చంద్రగ్రహణం రోజు ఏయే పనులు చేయకూడదు?

First Published Mar 21, 2024, 1:15 PM IST

హోలీ నాడే చంద్రగ్రహణం వచ్చింది. అయతే ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. ఒకవేళ అవి చేశారంటే మీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సివస్తుంది. 
 

చంద్రగ్రహణానికి సైన్స్ నుంచి మతం, జ్యోతిషం వరకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంఘటన. హిందూ గ్రంధాలలో గ్రహణం గురించి చాలా నియమాలు ఉన్నాయి. గ్రహణం సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదని జ్యోతిష్యులు చబుతున్నారు. అవేంటంటే? 

2024లో చంద్రగ్రహణం ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 25 న ఫాల్గుణ పూర్ణిమ నాడు వస్తుంది. ఈ నెల 25న ఉదయం 10.24 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 3.01 గంటల వరకు ఉంటుంది. మరి చంద్రగ్రహణం సమయంలో ఏయే పనులు చేయకూడదంటే?

ఆహారం తినకూడదు.

జ్యోతిష్యం ప్రకారం.. చంద్రగ్రహణం సమయంలో మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల మీరు ఈ సమయంలో ఆహారం తినడం కానీ, వండటం కానీ చేయకూడదు. 
 

బయటకు రావొద్దు..

చంద్రగ్రహణం సమయంలో కడుపుతో ఉన్న ఆడవారు ఇంట్లో నుంచి అస్సలు బయటకు రాకూడదు. ఎందుకంటే గ్రహణం గర్భంలో ఉన్న శిశువుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు.
 

పదునైన వస్తువులను ఉపయోగించడం 

చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు పదునైన వస్తువులను ఉపయోగించకూడని జ్యోతిష్యులు చెబుతున్నారు. పదునైన వస్తువులంటే.. కత్తెర, చాకులు, సూదులు మొదలైన వాటిని ఉపయోగించొద్దు. ఎందుకంటే ఇది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
 

నిద్రపోకూడదు

హిందూ పురాణాల ప్రకారం.. గ్రహణ సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇలా నిద్రపోవడాన్ని అశుభంగా భావిస్తారు. గ్రహణ సయమంలో నిద్రపోతే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

పూజ చేయకూడదు

కొంతమంది తెలియకుండా గ్రహణ సమయంలో కూడా పూజలు చేస్తుంటారు. కానీ గ్రహణ సమయంలో పూజలు అస్సలు చేయకూడదు. అలాగే ఇంటి ఆలయాన్ని కూడా తెరిచి ఉంచకూడదు. దీన్ని చెడుగా భావిస్తారు. 

తులసి చెట్టును ముట్టుకోకూడదు

చంద్రగ్రహణం ఏర్పడినప్పటి నుంచి ముగిసే వరకు తులసి మొక్కను అస్సలు తాకకూడదని జ్యోతిష్యులుచెబుతున్నారు. గ్రహణం సమయంలో ఒక్క తులసి మొక్కనే కాదు ఏ మొక్కను కూడా తాకకూడదు. 
 

click me!