ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేస్తే.. దోషాలన్నీ తొలగిపోతాయి..!

First Published | Apr 16, 2024, 4:36 PM IST

ఇంట్లోకి ఏ ఎనర్జీ అడుగుపెట్టాలి అనే విషయం మనం చేసే పనుల మీదే ఉంటుంది.  మనం గుమ్మం దగ్గర ఉంచే వస్తువులను బట్టి.. ఇంట్లోకి దానికి తగిన ఎనర్జీ ప్రవేశిస్తుంది.

Vastu Tips

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంటి గుమ్మం వద్ద రెండు రకాల శక్తులు ఉంటాయి.  ఒకటి పాజిటివ్ ఎనర్జీ అయితే.. మరోటి నెగిటివ్ ఎనర్జీ.  ఇంట్లోకి ఏ ఎనర్జీ అడుగుపెట్టాలి అనే విషయం మనం చేసే పనుల మీదే ఉంటుంది.  మనం గుమ్మం దగ్గర ఉంచే వస్తువులను బట్టి.. ఇంట్లోకి దానికి తగిన ఎనర్జీ ప్రవేశిస్తుంది.
 

మీరు గమనించారో లేదో.. చాలా మంది ఇంటి గుమ్మానికి ఉప్పుమూట కడుతూ ఉంటారు. ఇలా ఎందుకు కడతారు..? అలా కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? దీని గురించి జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారనే విషయం ఇప్పుడు చూద్దాం..


వాస్తు శాస్త్రంలో ఉప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని అయినా ఉప్పు తరిమికొడుతుందని నమ్ముతారు.  అందుకే.. ఆ ఉప్పును చిన్న మాటలాగా చేసి..ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడ దీస్తే.. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతుంది. అంతేకాకుండా.. ఇంటి వైపు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.


అంతే కాకుండా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కట్టను వేలాడదీయడం వల్ల ఇంటి ప్రధాన ద్వారం . మొత్తం ఇంటిలోని గ్రహ దోషాలు , వాస్తు దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. అంతేకాకుండా, జ్యోతిషశాస్త్రంలో ఉప్పు శుక్ర గ్రహానికి సంబంధించినది కాబట్టి, ఇంటి ప్రధాన ద్వారంపై ఉప్పు వేయడం వల్ల వైవాహిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

శుక్రుడు వివాహం, సంపద , ఐశ్వర్యానికి కారకంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కట్టను కట్టడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో సంపద  కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. అంతేకాకుండా ఇంట్లో  పేదరికం తొలగిపోతుంది. డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇంటి యజమాని జాతకంలో శుక్ర గ్రహం బలపడుతుంది. ఫలితంగా వారికి చాలా మంచి జరుగుతుంది.

Latest Videos

click me!