ప్రతి రాశివారు అస్సలు అంగీకరించని విషయాలు ఇవే..!

First Published | Aug 6, 2023, 7:20 AM IST

అలాంటి ఈ రాశివారికి ప్రశంసలు రాకపోవడం, తమపై ఎవరూ అటెన్షన్ చూపించకపోవడం లాంటివి జరగడాన్ని వీరు అంగీకరించలేరు.

telugu astrology


1.మేషరాశి..
మేష రాశివారు అన్నింట్లోనూ చాలా చురుకుగా ఉంటారు.  దాదాపు నిజాయితీగా ఉంటారు. కానీ, ఈ రాశివారు అన్ని విషయాలను అంగీకరించలేరు. ముఖ్యంగా వారికి కొన్ని విషయాల్లో కంట్రోల్ ఉండదు. కొన్ని విషయాల్లో ఏం చేయాలో తెలీదు. అయినప్పటికీ ఈ విషయాన్ని వారు అస్సలు అంగీకరించరు.

telugu astrology

2.వృషభ రాశి..
వృషభ రాశివారు దాదాపు అన్ని విషయాలను ముందే ఊహించేస్తారు. కానీ,  వారు ఊహించనివి జరిగినప్పుడు వారు దానిని అంగీకరించలేరు. ముఖ్యంగా వారు జీవితంలో జరిగే సడెన్ మార్పులను వారు అంగీకరించలేరు.


telugu astrology


3.మిథున రాశి..
తమకు సమాధానం లేని  పరిస్థితులు వచ్చినప్పుడు, వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటిని వీరు అంగీకరించలేరు.

telugu astrology

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు తాము ప్రేమించినవారు దూరం అయినప్పుడు, తమ ప్రేమను అంగీకరిచనప్పుడు, తమకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వ్యక్తులు పక్కన లేకపోవడాన్ని వీరు అంగీకరించలేరు. ఇలాంటి పరిస్థితిని వీరు కలలో కూడా ఊహించలేరు.
 

telugu astrology

5.సింహ రాశి..
సింహ రాశివారు ఎక్కువగా అటెన్షన్ కోరుకుంటారు. ప్రశంసలు కోరుకుంటారు.  అలాంటి ఈ రాశివారికి ప్రశంసలు రాకపోవడం, తమపై ఎవరూ అటెన్షన్ చూపించకపోవడం లాంటివి జరగడాన్ని వీరు అంగీకరించలేరు

telugu astrology

6.కన్య రాశి..
కన్య రాశివారు తాము తప్పు చేశాము అని ఎవరైనా చెబితే, వారు దానిని అంగీకరించరు. ఎందుకంటే, వారు తమను తానము అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా ఉంటామని, తప్పు చేయమని అనుకుంటూ ఉంటారు.

telugu astrology

7.తుల రాశి..

తుల రాశివారికి గొడవలు లాంటివి పెద్దగా నచ్చవు. అలాంటి గొడవలు చాలా కామన్ అని ఎశరైనా చెబితే, వీరు వాటిని అంగీకరించలేరు.
 

telugu astrology

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు  ఎప్పుడూ శక్తివంతంగా  ఉంటారు. అలాంటి ఈ రాశివారు తమ చేతిలో పవర్ లేకపోవడం, తమకు ఎవరూ వాల్యూ ఇవ్వలేకపోవడం లాంటివి వీరు అంగీకరించలేరు.

telugu astrology

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు ప్రతిసారీ కొత్తగా కోరుకుంటారు. ఈ రాశివారికి రోటీన్ గా ఉండటం నచ్చదు. అలాంటి విషయాలను వీరు అంగీకరించలేరు.

telugu astrology

10.మకర రాశి..
మకర రాశివారు లక్ష్యం పై ఎక్కువు ఫోకస్ తో ఉంటారు. ఈ రాశివారు విజయం సాధించడం మాత్రమే కోరుకుంటారు. కాగా, ఈ రాశివారు ఓటమిని అస్సలు అంగీకరించలేరు.

telugu astrology


11.కుంభ రాశి..
ఈ రాశివారు  ఏ వాదనలో అయినా వారే విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు. అలా గెలవలేకపోవడాన్ని వీరు అంగీకరించలేరు.

telugu astrology

12.మీన రాశి..
మీన రాశివారు ఎక్కువగా ఊహల్లో జీవిస్తూ ఉంటారు. కానీ, ఏదైనా ఎప్పటికైనా ఎండ్ కార్డ్ పడాల్సిందే  అంటే ఈ రాశివారు అంగీకరించలేరు.

Latest Videos

click me!