Zodiac sign: అన్ని రాశుల వారు ఒకేసారి టీమ్ ఔట్ కి వెళితే..?

Published : Jul 14, 2022, 12:16 PM IST

విభిన్న ఆలోచనలు ఉన్న అన్ని రాశులవారు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకుందాం. వారంతా కలిసి తమ బాస్ తో కలిసి టీమ్ ఔట్ కి వెళితే.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

PREV
113
 Zodiac sign: అన్ని రాశుల వారు ఒకేసారి టీమ్ ఔట్ కి వెళితే..?

ఏ ఒక్కరూ ఒకేలా ఉండరు. మన చేతి వేళ్లే.. ఒకేలా ఉండవు.. అలాంటిది విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషులంతా ఒకేలా ఉండాలని మనం అనుకోగలం. ఒక్కొక్కరు ఒక్కో మనస్తత్వం, అభిప్రాయం కలిగి ఉంటారు. అలా విభిన్న ఆలోచనలు ఉన్న అన్ని రాశులవారు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకుందాం. వారంతా కలిసి తమ బాస్ తో కలిసి టీమ్ ఔట్ కి వెళితే.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

213

1.మేష రాశి..
ఈ రాశివారు చాలా తెలివిగల వారు. తమ బాస్ నుంచి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే... అత్యంత ఖరీదైన ఫుడ్ ఆర్డర్ చేసేలా ప్లాన్ చేస్తారు. ఎంత ఎక్కువ బిల్ చేయాలా అనేది వీరి ఆలోచన.

313

2.వృషభ రాశి..
వృషభ రాశివారు.. తమతో పాటు వచ్చినవారందరూ కూర్చున్నారా లేదా చూస్తారు. తర్వాత.. అందరినీ చూసి ఒక ఫేస్ స్మైల్ ఇస్తారు. ఆ తర్వాత.. వెంటనే మెనూ కార్డ్ చూసి.. తమకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకుంటారు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు ముందుగా ఒక కాపిచ్చినో కాఫీ  ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత అందరితో బయటకు వచ్చినప్పుడు మీ బాస్ ఎలా ప్రవర్తిస్తారో ఈ రాశివారు పరిశీలిస్తారు.

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందరూ కంఫర్ట్ గా కూర్చున్నారో లేదో చూస్తారు. ఆ తర్వాత.. ఎవరెవరికి ఏం కావాలో ఆలోచిస్తారు. అందరిని ఎవరికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు టీమ్ ఔట్ అనగానే మంచిగా రెడీ అవుతారు. అక్కడకు వెళ్లగానే వీరు ఫోటోలు దిగాలని చూస్తుంటారు. అంతేకాదు.. తమతో వచ్చిన వారికి ఫోటోలు తీయమని అడుగుతారు. తమ ఫోటోల పిచ్చితో ఇతరులకు కోపం కూడా తెప్పిస్తారు.

713

6.కన్య రాశి..
కన్య రాశివారు టీమ్ లంచ్ కి వెళ్లినప్పుడు.. లీడర్ లా ప్రవర్తిస్తారు. ఎవరెవరికి ఏంకావాలో వీరే ఆర్డర్ చేస్తారు. వీరికి నచ్చిందే అందరికీ ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటారు.

813

7. తుల రాశి..
తుల రాశివారు.. సైలెంట్ గా కూర్చుంటారు. మెనూ కార్డు ముందు పెట్టుకొని కూర్చుంటారు. వారికి ఏం ఆర్డర్ ఇవ్వాలో కూడా ఓక్లారిటీ ఉండదు. కాబట్టటి.. మెనూ కార్డు చూస్తూ ఉంటారు.
 

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీరికి ఏమి ఆర్డర్ ఇవ్వాలో తెలుసు. కానీ.. ఆర్డర్ ఇవ్వకుండా ఆలస్యం చేసేవారిని నవ్వుతూనే విమర్శిస్తూ ఉంటారు.
 

1013

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు టీమ్ లంచ్ కి వెళ్లినప్పుడు.. అక్కడ దగ్గరలో ఉన్న వాతావరణం  మొత్తం స్కాన్ చేస్తారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే.. ఏది ఆసక్తికరంగా ఉంటే దానిని ఆర్డర్ చేస్తారు.

1113


10.మకర రాశి..
ఈ రాశివారు కనీసం మెనూ కార్డు కూడా చూడరు. ఎందుకంటే.. వీరికి ఏం ఆర్డర్ ఇవ్వాలి అనే క్లారిటీ చాలా ఎక్కువ. మెనూ కార్డు కూడా చూడకుండా.. ఏం ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటున్నారో అది ఆర్డర్ చేసేస్తారు.

1213

11.కుంభ రాశి..
ఈ కుంభ రాశివారు.. టీమ్ లంచ్ కి వెళ్లినప్పటికీ.. ఫుడ్ గురించి కాకుండా.. ఆఫీసులో గాసిప్స్ గురించే మాట్లాడుకుంటారు. ఈ గాసిప్స్ అంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో.. వారి దగ్గర కూర్చొని.. వాటి గురించి ఆసక్తిగా మాట్లాడుతూ ఉంటారు.
 

1313

12.మీన రాశి..
ఈ రాశివారు మెనూ కార్డు చూసి మురిసిపోతారు. మంచి ఫుడ్ ఆరగించవచ్చని సంబరపడతారు. విభిన్న రకాల ఆహారాన్ని రుచి చూస్తారు. ఆర్డర్ చేసి ప్రతి ఒక్క ఫుడ్ ఐటెమ్ ని వీరు రుచి చూస్తారు.
 

click me!

Recommended Stories