astrology 2020: న్యూ ఇయర్ లో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందంటే...

First Published | Dec 31, 2019, 12:27 PM IST

ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రధాన సంచారం శని మరియు గురువులకు సంభవిస్తుంది, ఈ రెండు గ్రహాలు చాలా నెమ్మదిగా కదిలే గ్రహాలు. మన జీవితంలోని ప్రతి సంఘటనను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. జీవితంలో ఈ రెండు గ్రహాల ప్రభావం లేకుండా జీవితంలో ఏ విదమైన పెద్ద సంఘటనలు చోటుచేసుకొవు.

2020 సంవత్సరంలో రాశి ఫలితాలు సుచా ప్రాయంగా తెలియజేయడం జరిగింది, వాస్తవానికి సంవత్సర ఫలితాలు అనేవి ఉగాది నుండి తెలియజేయాలి. ప్రకృతిలో " గ్రహ " మార్పు అనేది ఉగాది నుండి జరుగుతుంది, ఈ ఆంగ్ల సంవత్సరాది నుండి ఏ మార్పు కనబడదు. ఇందులో వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తు సంఘటనలను తెలుప బడ్డాయి. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రధాన సంచారం శని మరియు గురువులకు సంభవిస్తుంది, ఈ రెండు గ్రహాలు చాలా నెమ్మదిగా కదిలే గ్రహాలు. మన జీవితంలోని ప్రతి సంఘటనను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. జీవితంలో ఈ రెండు గ్రహాల ప్రభావం లేకుండా జీవితంలో ఏ విదమైన పెద్ద సంఘటనలు చోటుచేసుకొవు.
మేష రాశి: సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక లాభాలను పొందుతారు. సంవత్సరం మొదటి నెలలో భారీగా ఆర్దిక్జ లాభాలు కనబడుతాయి. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దీనితో మీరు అనుకున్న పనులు అన్ని విధాల ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు ఈ సమయంలో మీ సంపదలో పెరుగుదలను ఆశించవచ్చు. సంవత్సర ప్రారంభంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మనస్సు రహస్యమైన శాస్త్రం వైపు మొగ్గు చూపుతుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం మీద శ్రద్ద చూపించాలి. ఈ సంవత్సరం మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. చదువులకు సంబంధించి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మేషరాశి వారలు ఈ సంత్సరం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

శని మకరరాశి నుండి మారినప్పుడు. మీ భవిష్యత్తు బాగుంటుంది మరియు స్థిరత్వం కలుగుతుంది. ఈ సమయంలో సమాజంలో మరియు మీ కార్యాలయాలలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ సంవత్సరంలో మేషరాశివారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్నయలు చేస్తే వారు మంచి ఫలితాలను పొందుతారు. నవంబర్-డిసెంబరు నెలల్లో మీ ఇంట్లో మంగళ ప్రదమైన కార్యం జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రేమ మరియు అన్యోన్యతలకు మంచిది.
వృషభరాశి : 2020 సంవత్సరం మితంగా ఉంటుంది. శని తన స్వ స్థానమైన మకరరాశిలో ఉండటంతో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అనుకున్న మరియు అనుకోని లాభాలు ప్రాప్తిస్తాయి. ఉదాహరణకు వారసత్వం లేదా ఏదైనా ఆకస్మిక లాభాలు లేదా నిరోధించబడిన డబ్బు విడుదల ద్వారా లాభాలు కలగవచ్చును. నవంబరులో రాహువు మీ జాతకంలో మిధునరాశి నుండి వృషభరాశికి వెళ్ళినప్పుడు ఇది మీకు సంపద విషయంలో అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి. మీరు ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు మీ ఆరోగ్యనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరంలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఎక్కువ ఇబ్బందులు మీ కార్యానిర్వహణ పనులలో కనబడతాయి .
చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ ఆదాయంలో అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది లేదా ఫిబ్రవరి నెలలో మీరు ప్రమోషన్ పొందవచ్చు. మీరు వ్యాపారం చేస్తున్నటైతే ఈ సమయంలో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోవాలి లేకపోతె ఆర్థిక పరంగా నష్టపోతారు. ఈ సంవత్సరం వృషభరాశి విద్యార్థులకు సానుకూల ఫలితాలు కలుగుతాయి ఎవరైతే పరీక్షలకు మరియు ప్రయోగాలు చదువుతున్న విద్యార్దులకు మరింత అనుకూలంగా ఉంటుంది. వృషభరాశి వారికి 2020 సంవత్సరంలో చాలా వరకు అన్ని నెలల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. మీరుఈ సంవత్సరం మార్చి - జులై నెలలలో వివాహ కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వృషభరాశి వారికి ప్రేమ పరంగా అనుకున్న ఫలితాలు దక్కక పోవచ్చును .
మిథున రాశి: ఈ సంవత్సరం విధి చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం డబ్బు విషయాలలో మీకు కొంత ఇబ్బంది అవుతుంది. మరియు మీ జాతక చక్రములో ఉన్న రాహువు మీరు అనుకున్న ఫలితాలను దక్కనివ్వడు. మీ జాతక చక్రంలో శని దేవుడు రాక 2020 నుండి ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం మొత్తం ఉంటాడు. ఇది మీ భవిషత్తుకి మరియు సంపదకు అవరోధాలను కలిగిస్తుంది. మిధునరాశి వారి జాతక ప్రకారం 2020 సంవత్సరంలో మీరు మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మార్చి మరియు మే నెలలలో కొంచం ఎక్కువ శ్రద్ద పెట్టవలిసి ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు ఒక మోస్తరులో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వాహనాలతో జాగ్రత్త అవసరం. శని దేవుడు ఎనిమిదవ స్థానానికి చేరుకున్నప్పుడు అదృష్టం కూడా కలిసిరాదు. ఈ సంవత్సరం మిధునరాశి వారు ఉద్యోగం సంపాదించడానికి మరింత కృషి చేయవలిసి ఉంటుంది. మీ సీనియర్లు, అధికారుల నుండి సహకారాన్ని పొందుతారు కాని మీరు వారి సలహాలను పూర్తిగా ఉపయోగించుకోలేరు.
2020 సంవత్సరంలో మీరు మార్చి మరియు జూన్ నెల్లలో డబ్బు మరియు భవిషత్తు విషయాలలో కొంచం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సంవత్సరం విజయాలను సాదించాలి అంటే అది మీ కృషి మీదే ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ జీవితం మెరుగు పడుతుంది. జీవిత భాగస్వామి ,కుటుంబ సభ్యలు మీకు అన్ని విధాలుగా మద్దతును తెలియజేస్తారు. గురు గ్రహం మీ ఏడవ స్థానానికి చేరుకొంటుంది. సంవత్సరం మధ్యలో ఇది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ సంబందాలను బలపరుస్తుంది. మిధునరాశిలో ఉన్నఇతర వర్గాల వారికి సంవత్సరం ప్రారంభంలో ప్రేమ విషయంలో కొంత అనుకూలంగా లేకపోయినా సంవత్సరం ముగింపు సమయంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది.
4. కర్కాటకం : మీ ఆరవ స్థానంలో రెండు గ్రహాలు, రెండవ స్థానాన్ని కలిగివున్న సూర్యుని యొక్క స్థాన ఫలితంగా 2020 సంవత్సరం ప్రారంభం మీకు మంచిది కాకపోవచ్చు కాని మీ ఆదాయానికి పెద్దగా ప్రభావితం కాదు. మీకు ఈ సంవత్సరంలో అనుకోని వారసత్వ సంపదలు మరియు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం జులై - ఆగష్టు నెలల్లో మీరు విదేశీ వనరుల నుండి ఆదాయాన్ని పొందవచ్చును, లేదా మీ ఖర్చుల ఫలితంగా మీరు మీ ఆదాయాన్ని కోల్పోవచ్చును. ఆ తరువాత ఉన్న ఆరు నెలలు మీకు మీ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటాయి. మీ ఆరవ స్థానంలో ఉన్న కేతు గ్రహం మీ ఆరోగ్యం మీద చేడు ప్రభావాన్ని చూపుతుంది.
ఈ సంవత్సరం మొదటిలో మీ ఆర్థిక సంపాదన బాగుంటుంది. శుక్రుడు మీ పదకొండవ స్థానంలో నుండి ఏడవ స్థానానికి చేరుకొంటాడు. ఈ సంవత్సరం మార్చి-జూలై నెలల్లో డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం మీ జీతంకూడా పెరిగే అవకాశాలుకూడా వున్నాయి మీ ప్రమోసంకరణంగా. మీరు వ్యాపారంచేస్తుంటే మీకు సంవత్సరం మధ్యకాలం నుండి అనుకూలంగా ఉంటుంది. 2020 సంవత్సరంలో కర్కాటకరాశిలో ఉన్న ఇతరులకు జులై - ఆగష్టు నెలలో వారి పోటీ పరీక్షకు అంత అనుకూలముగా ఉండదు. సెప్టెంబర్ మధ్యలో అయితే మీరు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. 2020 సంవత్సరం మార్చిలో భూమి కానీ వాహనం కానీ కొనవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబంలోకి ఒక కొత్త శిశువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవంత్సరం కర్కాటకరాశి వారు ఏవరైతే వారికి నచ్చిన వారిని వివాహం చేసుకుందాం అనుకొంటారో వారికి ఈ సంవత్సరం మధ్యభాగం నుండి అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి: 2020 సంవత్సరం మొత్తం అదృష్టం అనే చెప్పుకోవాలి. ఆర్థిక మరియు వ్యాపారం వంటి రంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం బాగుంది. మీరు మీజీతంలో అభివృద్ధిని పొందవచ్చు లేదా మీ సామర్థ్యం వల్ల అదనపు డబ్బు సంపాదించవచ్చు. ఈ సంవత్సరం మీకు ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ ఆరవ స్థానంలో శని ఉంటాడు, ఇది మీ శత్రువులపై విజయం సాధించిన సంకేతాలను చూపిస్తుంది.
మీరు మీ పని ప్రదేశాలలో ప్రశంసలు పొందుతారు. మీ సహోఉద్యోగులు కూడా మీకు సహాయం చేస్తాను మరియు లాభదాయకమైన ఆలోచనలను చెప్తారు. ఈ సంవత్సరం మీ ఆదాయం నికరంగా వుంటుంది. మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ విద్యకు సంబంధించిన విషయాలలో ఈ సంవత్సరం మీ దీర్ఘకాల కోరిక నెరవేరవచ్చు. మీరు ఈ సమయంలో ఎలక్ట్రానిక్ లేదా హార్డ్వేర్ వ్యాపారాలు చేస్తున్నట్లైతే మీరు మరింత విజయాన్ని పొందతారు . ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం సానుకూలంగా ఉండదు. మీరు ఈ సంవత్సరం ప్రారంభంలో భూమి కానీ వాహనం కానీ కొనవచ్చు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు మొదటి కొన్ని నెలల్లో మరియు తరువాత జూన్ తరువాత పిల్లలను ఆశించవచ్చు. 2020 సంవత్సరంలో మీ ప్రేమ జీవితం మీకు అనుకూల పరిస్థితులను అందించదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు ఐతే వారు మిమ్మల్ని సంవత్సరం చివరిలో ప్రేమించే అవకాశం ఉంటుంది.
కన్య రాశి : ఈ సంవత్సరం వారి జీవన ప్రగతి పరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ పై వారి నుండి సహకారాన్ని పొందుతారు మరియు మార్చి - మే నెలలో సంపదలను కూడా సంపాదిస్తారు. మీకు సొంత వ్యాపారం వున్నట్లయితే మీరు ఆ వ్యాపారాన్ని చిన్నగా అభివృద్ధి చేసుకుంటారు. తప్పకుండా మీరు పోటీపరీక్షలు రాయాలి అనుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా వుంటుంది. ముఖ్యంగా మార్చి - మే నెల్లలో మీరు మీకు కావలిసిన ఫలితాలను పొందుతారు. మీకు ఈ సంవత్సరం మీ అదృష్టం ఎల్లప్పుడూ కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీరు రహస్యమైన ప్రపంచం వంటి విభిన్న పరిశోధనా రంగాలపై కొంత ఆసక్తిని పెంచుకోవచ్చు. మీరు ఈ సంవత్సరం విద్యాపరంగా ఆకస్మిక ఫలితాలను పొందవచ్చు.
ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. మీరు కొన్ని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈ సంవత్సరం మీ సంతోషం మీ జీవిత భాగస్వామి నుండి కలుగుతుంది. మార్చి-మే సమయంలో మీరు మీ పిల్లల వివాహం లేదా పిల్లల పుట్టుకను ఆశించవచ్చును. ప్రేమ విషయలో కూడా చాలా అనుకూలంగా వుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కలిగి వుంటారు.
తుల రాశి :2020 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన, వ్యాపారం, విద్య మరియు వివాహం వంటి రంగాలలో మీరు అనుకున్న ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ రెండవ స్థానంలో కుజ గ్రహం ఉంచడం కారణంగా చాలా ఖర్చు చేస్తారు. అయితే మీకు డబ్బులు అనేవి వస్తు,పోతూ వుంటాయి. మీరు ఏ విధమైన పెట్టుబడులు పెట్టడానికైనా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో చక్కని ఆరోగ్యం కలిగి వుంటారు. అన్నివిధాలుగా ఈ సంవత్సరం మీ ఆరోగ్య పరిస్థితి బాగా వుంటుంది. ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీ ప్రస్తుత స్థానం నుండి మీ పై స్థానానికి బదిలీ చేయబడతారు. మీ సీనియర్ మరియు సహ ఉద్యోగుల నుండి మద్దతు పొందవచ్చు లేదా అధికారిక ఉద్యోగోములో పెరుగుదల పొందవచ్చు. మీకు అదృష్టం సంవత్సరం మొత్తం తోడుగా ఉంటుంది.
విద్యార్థులు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా జనవరి నెలలో మీ ఆరవ స్థానం కారణంగా ఏడాది పొడవునా శనిచేత ప్రయోజనం పొందుతారు. ఈ సంవత్సరం తులారాశి వారి కుటుంబ జీవితం అంత అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం మధ్య కాలంలో ఇంట్లో ఒక మంగళ కరమైన కార్యాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తంలో ఎక్కువ నెలలు ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉండనున్నాయి. మీ భాగస్వామి ఒకరి మీద ఒకరు పట్టుదలతో కలిసి ఉంటారు. కొత్తగా వివాహం అయిన వారు సంతానం కోసం ఆశించవచ్చును. అవివాహితులు భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుయితే మీరు మీ భాగస్వామిని పొందగలుగుతారు. ఎక్కువ కాలం మీరు మీ భాగస్వామితో అందమైన బంధాన్ని పొందుతారు.
వ 2020 సంవత్సరం ఒక శుభకరమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వృశ్చికరాశి వారి ఆర్థిక, వ్యాపార మరియు వృత్తి జీవన పరంగా అనుకున్న ఫలితాలను పొందుతారు. 2020 సంవత్సరం ప్రారంభంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శని మరియు గురు గ్రహాలు మీ రెండవ స్థానంలో ప్రవేశం చేస్తున్నాయి, దీని ప్రభావం వలన మీరు ఆర్థికంగా కొంత నష్టాలను చవి చూస్తారు. ఈ సంవంత్సరం అప్పులతో వ్యాపారాలు మొదలు పెట్టడం అనేది అంత మంచి ఆలోచన కాదు. ఆరోగ్య విషయంలో కూడా కొంత వరకు జాగ్రత్తగా ఉండాలి. రాహు గ్రహం మీ ఏడవృశ్చిక రాశి: స్థానంలో చేరుకోవడం వలన మీరు సెప్టెంబర్ నెలలో కొంత మానసిక ఒత్తిడికి అవుతారు.
ఈ సంవత్సరం మీ వృత్తి జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయంలో మీ జీతంలో పెరుగుదల ఉంటుంది. గురుడు మీ జాతకచక్రంలో ఎక్కువ కాలం మీ రెండవ స్థానంలోనే ఉంటాడు, దీని ప్రభావంతో మీకు సంవత్సరం పొడవునా ధనం ప్రాప్తిస్తుంది. 2020 సంవత్సరం వృశ్చికరాశి వారి వ్యక్తిగత జాతకచక్రం ప్రకారం విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవంత్సరం వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అని అనుకుంటారో వారు మరియు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్న వారికీ అనుకూల ఫలితాలను ఇస్తాయి. పోటీ పరీక్షలకు మీ ఈ కృషి మరియు అదృష్టం రెండు కలిసివస్తాయి. ఈ సంవత్సరం మీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా పెళ్లి అయినా లేదా ఒక నూతన శిశువు జన్మించడం కానీ జరుగుతుంది. మీరు మీ కుటుంబ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. మీ ఏడవ స్థానంలో గ్రహ అనుకూలమైన ప్రయాణం చేయడం వలన ఈ సంవత్సరం మొదటి సగం మీ వైవాహిక జీవితానికి చాలా మంచిది. ఈ సంవత్సరం దాంపత్య అన్యోనతకు అనుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత ఎడబాటు లేదా విడిపోయే అవకాశం ఉంది జాగ్రత్తలు వహించండి .
ధనస్సు రాశి... 2020 సంవంత్సరం చంద్రుడి వలన ఆరోగ్యం, వ్యాపారం, విద్య మరియు ప్రేమ వంటి అంశాలలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఆర్థిక పరమైన ఎదుగుదలను కూడా ఆశించవచ్చు. శని మీ రెండవ స్థానంలో చేరుకున్న తరువాత మకరరాశి వైపు చూడడం వలన ఆదాయాన్ని భద్రపరుచుకొంటారు. ఈ కాలంలో ఇంటిని కూడా మరమత్తులు చేయించవచ్చును. ఈ సమయంలో ఆస్తులను కొనడం కానీ అమ్మడంకాని చేస్తారు. ధనస్సురాశి వారికి 2020 సంవత్సరం మొత్తం ఆరోగ్య పరంగా ఏ విధమైన సమస్య ఉండదు. ఏప్రిల్-మే మరియు ఆగస్టు నెలలలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ సంవత్సరంలో వృత్తి పరమైన జీవితంలో గొప్ప ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది.
జనవరి నెలలో విజయాల కోసం ఎక్కువ కృషి చేయవలిసి ఉంటుంది. దీనితో మీకు జనవరి-ఫిబ్రవరి నెలలలో ఆకస్మిక ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలో మీ జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గురు గ్రహం ఈ సంవత్సరంలో మీ ఒకటవ స్థానంలో ప్రవేశం చేస్తున్నాడు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. గురు గ్రహం మీ తొమ్మిదవ స్థానంలో సానుకూలంగా చూడడం కారణంగా ఆధ్యాత్మిక, వైద్యం, ఔషధం మొదలైన రంగాలలో వృత్తికి కొంత ఏక్కువ ప్రాముఖ్యం ఇవ్వవచ్చును. ధనస్సురాశి విద్యార్థులు ఈ సంవత్సరం వారి చదువు విషయంలో ఉత్తమమైన ప్రతిభను కనబరుస్తారు. ఈ సంవత్సరం మీ పిల్లలకు, మీ జీవిత భాగస్వామికి మరియు మీ తండ్రి గారికి చాల అనుకూలంగా ఉంటుంది. గురువు వలన ఆనందం, శ్రేయస్సునకు అనుకూలుడుగా ఉంటాడు. ఈ సంఘటన మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది.ప్రేమ విషయాలలో స్థిరత్వం, సందేహాస్పదంగా ఉంటుంది, అయినను మీరు సమయాన్ని ఆస్వాదిస్తారు.
మకర రాశి... 2020 సంవత్సరంలో చంద్రుడు మిశ్రమ ఫలితాలను అందిస్తునాడు. ఈ సంవత్సరంలో వృత్తి మరియు వ్యాపార రంగాలలో శుభ ఫలితాలను ఆశించవచ్చును. మీ లగ్నస్థానంలోని గ్రహం మరియు రెండవ స్థానంలో గ్రహం శని మొదట మీ పన్నెండవ స్థానంలో నుండి ఒకరిని ఒకరు వక్రంగా చూసుకోవడం వలన ఇంట్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక అంశాలకు అదృష్టం కాకపోవచ్చును. ఈ సంవత్సరంలో మీ కుటుంబ పరిధిలో ఒక వివాహ వేడుక జరుగుతుంది. డబ్బును ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. మీరు డబ్బును పెట్టుబడి పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. సంవత్సర ప్రారంభంలో లగ్నస్థానంలో ఉన్న గ్రహం వలన మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచన. మీ పదకొండవ స్థానంలో కుజ గ్రహం ఉంది మరియు ఆరవ స్థానంలో రాహువు యొక్క మరో మంచి కలయిక మీకు వృత్తి పరంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.
ఈ సంవత్సరంలో మీ విదేశీ వాణిజ్యం మరియు సంబంధాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం మార్చి నెల మరియు మే నెలలో వృత్తి జీవితం చాలా బాగా అభివృద్ది చెందుతుంది. ఈ సమయంలో ఉద్యోగం కూడా బదిలీ అవ్వచ్చును.మకరరాశి విద్యార్థులు వారి చదువులలో మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలలో చురుకుగా పాల్గొంటారు మరియు ఉద్యోగం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి నెలలో లేదా సంవత్సరం మధ్యకాలంలో కానీ మీ కుటుంబం కోసం వినోదకరమైన వస్తువులను కొంటారు. ఒకసారి రాహువు తన స్థితిని మార్చుకున్న తర్వాత సెప్టెంబర్ నెలలో మంచి ఆదాయం లభిస్తుంది. అవివాహితులకు ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది. ఎవరినైనా ఇష్టపడుతుంటే, మీ ప్రేమను వ్యక్తపరచాలి అని అనుకుంటే మీ అభిప్రాయం తెలియజేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి... 2020 సవంత్సరం పవిత్రంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మీ పన్నెండవ స్థానంలో శని ప్రవేశం నుండి మీరు రోజువారీ ఆదాయం అనుకూలంగా ఉండకపోవచ్చును. ఖర్చులను అధికం చేస్తుంది. వాస్తవానికి ఇలా ఉన్నప్పటికీ మీరు మీ డబ్బును ఆదా చేసుకోగలుగుతారు మరియు కొంత సంపదను పొందుపరుచుకొంటారు. వ్యాపార విషయాలను అనుభవం ఉన్నవారితో చర్చించండి. మీరు ఈ సంవత్సరంలో కడుపుకు సంబందించిన బాధలు పడుతుంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీరు ఊబకాయం పొందకుండా ఉండడానికి ఆహార నియమాలు పాటించండి నూనె మరియు కొవ్వు ఉన్న పదార్దాలను తక్కువగా తినండి.
ఈ సంవత్సరం మీ జాతక చక్రములో గురువు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి ఆర్థిక రాబడలు వచ్చే అవకాశాలు బలీయంగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన గలుగుతారు. మీరు మీ సొంత వ్యాపారాన్ని చేస్తున్నట్లు అయితే మీరు తొందరపాటుతో ఆలోచన చేయకుండా నిర్ణయాలను తీసుకోవద్దు. ఈ సంవత్సరం మధ్యలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని కోసం మీరు ఆయా రంగలలోని నిపుణులైన వారిని సంప్రదించి నిర్ణయాలను తీసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం విజయాన్ని సాధించడం కష్టతరం కావచ్చును. అయినప్పటికీ మీరు అధిక కృషితో మీ లక్షాలను సాదించవచ్చును. ఈ సంవత్సరం సమయం వృధా చేయక ఎక్కువ కృషి చేస్తే వృత్తి పరమైన జీవితంలో బిజీగా ఉంటారు,కొంత కుటుంబ జీవితానికి కూడా కొంచం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీ పిల్లలకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును, వారు వృత్తి పరంగా ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం సంతాన సాఫల్యత కుడా ఉంది. గురు గ్రహం ఐదవ స్థానంలో ఉండడం వలన ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది.
మీన రాశి... 2020 సంవత్సరంలో వృత్తి పరమైన, ఆర్థిక, ఆరోగ్య, విద్యా, వ్యాపార పరమైన మరియు సహా జీవితంలోని వివిధ అంశాలలో మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ సంవత్సరంలో విదేశి ప్రయాణాలకు అనుకూలం. మీరు ఈ సమయంలో తీర్థయాత్రలకు మరియు ఆధ్యాత్మిక పరమైన కార్యకలాపాలకు డబ్బును ఖర్చు పెడతారు. ఈ సంవత్సరం మీరు దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. మీ అదృష్టం వలన మీకు ఈ సంవత్సరం మంచి మద్దతు లభిస్తుంది. ఈ సంవత్సరం మార్చి లేదా మే నెలలో మీ పైఉద్యోగానికి బదిలీ కావచ్చును. 2020 సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం మీ ప్రయత్నాలతో విజయాలను పొందుతారు. సొంత వ్యాపారం ఉన్నట్లు ఐతే ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు. విదేశీ వనరుల నుండి కూడా ఆదాయాన్ని పొందవచ్చును.
ఈ సంవత్సరం మీనరాశి వారు విజయాలను చవి చూడడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. నిరుద్యోగులు ఈ సంవత్సరం మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మార్చి - మే నెలలలో విద్యార్ధులు తమ ఐదవ పాదంలో ఉన్న విద్యా రంగానికి సంబంధించిన గురు,శని మరియు కుజ గ్రహం కారణంగా వారి లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులు అన్ని పనులలో మీకు సహయ సహాకారాన్ని అందిస్తారు. ఈ సంవత్సరం మార్చి - జూన్ నెలల్లో తప్ప మిగితా నెలలలో మీ కుటుంబ సభ్యుల జాబితాలో మరొ కొత్త వ్యక్తి చేరే బలమైన అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సహజంగా ఉంటాయి. సప్తమ స్థాన గ్రహం వలన ఏ విదమైన సహాయాన్ని పొందరు, ఇది మీ జీవిత భాగస్వామితో విభేదాలను సూచిస్తుంది. ఈ సంవత్సరం మార్చి - జూన్ నెలలలో 5 వ స్థానం గ్రహం వలన ప్రేమ జీవితానికి మంచిది. ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం అనుకున్న ఫలితాలు పొందలేక పోవచ్చును.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Latest Videos

click me!