Today Horoscope: ఓ రాశి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది

First Published Jan 28, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారు ఈ రోజు చేసే పనులు లో లాభాలను పొందుతారు. విద్యార్థిని విద్యార్థులకు చదువులో ప్రతిభ చూపిస్తారు .కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు. ఉద్యోగాలు లో అదనపు పని భారం పెరుగుతుంది. 
 

28  -1-2024  ఆది వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

తలపెట్టిన పనులు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి గలరు. అధికారులు తో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను అదుపులో చేసుకొనవలెను. వృత్తి వ్యాపారాలు సంతృప్తి పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అకారణ కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఈ రాశి వారు ఓం మహా శూరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

Latest Videos


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

ప్రయత్న  కార్యాలు పూర్తి కాగలవు .బంధువర్గంతో సహాయ సహకారాలు అందుకోగలరు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మీ అవసరాల నిమిత్తం సరిపడినట్లు ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు సౌఖ్యములు పొందగలరు.ఈ రాశి వారు. ఓం ధైత్య గురవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

ఉద్యోగాలలో నిరుత్సాహంగా నుండును. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఖర్చులను అదుపుచేసుకుని వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు. అకారణ కలహాలు ఏర్పడగలవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. కుటుంబంలో  ప్రతికూల వాతావరణం. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

చేసే పనులు లో లాభాలను పొందుతారు. విద్యార్థిని విద్యార్థులకు చదువులో ప్రతిభ చూపిస్తారు .కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు. ఉద్యోగాలు లో అదనపు పని భారం పెరుగుతుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో  ఊహించని ధన లాభం పొందవచ్చు. ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

చేయ పనులు లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును. ఉద్యోగాలలో సాధారణ పరిస్థితులు ఉండగలవు. సత్ కార్యాచరణ ఆచరిస్తారు. వృత్తి  వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు సంతృప్తికరమైన ఫలితాలు పొందగలరు. చిన్న చిన్న అవకాశాలు కూడా అంది పుచ్చుకొనవలెను. నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు ఏర్పడగలవు. బంధుమిత్రులు తో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మి యై  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

ఉద్యోగమునందు అధికారులతో వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులుంటాయి. మానసిక శారీరక అలసట పెరుగుతుంది .కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.విద్యార్థులు చదువు యందు పట్టుదల చూపించాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కేసులు వివాదం తీర్పు మీకు ప్రతికూలంగా నుండును. బంధుమిత్రులతో  అకారణంగా కలహాలు రాగలవు .మంచి ఆలోచనలు చేయుట వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ఊహించని విధంగా తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. సమాజంలో  ప్రతికూలంగా ఉండును. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి ఒత్తిడికి లోనవుతారు. వస్తువుల విషయంలో  జాగ్రత్త అవసరం.  వ్యాపారంలో ఊహించని ధన వస్తు నష్టం రావచ్చు. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ వ్యక్తుల సహకారములు తో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాలి.ఈ రాశి వారు మంగళ స్వరూపిణే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

చేయ పనుల యందు కోపం చిరాకు తగ్గించుకుని వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాగలవు. విద్యార్థిని విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ వహించవలెను. ఇంటా బయటా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులతో వాదప్రతివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారాలలో చికాకులు తప్పవు. ప్రయాణములో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓం తారాదీశాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయవలెను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సామాన్యంగా ఉండును. ఉద్యోగాలలో పై అధికారులతో చికాకులు .చేయు వ్యవహారాల్లో సంయమనము తీసుకుంటే మంచిది. కుటుంబ సభ్యులు తో ప్రతికూల ఏర్పడి ఒత్తిడికి గురి కాగలరు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఆదాయానికి సమానంగా ఖర్చులు ఉంటాయి. దురాలోచనలు వివాదాలకు దూరంగా ఉండాలి.ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

ఆదాయ అభివృద్ధి కి నూతన మార్గాలు అన్వేషణ చేస్తారు. పెండింగ్ వ్యవహారములు పరిష్కారం అవును. వృత్తి వ్యాపారాలలో లాభంగా రాణిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేయు పనులు లో కృషి అభివృద్ధి కనపడును. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందగలరు.ఈ రోజు ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

చేయు వ్యవహారములు నూతన ఉత్సాహంతో చేస్తారు. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతాయి.పాత బాకీలు వసూలు అవును.వృత్తి వ్యాపారాలలో ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగి అన్యోన్యత చేకూరును. శారీరక శ్రమ పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి. తలచిన పనులు లో విజయం సాధిస్తారు. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

ఉద్యోగులు అధికారులు తో వాదోపవాదాలు దూరంగా ఉండాలి. చేసే పనిలో  ఉత్సాహంగా లేకుండా ఉండడం. వృత్తి వ్యాపారాలలో ఆశించనంత లాభాలు కనబడక నిరుత్సాహం. భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గి వివాదాలకు దారితీయును. ఆర్థిక ఇబ్బందులున్నా ఏదో ఒక విధంగా ధనము చేతికి అందుతుంది. వాహనం ప్రయాణాల్లో  జాగ్రత్త అవసరం. చేయు వ్యవహారాల్లో ఆలోచనలతో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.ఈ రాశి వారు ఓం ఛాయా స్వరూపాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

click me!