వంటింట్లో చీపురు పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 6, 2024, 12:34 PM IST

కొంతమంది ఏక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే చీపుర్లను పెట్టేస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆడవారు వంటింట్లోనే చీపురు పెడుతారు. కానీ ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
 

ఇళ్లను శుభ్రం చేయడానికి చీపుర్లను ఉపయోగిస్తాం. అయితే ఇళ్లు ఊకిన తర్వాత చీపుర్లను వంటగదిలో ఓ మూలన పెట్టేస్తుంటారు. దీనివల్ల చీపురు ఎక్కడుందో అని వెతుక్కోవాల్సిన అసవరం ఉండదు. కానీ చీపురును వంటింట్లో ఉంచకూడని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వంటగదిలో చీపురు ఉంటే

చాలా మంది ఆడవారు చీపురును వంటింట్లోనే ఒక దగ్గర పెడుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. వంటింట్లో చీపురును అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఇది మీ ఇంట్లో ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు కుటుంబ సభ్యులపై చెడు ప్రభావాన్ని కూడా చూపుతుంది. వంటగదిలో చీపురును పెట్టడం వల్ల కుటుంబ సభ్యులకు మంచిది కాదు. దీనివల్ల కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశం ఉంది. 
 

Latest Videos


లక్ష్మీదేవి రూపం

చీపురును సంపదదేవత అయిన లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే చీపురును తప్పుడు ప్రదేశాల్లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా పెడితే మీ ఇంటి ఆనందం, శ్రేయస్సును హరిస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి ఉండదు.

ఇంట్లోకి బ్యాక్టీరియా

వంటగదిలో చీపురును ఉంచడం వల్ల చెడు బ్యాక్టీరియా ఇంట్లోకి వస్తుంది. అలాగే వంటింట్లో ఉంచిన ఆహారం చెడిపోతుంది. దీనివల్ల మీకు లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వంటగదిలో చీపురు ఉంచకుండా ఉండాలి.
 

చీపురును ఉంచే దిశ 

ఇంట్లో చీపురు పెట్టుకునేటప్పుడు ప్రత్యేక దిశానిర్దేశం చూసుకోవాలి. వాస్తు ప్రకారం.. ఇంటి దక్షిణ, పడమర దిశలో చీపురును ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో జనాలు గమనించని చోట చీపురును ఉంచాలి. అలాగే చీపురును నిలబెట్టకూడదు. ముఖ్యమైన విషయం ఏంటంటే? మీ ఇంటి ఈశాన్య దిశ దిశలో చీపురును పెట్టకండి. ఎందుకంటే ఈ దిశలోభగవంతుడు కొలువై ఉంటాడు. 
 

click me!