువులను ఎప్పుడూ కూడా ఎరుపు వస్త్రంలో చుట్టాలి. దీనివల్ల జాతకంలో చంద్రుని స్థానం బలంగా మారి మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇలా ఎర్రని బట్టలో ఉంచి పడమర దిశలో ఉంచితే చంద్రుని వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు

Latest Videos

click me!