ఎవరైనా ఆకర్షణీయంగా కనిపిస్తే.. ఈ రాశివారు ఏం చేస్తారో తెలుసా..?

First Published Oct 8, 2021, 10:58 AM IST

తమ ఆపోజిట్ జెండర్ వారు ఎవరైనా ఆకర్షణంగా కనిపిస్తే ఏ రాశివారు ఏం  చేస్తారో ఇప్పుడు చూద్దాం..

మనమంతా  సాధారణ మనుషులం. దాదాపు అందరం.. ఆపోజిట్ జెండర్ వారిని చూసి ఆకర్షణకు గురౌతూ ఉంటాం. అది సర్వ సాధారణం. అయితే.. తమ ఆపోజిట్ జెండర్ వారు ఎవరైనా ఆకర్షణంగా కనిపిస్తే ఏ రాశివారు ఏం  చేస్తారో ఇప్పుడు చూద్దాం..

1. మేష రాశి..
ఎవరైనా ఆకర్షణీయంగా కనపడితే.. ఈ రాశివారు వారిని టీజ్ చేస్తుంటారు. వారికి దగ్గరలోనే ఉంటూ.. తమ మనసులోని విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు.

2.వృషభ రాశి.

ఈ రాశివారు ఎవరైనా ఆకర్షణీయంగా కనపడితే.. వారితో సరసాలు ఆడాలని అనుకుంటారు. వారి పట్ల సమ్మోహనంగా ప్రవర్తిస్తారు. వారిని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

3.మిథున రాశి..

ఈ రాశివారు ఎవరైనా తమ కళ్లకు ఆకర్షణీయంగా కనపడితే.. వారికి తమ తెలివితేటలు అన్నీ చూపించి ఇంప్రెస్ చేయాలని అనుకుంటారు.
 

4.కర్కాటక రాశి..

ఈ రాశివారికి ఎవరైనా ఆకర్షణీయంగా కనపడితే.. వారితో మంచిగా ఉంటూ.. వారితో స్నేహం పెంచుకుంటారు.

5.సింహరాశి..
ఈ రాశివారికి ఎవరైనా ఆకర్షణీయంగా కనపడితే.. వారిని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు.  ఈ రాశివారు ఫ్లర్టింగ్ చేయడంలో తోపులు. 
 

6.కన్య రాశి..
ఈ రాశివారు ఎవరైనా తమ కళ్లకు ఆకర్షణీయంగా కనిపిస్తే.. వారితో పెద్దగా మాట్లాడరు. కూల్ గా ఉంటారు.. చాలా సిగ్గుపడుతూ ఉంటారు.
 

7.తుల రాశి..
ఈ రాశివారికి ఎవరైనా ఆకర్షణీయంగా కనపడితే.. వారి తో మాట్లాడటానికి కూడా చాలా నెర్వస్ గా ఉంటారు. కొంచెం సిగ్గు కూడా చాలా ఎక్కువ. కానీ.. వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు.

8. వృశ్చిక రాశి..
ఈ రాశివారికి ఎవరైనా నచ్చితే.. వారితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తారు. వారిని తాకడానికి ఇష్టపడతారు. అయితే.. అది చీప్ కాదు.. కాకపోతే.. షేక్ హ్యాండ్ లాంటివి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు.

9.ధనస్సురాశి.
ఈ రాశివారికి ఎవరైనా నచ్చితే.. వారికి తమ ఆలోచనలు వారితో పంచుకుంటారు. వారితో ఎక్కువ సేపు గడపాలని అనుకుంటూ ఉంటారు.

10.మకర రాశి..
ఈ రాశివారికి ఎవరైనా నచ్చితే.. వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వారి విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.

11.కుంభ రాశి..
ఈ రాశివారు చాలా మూడీ అని చెప్పొచ్చు. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. నచ్చిన వ్యక్తి ఎదురుగా ఉన్నా.. ఆ విషయాన్ని తొందరగా బయటపెట్టరు.

12.మీన రాశి..

ఈ రాశివారికి ఎవరైనా నచ్చితే.. వారితో చాలా ప్రేమగా ఉంటారు. వారితో ఎక్కువగా కమ్యూనికేషన్ పెంచుకుంటారు. వారిని ఇతరుల నుంచి కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. 

click me!