రెండు బల్లుల కొట్లాట
మీరు ఎప్పుడైనా.. మీ కలలో రెండు బల్లులు కొట్లాడుకున్నట్టు చూసారా? అయితే మీరు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ కల.. మీరు మీ జీవితంలో ఎన్నో సమస్యలను, అడ్డంకులను ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తుంది. పీడకలల ప్రభావం తగ్గాలంటే వాటిని మీకు తెలిసిన వారిలో చర్చించండి. అలాగే దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి దానధర్మాలు చేయండి.