చీపురును ఎక్కడ, ఎలా పెట్టాలి?

First Published | May 30, 2024, 4:50 PM IST

చాలా మంది చీపురును ఇళ్లును ఊడిచిన తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం.. చీపురును ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పెట్టకూడదు. వాస్తు ప్రకారం.. చీపురును ఎలా పెట్టాలంటే?

వాస్తు ప్రకారం.. ఇంట్లో ప్రతిదీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చీపురుకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఈ చీపురులో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని నమ్ముతారు. అందుకే దీనిని సరైన ప్రదేశంలో పెట్టడం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. అయితే చాలా మంది చీపురును ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పెట్టేస్తుంటారు. కానీ తప్పుడు మార్గంలో చీపురును పెడితే మీపై ప్రతికూల ప్రభావాలు పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే చీపురును ఎలా? ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

చీపురు ప్రాముఖ్యత 

చీపురు కేవలం ఇంటిని శుభ్రం చేసే ఒక వస్తువు మాత్రమే కాదు. దీనిలో సంపద దేవత లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే చీపురును పొరపాటున కూడా తొక్కకూడదు. దీనిలో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఒకవేళ మీరు చీపురును తొక్కినట్టైతే లక్ష్మీదేవతను అవమానించినట్టే అవుతుంది. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. 
 


ఇలా చీపురు పెట్టొద్దు 

చీపురును ఎలా పడితే అలా పెట్టేస్తుంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం.. చీపురును ఎప్పుడూ కూడా నిలువుగా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశించదు. దీనివల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

చీపురును ఏ దిశలో ఉంచాలి?

చీపురును ఇంటికి పడమర దిశలో ఉంచడం మంచిదని భావిస్తారు. వాస్తు ప్రకారం.. ఈ దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మీకు ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే వాస్తు ప్రకారం.. చీపురును పడుకోబెట్టాలి. అలాగే మంచం కింద అస్సలు ఉంచకూడదు. 

చీపురుతో ఇళ్లు ఉడిచిన తర్వాత  చీపురును ఎవరికీ కనిపించని ప్రదేశంలోనే పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.  ఒకవేళ మీరు చీపురును అందరికీ కనిపించేటట్టు పెడితే మీ ఇంట్లో  పాజిటివ్ ఎనర్జీ  పోయి నెగిటీవ్ ఎనర్జీ వస్తుంది.  

విరిగిపోయిన, పాడైన చీపురును ఇంట్లో ఉంచడం అశుభంగా భావిస్తారు. మీ ఇంట్లో అలాంటి చీపురు ఉంటే వెంటనే పారేయండి. సాయంత్రం వేళ చీపురుతో ఊడవకూడదు. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. అలాగే రాత్రిపూట ఊడ్చకూడదు.

Latest Videos

click me!