Astrology: ఫిబ్రవరి నెల రాశిఫలాలు

First Published Feb 1, 2020, 8:37 AM IST

ఫిబ్రవరి నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆర్ధికంగా బలం చేకురును. మనశ్శాంతి లభిస్తుంది.అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. రెండవ పక్షంలో వృధా కాలయాపన జరుగుతుంది. మాసం చివరలో మానసిక ఇబ్బందులను ఎదుర్కుంటారు. వృత్తి, ఉద్యోగాలలో నిర్ణయ తప్పిదములు ఏర్పడతాయి. 

మేషరాశి:- ఈ నెలలో ఆర్ధిక పరమైన ఒప్పందాలలో సమస్యలుంటాయి జాగ్రత్తలు వహించాలి.అధిక ధనవ్యయాలుంటాయి. వాడి వేడి మాట తీరు వలన వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతాయి. గృహ మార్పులకై అన్వేషణ చేస్తారు. వ్యక్తీ గత విమర్శలు మితి మీరుతాయి. రహస్యమైన చర్యలు, సాహసంతో కూడుకున్న పనులకు దూరంగా ఉండాలి. ప్రతి విషయంలో సమయస్పూర్తి, సంయమనం ఎంతాగానో అవసరం. ముఖ్య నిర్ణయాలను ఆలస్యం చేస్తారు.ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
undefined
వృషభరాశి:- ఈ నెలలో ఆర్ధికంగా బలం చేకురును. మనశ్శాంతి లభిస్తుంది.అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. రెండవ పక్షంలో వృధా కాలయాపన జరుగుతుంది. మాసం చివరలో మానసిక ఇబ్బందులను ఎదుర్కుంటారు. వృత్తి, ఉద్యోగాలలో నిర్ణయ తప్పిదములు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తాలుంటాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో వాయిదాలు వేయవద్దు. అప్పులు చేసే వారి దగ్గర సరైన సమాచారం ఇవ్వండి. పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి:- ఈ నెలలో అనుకూలతలు కల్గును.మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతాన విజయాలలో సౌఖ్యం కలుగుతుంది.ఆనారోగ్య భాదాల నుండి ఉపశమనం లభిస్తుంది.ఒప్పందాలు ఆకస్మికంగా రద్దయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగ బదిలీలు వాయిదా పడతాయి. స్థిరాదాయం పెరుగుతుంది.శుభకరమైన భాధ్యలను విస్మరించవద్దు. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి.స్పెక్యులేషన్లు వద్దు. సహుద్యోగులతో సంయమనం పాటించండి. నాల్గవ వారం అంత అనుకూలంగా ఉండక పోవచ్చును. పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది
undefined
కర్కాటకరాశి:- ఈ నెలలో బంధువుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాలలో సమస్యలు ఉన్నాను మంత్రాంగంతో విజయం సాధిస్తారు. గర్వభంగములు ఉండవు. ప్రజా ఆదరణ కలుగుతుంది. ఆని విషయాలలో ఆశించినంత లబ్ది కలగకున్నను చివరికి సమస్యలు లేకుండా కార్యసిద్ధి కలుగుతుంది. అవినీతి కార్యలపై మొగ్గు చూపిస్తారు. కొన్ని సందర్బాలలో ఆర్ధిక అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఋణాలు ఇవ్వవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఇతరుల జ్యోక్యం లేకుండా జాగ్త్రత్తలు తీసుకోండి.చివరి వారం కొంత సహకరించక పోయే అవకాశాలు ఉన్నాయి. పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి :-ఈ నెలలో ప్రశంసలు అధికంగా ఉంటాయి. సంతానంచే కార్యసిద్ధి కలుగుతుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది.శత్రువుల మొండితనం పెరుగుతుంది. రెండవ పక్షంలో పనులు వాయిదా పడినను చివర్లలో విజయం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నతస్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యాయ పోరాటం వద్దు. శత్రు అంశాలను ఇతరులతో ప్రస్తావించవద్దు. ప్రభుత్వానికి కట్టాల్సిన భాకీలు ఆపవద్దు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. సంతానం విషయంలో శ్రద్ధ పెట్టండి. అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.
undefined
కన్యారాశి :- ఈ నెలలో సమయస్పూర్తి లోపించకుండా జాగ్తత్తలు తీసుకోవాలి. విలాసాలకు అధిక ధన వ్యయం అవుతుంది. అసత్య ఆరోపణలున్నాయి జాగ్రత్త వహించండి. రెండవ పక్షంలో వైద్య సేవలు అవసరపడవచ్చును. తరచూ అసత్య ఆరోపణ ప్రచారంతో జరగాల్సిన పనులు వాయిదా పడతాయి. ఆటంకాలు , నాన్చుడు దొరని అధికం అగును. అప్పులు చేయవద్దు, ఉన్న దానితో సరిపెట్టుకోవాలి. సంతానంపై శ్రద్ధ చూపాలి. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. సమాజంలో మీకున్నపేరును కాపాడుకోవాలి. పశు ,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులరాశి :- ఈ నెలలో అనవసరమైన సమస్యలకు దూరంగా ఉండాలి. ఆత్మీయ మిత్రుల, బంధువుల అండ దండలు లభిస్తాయి. శుభకార్యా నిర్వాహణకు పరిస్థితులు అనుకూలిస్తాయి.దైర్య సాహసాలు తగ్గినను నష్టాలు మాత్రం కలుగవు. శాస్ర్త చికిత్స అవసరపడవచ్చు ఆరోగ్యాన్ని, ఆహారాన్ని జాగ్త్రత్తతో చూసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలను పెడచెవిన పెట్టవద్దు.చేసే పనిలో ఒకటికి రెండు సార్లు ఆలోచన బలంగా చేయాలి.రెండవ వారంలో కుటుంబ అంశాలలో దృష్టి సారించాలి. ఇంటి సమస్యలను ఇతరులకు చెప్పకండి. ఎవరిని విమర్శించవద్దు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.
undefined
వృశ్చికరాశి :- ఈ నెలలో కళాకారులకు, కళా రంగాలవారికి అన్ని విధములుగా అనుకూలంగా ఉంటుంది. స్వయం వృత్తుల వారికి విజయప్రాప్తి కలుగుతుంది. ప్రారంభంలో కొన్ని సమస్యలు కనపడిననూ పరోక్షంగా మేలునే చేస్తాయి. అనుకున్న పనులు, కోరికలు కొంత ఆలస్యంగానైనా సిద్ధిస్తాయి. భూమి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. బందువర్గీయులతో అనుకూలంగా వ్యవహరించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సాధ్యమైనంతవరకు మౌనం అవసరం తోబుట్టువులతో అన్యోన్యంగా ఉండండి.పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనస్సురాశి :- ఈ నెలలో వృతి వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. అసౌకర్యాలు కొంత విసుగు కలిగిస్తాయి. జాయింటు వ్యవహారాలలో వ్యతిరేకతలు కనబడతాయి. మనసంతా హడావుడి పడుతుంది.స్పెక్యులేషన్ తొ కొంత ఊరట కలుగుతుంది. శుభకార్యా నిర్వహణలు అనుకూలిస్తాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి.అనవసరమైన వాటికోసం అప్పులు చేయకండి. ఆర్ధిక లావాదేవీలలో అప్రమర్ధంగా ఉండాలి. పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి :- ఈ నెలలో ప్రాధాన్యత కలిగిన వ్యక్తులను దూరం చేసుకోవద్దు. క్షణికావేశంలో తోదరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అధిక అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ఆధిపత్య పోరు కొంత తగ్గుతుంది. అనవసరంగా ఋణాల కొరకు సమయాన్ని వృధా చేసుకుంటారు. నిత్య భయాందోళనలు ఉంటాయి. ఒకే వంశానికి చెందిన దాయాదులు మిమ్మల్ని అర్ధం చేసుకుంటారు. నీటి వ్యాపారాలు కలిసిరావు. వాహణాలకు సంబంధించన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ పై అధికారులకు సంజాయిషీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉద్యోగ ప్రమోషన్లు వాయిదా పడే అవకాశం ఉంది. కలహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ప్రయాణాలలో, డ్రైవింగ్ లో జాగ్రత్తలు అవసరం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
undefined
కుంభరాశి :- ఈ నెలలో ఎక్కువగా శుభ వార్తలు వింటారు. మనస్సుకు అనందం ,ఉల్లాసం కలుగుతుంది.అన్ని విధాలుగా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. గృహ, ఉద్యోగ, బదిలీలు మీకు సానుకూలంగా ఉంటాయి. బంధువుల రాక వలన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆభరణాలపై జాగ్రత్తలు అవసరం. సంతానం విషయంలో శ్రద్ధ ఎక్కువగా చూపాలి. ముఖ్యమైన విషయాలను మర్చిపోవద్దు. పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి :- ఈ నెలలో మీ ఆశలు నిరాశలు కావు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో అనుకూలతలు పెరుగును. ఉన్నత స్థాయి వ్యక్తుల వలన లాభాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. శక్తికి మించిన కార్యాలు చేయకండి. నమ్మిన వారిలో శత్రువులు ఉన్నారని గ్రహించండి. ఎవ్వరికి హామీలు ఇవ్వవద్దు. ఋణ విషయాలలో అప్రమర్తత అవసరం. పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.
undefined
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
click me!