weekly astrology: వారఫలాలు( ఫిబ్రవరి 14 నుంచి 20 వరకు)

First Published Feb 14, 2020, 8:58 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక చింతన వల్ల మేలు కలుగుతుంది. కొంత అసంతృప్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాదుల్లో అనుకూలత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు రాణిస్తాయి. హోదా పెంచుకుంటారు. అనుకోని సంఘటనలుంటాయి. అనారోగ్య భావనలు. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయాలి. నిరాశ తగ్గించుకోవాలి.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అన్ని కార్యక్రమాల్లో జాగ్రత్త అవసరం. చికాకులు, నష్టాలు, ఆరోగ్య లోపాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు. అధికారిక కార్యక్రమాల్లో ఒత్తిడులు ఉంటాయి. లాభాలు ఆశించినంతంగా ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు. ముఖ్య కార్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్యక్రమాలపై దృష్టి పెడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక చింతన వల్ల మేలు కలుగుతుంది. కొంత అసంతృప్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాదుల్లో అనుకూలత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు రాణిస్తాయి. హోదా పెంచుకుంటారు. అనుకోని సంఘటనలుంటాయి. అనారోగ్య భావనలు. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయాలి. నిరాశ తగ్గించుకోవాలి.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. శారీరక శక్తి తగ్గతుంది. వ్యాపారాదుల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణావకాశాలుంటాయి. ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఉన్నా కార్యక్రమ నిర్వహణలో ఒత్తిడి తప్పకపోవచ్చు. భాగస్వామ్య అనుబంధాలపై దృష్టి పెరుగుతుంది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆలోచనలకు రూపకల్పన పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన వ్యవహారం నిర్వహిస్తారు. సంతానవర్గ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. లోపాలను అధిగమిస్తారు. శ్రమ ఉంటుంది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సౌకర్యాలపై దృష్టి పెడతారు. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలపై దృష్టి పెరుగుతుంది. శ్రమతో కార్యక్రమాలుంటాయి. గృహ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెరుగుతుంది. వ్యతిరేక ధోరణులు తప్పవు. పోటీరంగంలో ఒత్తిడులు చికాకులుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్తగా మెలగాలి. వ్యాపార భాగస్వాములతో మంచి అనుబంధాలు. కొత్త అనుబంధాలు ఏర్పడే అవకాశం. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సంతానవర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలు, ఒత్తిడులున్నా విజయం లభిస్తుంది. వ్యాపారాదుల కోసం ప్రయాణిస్తారు. సౌకర్యాలు, సౌఖ్యంపై దృష్టి ప్రయాణాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఆహారవిహారాలు ప్రభావితం చేస్తాయి. ఆశించిన సౌఖ్యం అంతగా అందకపోవచ్చు. విద్యారంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. బాంకు వ్యవహారాలపై దృష్టి పెడతారు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సౌకర్యాలు ఆశించిన సంతోషాన్నివ్వవు. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలుంటాయి. క్రియేటివిటీ పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త వహించాలి. నిరాశ ఉంటుంది. ఆశించిన సహకారం అందకపోవచ్చు.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. స్వస్థత ఉంటుంది. సేవకవర్గ సంప్రదింపులు, సహకారం లభిస్తుంది. ప్రయాణాదుల్లో సమస్యలు వస్తాయి. కమ్యూనికేషన్స్ విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వ్యాపారాదులకు అనుకూలం ఏర్పడుతుంది. చమత్కారంగా వ్యవహరిస్తారు. ఆహార విహారాలుంటాయి. కుటుంబ బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో తొందరపాటు పనికిరాదు. ఆర్థిక క్రమశిక్ష్లణ పాటిస్తారు.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణావకాశాలుంటాయి. కుటుంబ వ్యవహారాల కోసం ఖర్చు చేస్తారు. ప్రయాణాలు ఆశించిన ధనం అందకపోవచ్చు. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి సమర్ధత పెంచుకుంటారు. కొంత నిరాశ తప్పకపోవచ్చు. సౌకర్యాలకు అనుకూలం.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. నిర్ణయాదుల్లో చాలా ఆలస్యం ఉంటుంది. బద్దకం తగ్గించుకోవాలి. పెద్దల ఆశీస్సులుంటాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారాదుల వల్ల నిల్వధనం పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. ధార్మిక ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. ఆశించిన సంతృప్తి దొరకకపోవచ్చు. పరామర్శలకు అవకాశం.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత పెరుగుతుంది. అధికారిక వ్యవహారాల్లో ప్రయోజనాలుంటాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. కొన్ని వ్యర్థమైన పనులు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గుర్తింపు లభిస్తుంది. లాభాలు అధికం అవుతాయి. ఆశించిన ప్రయోజనాలు అందలేదనే నిరాశ ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. కుటుంబంలో అసంతృప్తి.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉన్నత వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. సుదూర ప్రయాణ భావనలు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. లాభాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆశించిన ప్రయోజనాలందకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. నిరాశ ప్రభావితం చేస్తుంది. జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. క్రియేటివిటీ పెరుగుతుంది.
undefined
click me!