telugu astrology
సింహ రాశి వారు అధికార హోదాలో ఉంటే.. ఆత్మవిశ్వాసంతో, సృజనాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, ఆశాజనకంగా , నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటారు. వారు చాలా అధికారికంగా, కమాండింగ్‌గా కూడా ఉంటారు. ఇవి వీరిలోని ప్రధాన లక్షణాలు.
ఈ రాశివారికి న్యాయకత్వ లక్షణాలు బాగా తెలుసు. నాయకులు ఎలా ఉండాలో వీరికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆత్మవిశ్వాసం కారణంగా.. వారు గొప్ప నాయకులుగా గుర్తింపు పొందుతారు. ఈ రాశివారు..తమ కింద పనిచేసే ఉద్యోగులను ఉత్తేజపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు.
ఈ రాశివారు చాలా సరదాగా కూడా ఉంటారు. ఈ లక్షణంతో వీరు ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించగలరు, తమ టీమ్ ని కూడా సులభంగా మ్యానేజ్ చేయగలరు.
ఈ రాశివారు తమ కింది ఉద్యోగులను కమాండ్ చేయగలరు. ప్రోత్సహించగలరు, తమ ఉద్యోగులతో నిజాయితీగా కూడా ఉండగలరు.
ఈ రాశి బాస్ లు ఉదారంగా కూడా ఉంటారు. తమ కింద ఉద్యోగులు బాగా కష్డపడినప్పుడు.. వారికి కచ్చితంగా రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. తమ టీమ్ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకాడరు.
సింహ రాశికి చెందిన బాస్ లుకు క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అది వారిలో ఉన్న మరో ప్రత్యేక లక్షణం. సమస్యలు వచ్చినప్పుడు చాలా తెలివిగా ఆలోచించి పరిష్కరించడంలో వీరు ముందుంటారు.
అయితే... ఈ రాశివారు ఒక్కోసారి బండరాయిలాగా , మొండిగా ఉంటారు. వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలో వీరు ముందుకురారు. అది అప్పటి వారి మూడ్ ని బట్టి ఉంటుంది.