ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుంది?

Published : Jan 28, 2024, 09:37 AM IST

అప్పుడప్పుడు శరీరంలోని కొన్ని భాగాలు అదురుతుంటాయి. వీటిలో కళ్లు ఒకటి. కొంతమందికి కుడి కన్ను అదిరితే.. మరికొంతమందికి ఎడమ కన్ను అదురుతుంది. మరి ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
16
ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుంది?
woman eye blinking

సముద్ర శాస్త్రంలో..  కళ్లు అదరడం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల కళ్లు అదరడం ఎన్నో సంకేతాలను ఇస్తుంది. ఇక కన్ను అదిరిందంటే ఆడవాళ్లు తెగ భయపడిపోతుంటారు. అసలు ఏ కన్ను అదిరితే మంచిది? ఏ కన్ను అదిరితే మంచిది కాదు? అని దీని గురించి తెగ ఆలోచించి భయపడిపోతుంటారు. నిజానికి చాలా మందికి ఏ కన్ను అదిరితో మంచిది అన్న ముచ్చట తెలియదు. అందుకే  ఈ ఆర్టికల్ ద్వారా మనం ఆడవాళ్ల ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుంది. ఇది శుభ సంకేతమా? అశుభ సంకేతమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

26
Blinking

మంచి పనులు చేస్తారు

ఆడవాళ్ల ఎడమ కన్ను అదరడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవును ఒక మహిళ ఎడమ కన్ను అదిరిందంటే వారే ఏవో మంచి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారన్న అర్థం వస్తుంది. కన్ను అదరడం దానికి సంకేతం. 
 

36
Eye Blinking Reason

కొత్తదానికి నాంది

శాస్త్రాల ప్రకారం.. ఆడవాళ్ల ఎడమ కన్ను అదరడం కొత్తదానికి ప్రారంభాన్ని సూచిస్తుంది.  అంతేకాదు ఇది వారి సంతోషం, అదృష్టానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.
 

46

దుస్తులు, ఆభరణాల కొనుగోలు

ఆడవాళ్ల ఎడమ కన్ను అదరితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదంటున్నారు జ్యోతిష్యులు. ఎందుకంటే ఎడమ కన్ను అదిరితే మీరు త్వరలో కొత్త బట్టలు లేదా ఆభరణాలు వంటి కొత్త వస్తువును కొనే అవకాశం ఉంది. 

56

అతిథులు వస్తారు

వాస్తు శాస్త్రం ప్రకారం.. మహిళల ఎడమ కన్ను అదిరితే మీ ఇంటికి అతిథులు వస్తారు. ఎడమ కన్ను అదరడం మీ ఇంటికి చుట్టాల రాకను చెప్తుంది. 

ధన లాభం

మహిళల ఎడమ కన్ను అదరడం కూడా భవిష్యత్తులో మీరు త్వరగా డబ్బు సంపాదించబోతున్నారనడానికి సంకేతం. ఈ కన్ను అదిరితే మీకు త్వరలో ధనలాభం కలగబోతుందని అర్థం వస్తుంది. 
 

66

శాస్త్రీయ కారణాలు

ఆడవాళ్ల ఎడమ కన్ను అదరడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. కంప్యూటర్, సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు గడపడం వల్ల ఇలా జరుగుతుందట. 

Read more Photos on
click me!

Recommended Stories