మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తిఉద్యోగాదులపై దృష్టి పెరుగుతుంది. అధికారిక వ్యవహారాలుం ఉంటాయి. కార్యనిర్వహణలో ఒత్తిడులుంటా యి. పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. ఆధ్యాత్మిక లక్ష్యాలపై కూడా దృష్టి సారిస్తారు. పనుల్లో ఆలస్యం కూడా జరుగవచ్చు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాలకు, సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటా యి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణకు అనుకూలమైన సమయం. లాభదృష్టి పెరుగుతుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అత్యున్నత వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెరుగుతుంది. కొన్ని అనుకోని సమస్యలు ఉంటాయి. ముందుకు వెళ్ళకుండా ఆపుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. పరిశోధన, వైజ్ఞానిక రంగాల వారికి అనుకూలమైన సమయం. దగ్గరి ప్రయాణాలుంటా యి. వృత్తి ఉద్యోగాదులకు అనుకూలమైన సమయం. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాలుంటా యి. పదోన్నతులపై దృష్టి ఉన్నా అప్రమత్తంగా మెలగాలి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) :అనుకోని సమస్యలుంటా యి. ఇబ్బందులకు అవకాశం ఏర్పడుతుంది. ఊహించని సంఘటలుంటా యి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త పనులను వాయిదా వేసుకోవాలి. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. సుదూర ప్రయాణాలపై ప్రణాళికలు వేస్తారు. దైవ, ధార్మిక కార్యక్రమాలు ప్రభావితం చేస్తాయి. పరిశోధనలు కొనసాగుతాయి. కొత్త సమాచారం అందుతుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరిచయాలు విస్తరిస్తాయి. పాతమిత్రుల కలయిక పెరుతుంతి. పోటీరంగంలో శ్రమ ఉంటుంది. భాగస్వామ్యాలతో వ్యతిరేకతలు రాకుండా చూసుకోవాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. స్నేహానుబంధాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృషఙ్ట సారిస్తారు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు తలెత్తే సూచనలు. అనారోగ్య భావాలు పెరుగుతాయి. చికాకులు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గే సూచనలు కనబడుతున్నాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు అధికం అవుతాయి. కార్యనిర్వహణలో శ్రమ ఉన్నా కార్యసాధన చేస్తారు. ఋణ రోగాదులను అధిగమిస్తారు. ఆలోచనల్లో కొంత ఒత్తిడి తప్పక పోవచ్చు. ఆలస్య నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. సంతానవర్గ సమస్యలు ప్రాధాన్యం వహిస్తాయి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. కాంపిటీషన్‌కస పై దృష్టి పెరుగుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పాత మిత్రుల కలయిక లేదా సమాచారం ఉంటుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. సంతానవర్గంతో సంతోషంగా కాలం గడుపుతారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. సౌకర్యాల లోపాలకు అవకాశం ఏర్పడుతుంది. వ్యతిరేకతలు ఉన్నా పోటీలు ఒత్తిడులకు గురి చేస్తాయి. కార్య నిర్వహణలో తలమునకలు కావాలి. శ్రమాధిక్యం పెరుగుతుంది. ఋణబాధలు వస్తాయి. శత్రుభావన తగ్గించుకోవాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. సౌఖ్యంగా కాలం గడుపుతారు. గృహ, వాహనాది వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం. శ్రమాధిక్యం ఏర్పడుతుంది. విద్యారంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సేవక వర్గ సహకారం లభిస్తుంది. సమాచార లోపాలుంటా యి. వార్తలు కలవరపెట్టే అవకాశం. సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంప్రదింపులకు అనుకూలమైన సమయం. సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వింరు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో తడబాటుకు అవకాశం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలకు అవకాశం ఏర్పడుతుంది. సోదరవర్గ వ్యవహారాల్లో సంతోషం, సంతృప్తి లభిస్తాయి. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. విందులు వినోదాలకు అవకాశం కలుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. శ్రమ తప్పకపోవచ్చు. విద్యారంగంలోని వారికి అనుకూలత పెరుగుతుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కుటుంబ వ్యవహారాలు సంతోషాన్ని ఇస్తాయి. బంధువర్గం వల్ల సంతృప్తి లభిస్తుంది. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. న్లిధనం పెంచుకుంటారు. కొన్ని అనుకోని సమస్యలుంటా యి. అనారోగ్యమూ ఇబ్బంది పెడుతుంది. నిర్ణయశక్తి లోపిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు సమాచారం అందుతుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. సుదూర లక్ష్యాలపై దృష్టి ఏర్పడుతుంది. పరిశోధనాత్మక వ్యవహారాలుంటా యి. సమాచారానికి వెంటనే స్పందించకుండా ఉండడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆత్మ విశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తారు. బాధ్యతలు అధికం అవుతాయి. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. శరీరం, ఆరోగ్యంపై దృష్టి పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు బలపడతాయి. భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం. అన్ని పనుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది. బంధువర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక నిర్ణయాలక అనుకూలమైన సమయం. నిల్వధనం పెంచుకుంటారు. మాట తీరువల్ల సంతోషం పెరుగుతుంది. అనుకోని సంఘటలను అధిగమిస్తారు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఖర్చులు అధికమౌతాయి. అనేక రూపాల్లో పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుంది. కాలం, ధనం, వ్యర్థమయ్యే సూచనలు . తొందరపాటు పనికిరాదు. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. లాభాలున్నా ఆశించిన సంతోషం అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వ్యతిరేకతలను అధిగమించాల్సి వస్తుంది. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల పై ధృష్టి ఏర్పడుతుంది. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. భాగస్వామ్య అనుబంధాలు మెరుగు పడతాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయోజనాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సృజనాత్మక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. ప్రయాణాలకు మంచి అవకాశం. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వేరు వేరు రూపాల్లో ధనాన్ని వెచ్చించే అవకాశం ఏర్పడుతుంది. అన్ని పనుల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి.