ఈ వారం రాశిఫలాలు( 24జనవరి నుంచి 30 జనవరి )

First Published Jan 24, 2020, 8:56 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి సారిస్తారు. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో శ్రమ ఉంటుంది. ఖర్చులు, ప్రయాణాలుంటాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపడి మాట్లాడకూడదు. గౌరవ లోపాలకు అవకాశం ఏర్పడుతుంది.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. కొన్ని అనుకోని సమస్యలకు నిర్ణయల లోపాలకు అవకాశం ఉంటుంది. సంప్రదింపులు ఉంటాయి. ఇతరులకు సహకరించడం మంచిది. సోదరవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింటారు. ఉన్నత విలువలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. విశ్రాంతి లభిస్తుంది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వృత్తి ఉద్యోగాదులపై దృష్టి సారిస్తారు. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో శ్రమ ఉంటుంది. ఖర్చులు, ప్రయాణాలుంటాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపడి మాట్లాడకూడదు. గౌరవ లోపాలకు అవకాశం ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉ:డాలి. ప్రయోజనాలు కోల్పోకుండా చూసుకోవాలి. ఉన్నతమైన పనులను సాధించడానికి ఆలోచిస్తారు. ఏదో ఒక ప్రయోజనం కోల్పోవాల్సి వస్తుంది. శ్రమాధిక్యం ఉంటుంది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఉన్నత వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. సుదూర ప్రయాణాల భావనలుంటాయి. విందు, వినోద, విహార యాత్రలపై ఆలోచన ఉంటుంది. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. పోటీల్లో గుర్తింపుకు అవకాశం ఉంటుంది. ప్రయోజనాలపై దృష్టి ఏర్పడుతుంది. నిర్ణయాదుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసంగా మారకూడదు. దురాశ ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో ఆచి, తూచి వ్యవహరించాలి. భాగస్వామితో సంతోషంగా గడిపే సమయం.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. నిర్ణయాదులు వాయిదా వేసుకుంటే మంచిది. సంతాన సంబంధమైన ఒత్తిడులుంటాయి. వృత్తిలోనూ సమస్యలుంటాయి. కాలం, ధనం వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది. తొందరపాటు కూడదు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనారోగ్య భావనలు వస్తాయి. పోటీరంగంలో గుర్తింపు ఉన్నా శ్రమ తప్పదు. సుదూర ప్రయాణ భావనలు వాయిదా పడే అవకాశం. ఉన్నత విలువలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్ష్తత పెరుగుతుంది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : భాగస్వాములపై దృష్టి సారిస్తారు. పరిచయాలు, స్నేహాను బంధాలు విస్తరిస్తాయి. సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు పనికిరాదు. వేరు వేరు రూపాల్లో లాభాలను ఆశిస్తారు. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి సారించవద్దు. దురాశ పెరిగే సమయం. సంతాన వర్గ విషయాల్లో శుభ పరిణామాలు వస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. కొన్ని అనూహ్య సంఘటనలుంటాయి. వ్యతిరేకతలు పెరిగే సూచనలు. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య సూచనలు వస్తాయి.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచుచ. పోటీరంగంలో అనుకూలత పెరుగుతుంది. కాంట్రాక్టు వ్యవహారాల్లో సంతృప్తి లభిస్తుంది. సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. అనుకోని ఇబ్బందులకు కూడా అవకాశం. జాగ్రత్తగా మెలగాలి. వృత్తి ఉద్యోగాదుల్లో అనేక భాద్యతలు మోయాలిస రావచుచ. బాద్యతలు చికాకు పెట్టవచ్చు. అధికారులతో జారగత్తగా మెలగాలి. సామాజిక గౌరవం తగ్గతుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. భాగస్వామితో అనుకూలంగా ఉన్నా కొంత ఒత్తిడి తప్పదు.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానోంతో సంతోషంగా గడుపుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. మాటల్లో తొందరపాటు పనికిరాదు. అధికర ధోరణి కూడదు. భాగస్వామ్య పనులలో అనుకూలత పెరుగుతుంది. సుదూర ప్రయాణాలు చేస్తారు. సాంకేతిక, విద్యలకు అనుకూలమైన సమయం. పెద్దలతో సంప్రదింపులుంటాయి. సోదరులతో సహృద్బావన ఏర్పడుతుంది. అందరి సహకారం అందుతుంది. పోటీలు, ఒత్తిడులుంటాయి.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. శ్రమాధిక్యం ఉంటుంది. నిర్ణయాదుల్లో తొందరపాటు పనికిరాదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది అతిగా మారకూడదు. వ్యతిరేకతలుంటాయి. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నష్టాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాలలో సంతృప్తి ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంప్రదింపులకు అనుకూలమైన సమయం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. సంతానవర్గం కోసం పెట్టుబడులుంటాయి. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు కూడదు. నిర్ణయాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. గృహ వాహనాదులపై దృష్టి పెంచుకుంటారు. విద్యా రంగంలోని వారికి అనుకూలమైన సమయం.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కుటుంబంలో శుభపరిణామాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. మాటల్లో చమతాకర ధోరణి పెరుగుతుంది. బంధువర్గంతో అనుకూలత పెరుగుతుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వ్యతిరేక ప్రభావాలపైన విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమ ఉన్నా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. నిర్ణయాల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. బద్దకాలకు అవకాశం ఉంటుంది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : నిర్ణయాదులకు అనుకూలమైన సమయం. ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా గడుపుతారు. అనేక బాధ్యతలను నిర్వహిస్తారు. గుర్తింపు గౌరవాదులు లభిస్తాయి. వృత్తిలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు పరిపరి విధాల వెళ్తుంటాయి. ధ్యానమార్గం వల్ల స్పష్టత వస్తుంది. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి అవసరం. అనేక రూపాలలో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక నిర్ణయాలకు అనుకూలమైన సమయం.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అన్ని పనుల్లోనూ ఖర్చులుంటాయి. విశ్రాంతి లభిస్తుంది. వినోద, విహార యాత్రలకు అవకాశం. సౌఖ్యంగా, సంతోషంగా గడుపుతారు. ఉన్నత లక్ష్యాల నిర్వహణ నిర్వహణలో కొన్ని ఒత్తిడులు పొందే అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల కోసం వెచ్చించాలి. గృహ, వాహనాదుల విషయంలో ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు, సామాజిక గౌరవం పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. పితృవర్గ వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.
undefined
click me!