
జీవితంలో ప్రేమ రావడం ఒక అదృష్టం. అయితే.. ఒక్కోసారి.. ఆ ప్రేమ జీవితాంతం ఉండకవచ్చు. వివిధ రకాల కారణాల వల్ల.. చాలా మంది బ్రేకప్ ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే.. బ్రేకప్ ని ఒక్కొక్కరు ఒక్కోలా హ్యాండిల్ చేస్తారు. కొందరు కొన్ని రోజులు ఏడ్చి ఆ తర్వాత ఊరుకుంటారు.. మరికొందరు.. గతాన్నే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మీ రాశి చక్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలా బ్రేకప్ ని హ్యాండిల్ చేస్తారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
వీరు బ్రేకప్ ని తట్టుకోవడం కాస్త కష్టమే. అయితే... కొన్ని సార్లు మార్పు కూడా మంచిదే అని విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతాన్ని మార్చలేరు.. కానీ భవిష్యత్తును మార్చుకునే సత్తా మీలో ఉంటుంది. బాధ ఉంటుంది.. కానీ దానిని దిగమింగుకుంటే.. మార్పు మీకు మరింత సహాయం చేస్తుంది.
2.వృషభ రాశి..
ఈ రాశివారికి బ్రేకప్ తర్వాత దానిని మర్చిపోయి ముందుకు సాగడానికి సమయం తీసుకుంటారు. అయితే.. మీరు విడిపోవడం తప్ప దేనికైనా దృష్టి పెట్టలేరు. కాబట్టి... మీరు అన్నింటినీ వదిలేస్తున్నారనే వాస్తవం గురించి భయపడొద్దు.
3.మిథున రాశి..
ఈ రాశివారు ఛాలెంజెస్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి విడిపోయినా.. దానిని నుంచి బయటపడాటానికి ఒక సవాలుగా తీసుకోవాలి. విచారంగా ఉండకూడదు. దానిని మర్చిపోయి ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించాలి.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు విడిపోయిన తర్వాత కూడా తమ మాజీల గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారి కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అయితే... అలా మీ మాజీల గురించి ఆలోచించడానికి ముందు.. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
5.సింహ రాశి..
సింహ రాశివారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. కాబట్టి.. ఇలాంటి బ్రేకప్ లు మిమ్మల్ని ఏమీ చేయలేవు అనే విషయాన్ని గుర్తించాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రకాశవంతంగా ఉండగలరనే ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి. అప్పుడు బ్రేకప్ ని సులభంగా తట్టుకోగలరు.
6.కన్య రాశి..
మీరు విడిపోవడం చాలా విచారకరం కావచ్చు. కానీ దానిని మళ్లీ అందంగా మార్చగల శక్తి మీలో ఉంది. ఆ బ్రేకప్ ని మీరు ఒక పాఠంగా భావించి.. ముందుకు కదిలితే.. మీ అంత సంతోషమైన వ్యక్తి మరొకరు ఉండరు.
7.తుల రాశి..
ఒక్కసారి బ్రేకప్ అయితే ఏంటి..? మీ జీవితంలో ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. ఒక్కసారి బ్రేకప్ మిమ్మల్ని గాయపరిచినా.. అది వెంటనే నయం అవుతుంది. మీ జీవితంలోకి కొత్త ప్రేమ మళ్లీ పుడుతుంది.
8.వృశ్చిక రాశి..
జీవితంలో ప్రేమ బ్రేకప్ కి దారి తీస్తే.. అది జీవితానికి ముగింపు కాదు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఆ విషయాన్ని మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే.. మీ జీవితం అంత అందంగా ఉంటుంది. ప్రేమ దూరం అవ్వడం బాధే కావచ్చు.. కానీ... అది మీ స్నేహితులు, సన్నిహితులకు దగ్గరై.. మళ్లీ మీ జీవితాన్ని కొనసాగించాలి.
9.ధనస్సు రాశి..
లవ్ బ్రేకప్ అయ్యిందని.. దాని గురించే ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చోకండి. మీకు అంతకు మించిన మంచి ఎదురు చూస్తోంది. బ్రేకప్ జరుగుతోందనే సంకేతాలు మీకు ముందుగానే తెలిసే అవకాశం ఉంది. అప్పుడే అలా జరగకుండా ఉండేలా ఏదో ఒక ప్రయత్నం చేయాలి. లేకపోయినా.. మీకు మరో రూపంలో అదృష్టం లభిస్తుందనే విషయాన్ని గ్రహించాలి.
10.మకర రాశి..
ఈ రాశివారు తొందరగా బ్రేకప్ చెప్పలేరు. ఎవరితో అయినా బాగా కనెక్ట్ అయితే.. వారిని వదలుకోలేరు. అయితే అనుకోకుండా బ్రేకప్ జరిగినా.. భవిష్యత్తులో జరిగే మంచి మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఈ నమ్మకం మీలో ఉంటే చాలు.
11.కుంభ రాశి..
ఈ రాశివారు లవ్ లో ఫెయిల్ అయినా.. బ్రేకప్ అయినా.. ప్రేమించిన వారితో పాటు.. ఇతరులకు కూడా దూరమౌతారు. సన్నిహితులను దూరం పెట్టడం కరెక్ట్ కాదు అని మీతో చాలా మంది చెప్పే ప్రయత్నం చేయవచ్చు.. కానీ.. మీరు మీ ప్రేమ తాలుకూ బాధను దూరం చేసుకోవడానికి కొంత కాలం అందరినీ దూరం పెట్టాలని అనుకుంటారు. ఏది ఏమైనా ఆ బాధను మర్చిపోవడానికి వీరు ప్రయత్నాలు బాగానే చేస్తారు.
12.మీన రాశి..
ఈ రాశివారు.. బ్రేకప్ తర్వాత.. దానికి కారణాలు తెలుసుకనే ప్రయత్నాలు చేస్తారు. సమస్య ఏంటో తెలియకుండా విడిపోతే వీరు ప్రశాంతంగా ఉండలేరు. సమస్య ఇది అని తెలిస్తే.. భవిష్యత్తులో ఆ సమస్య మరోసారి రాకుండా ఉండేలా జాగ్రత్త పడతారు.