ఈ రాశివారు తమ లైఫ్ పార్ట్ నర్ నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?

Published : Feb 09, 2022, 12:36 PM IST

తమ జీవితంలోకి వచ్చేవారు కూడా తమతో పాటు సాహసాలు చేసేవాళ్లు రావాలని కోరుకుంటారు.  

PREV
113
ఈ రాశివారు తమ లైఫ్ పార్ట్ నర్ నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?

రిలేషన్ అంటే.. ప్రేమ ఇవ్వడం.. ప్రేమ తీసుకోవడం. ఈ రెండింటిలో ఏది లేకపోయినా.. ఈ రెండు సాధ్యం కావు. అయితే..  మనం ఎంత ప్రేమ ఎదుటివారికి అందజేస్తే.. అంత ప్రేమ తిరిగి మనకు దక్కుతుందని పెద్దవారు చెబుతుంటారు. ఈ బంధాల మధ్య చిన్న చిన్న అలకలు, కోపాలు, తాపాలు ఉండటం కూడా సహజం. ఒకరికోసం ఒకరు సర్దుకుపోవడం, రాజీపడటం లాంటివి చేస్తేనే.. ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. ఒకరిని మరొకరు ఎక్కువగా అర్థం చేసుకుంటే వారి బంధం మరింతగా బలపడుతుంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఒక్కో రాశివారు తమ జీవిత భాగస్వామి నుంచి కొన్ని కోరుకుంటారట. కానీ.. వాటిని మాత్రం బయటపెట్టరట. అసలు వారు ఏం కోరుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం..

213

మేషరాశి..

ఈ రాశివారు తమ పార్ట్ నర్ ఎప్పుడూ తమతోనే ఉండాలని అనుకుంటారు. తాను కోపంగా ఉన్నప్పుడూ తమతోనే ఉండాలని అనుకంుటారు. వీళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ పార్ట్ నర్ తమకు దూరం అవ్వాలని కోరుకోరు.
 

313

వృషభ రాశి..
ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి తమను పూర్తిగా ప్రేమించాలని.. తమ కోసం ఏదైనా చేయాలని కోరుకుంటారు. మళ్లీ అంతే ప్రేమ ఇతరుల పై చూపిస్తే మాత్రం తట్టుకోలేరు.

413

మిథున రాశి..
ఈ రాశివారు తమ ఫీలింగ్స్ ని తొందరగా ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. ప్రేమించిన వారితోనైనా అప్పుడప్పుడు కంఫర్ట్ గా ఉండలేరు.ఇవన్నీ అర్థంచేసుకునే వారు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు.

513

 కర్కాటక రాశి..
ఈ రాశివారికి కాస్త నిలకడ తక్కువ. ఏ నిర్ణయమూ సరిగా తీసుకోలేరు. అన్నింట్లో తికమకపడిపోతూ ఉంటారు. కాబట్టి.. తమను అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకునేవారు జీవితంలోకి రావాలని కోరుకుంటారు.
 

613

సింహ రాశి..
సింహ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. తమ జీవితంలోకి వచ్చేవారు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. తమ పార్ట్ నర్ తమను ఎక్కువగా ప్రశంసించాలని కోరుకుంటారు.

713

కన్య రాశి..
ఈ రాశివారు  చాలా క్రిటికల్. కనీసం తమ మనసులో ఏముంది అనే విషయాన్ని కూడా తొందరగా బయట పెట్టరు.  వీళ్లని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలా చేసుకునేవారు తమ జీవితంలో రావాలని కోరుకుంటారు. 


 

813

తుల రాశి.
ఈ రాశివారు అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు.  ఎక్కువగా ప్రశాంతత కోరుకుంటారు. తమ ప్రశాంతతను పొగొట్టకుండా.. ఉండేవారు తమ జీవితంలోకి వస్తే బాగుండని కోరుకుంటారు.
 

913

వృశ్చిక రాశి..
ఈ రాశివారిది పెద్ద మనసు. తమ పార్ట్ నర్ ని బాగా ప్రేమిస్తారు. ఒక్కసారి తమతో ఎవరైనా కనెక్ట్ అయితే.. వారిని విపరీతంగా ప్రేమిస్తారు. అంతే ప్రేమను తమ పార్ట్ నర్ నుంచి కోరుకుంటారు.

1013

ధనస్సు రాశి..
ఈ రాశివారికి అడ్వెంచర్స్ చేయడం ఇష్టం. కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చేవారు కూడా తమతో పాటు సాహసాలు చేసేవాళ్లు రావాలని కోరుకుంటారు.

1113

మకర రాశి..

ఈ రాశివారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు.  తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కష్టపడతారు. తమ జీవిత భాగస్వామికి సైతం పూర్తి సహకారం అందిస్తారు. తాము జీవితంలో ఎదగడానికి.. తమ పార్ట్ నర్ సైతం తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటారు.
 

1213

కుంభ రాశి.. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చాలా ఛాలెంజింగ్ ఉండాలని కోరుకుంటారు. రోజు రోజుకీ.. ప్రతి విషయంలో తమను తాము ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు. అయితే.. వీరు వారి జీవితంలో పర్సనల్ స్పేస్ , స్వేచ్ఛ కోరుకుంటారు. ఇక తమ జీవిత భాగస్వామి తమను పూర్తిగా నమ్మాలని.. తమనకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటారు.
 


 

1313

మీన రాశి.
ఈ రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు.  సెల్ఫ్ లెస్ గా ఉంటారు. వీరు త్వరగా ప్రేమలో పడిపోతారు. తమతో జీవితాంతం కలిసి ఉండేలా వ్యక్తి తోడుగా రావాలని కోరుకుంటారు.


 

click me!

Recommended Stories