ఇంట్లో పిల్లి ఏడిస్తే ఏమౌతుంది?

First Published Apr 12, 2024, 1:14 PM IST

చాలా మంది పిల్లలను పెంచుకుంటారు. కొన్ని పిల్లులు పెంచుకోకున్నా ఇంట్లోకి వస్తుంటాయి. అయితే పిల్లి ఏడుపును అశుభంగా భావిస్తారు. అలాంటిది మన ఇంట్లో పిల్లి ఏడిస్తే ఏమౌతుందో తెలుసా?  
 

సనాతన ధర్మంలో శకున శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది ఇది మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనల సూచనల గురించి చెబుతుంది. అలాగే శకున శాస్త్రంలో పిల్లి ఏడుపు గురించి కూడా ప్రస్తావించబడింది. అసలు పిల్లి మన ఇంట్లో ఏడిస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

రాత్రిపూట ఏడుస్తున్న పిల్లి

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాత్రిపూట పిల్లి ఏడుపు వినడం అంత మంచిది కాదు. పిల్లి ఏడుపును అశుభంగా భావిస్తారు. ఏడుపుతో పిల్లి మీకు అపాయకరమైన సంఘటనల సంకేతాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

దురదృష్టానికి సంకేతం

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాత్రిపూట పిల్లి ఏడవడం రాబోయే దురదృష్టానికి సంకేతం కావొచ్చు. అంటే ఏడైనా చిన్న లేదా పెద్ద సమస్యలే రావొచ్చు. అందుకే ఇలాంటి సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. 
 

మరణ సంకేతం

పురాణాల ప్రకారం.. అర్ధరాత్రి పిల్లి ఏడుపు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీదగ్గరి, సన్నిహితుల మరణానికి సంకేతం కావొచ్చంటున్నారు జ్యోతిష్యులు. ఇలాంటి పరిస్థితిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


ఆర్థిక నష్టానికి సంకేతం

పిల్లి ఏడుపు ఆర్థిక నష్టానికి కూడా సంకేతం కావొచ్చంటున్నారు జ్యోతిష్యులు. బ్రహ్మ ముహూర్తంలో అంటే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పిల్లి మీ ఇంటి చుట్టూ ఏడవడం అస్సలు మంచిది కాదు. ఇది మీ ఇంటి ఆర్థిక నష్టానికి సంకేతం ఇస్తుంది. 

Cats


ఆరోగ్యంపై చెడు ప్రభావం 

అర్ధరాత్రి పిల్లి ఏడిస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేదన్న సంకేతాన్ని ఇస్తుంది. అందుకే ఇలాంటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది ఒకరి ఆరోగ్యం క్షీణించడానికి సంకేతం కూడా కావొచ్చు.


జ్యోతిషశాస్త్రం ప్రకారం పిల్లిని రాహువు సవారీగా భావిస్తారు. అందుకే పిల్లి మీ ఇంట్లో ఏడిస్తే అది దుష్ట శక్తుల రాకను సూచిస్తుంది. అలాగే ఇది ఏదైనా అనుకోని చెడు ఘటనను కూడా సూచిస్తుంది.
 

click me!