మీన రాశి
మీన రాశి వారికి పక్కవాళ్లను ఆకట్టుకునే లక్షణాలు లేవు. వీళ్లు పరోపకారులు. వీళ్లది దయ గుణం. వీళ్ల సమయాన్ని, తమ వస్తువులను ఇతరుల మంచి కోసం ఉపయోగిస్తారు. అయినా కానీ ప్రజల నుంచి ఈ రాశివాళ్లకు సరైన గుర్తింపు మాత్రం రాదు. ఎంత సాయం చేసినా ఈ రాశివారిని ఇతరులు పట్టించుకోరు. నిజానికి మీన రాశి వాళ్లు తమ చుట్టూ ఉన్నవారికి ఎంతో సహాయం చేస్తారు. కానీ ప్రశంసలు మాత్రం పొందరు. అందుకే వీళ్లు ఇతరుల నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్లడమే మంచిది.