మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకోని ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. ఊహించని సంఘటనలుంటాయి. నిర్ణయాదులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు కలుగుతుంది. సంప్రదింపులలోనూ అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వ్యాపార వేత్తల సహకారం ఆశిస్తారు.దగ్గరి ప్రయాణాల్లోనూ ఇబ్బందులుటాంయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. సుదూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. దైవ ధర్మ కార్యాలు, దానాదుల వల్ల మంచి కలుగుతుంది. కొంత నిరాశ ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి. పార్ట్‌నర్‌తో కొన్ని ఇబ్బందులుండే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు పెంచుకుంటారు. స్నేహానుబంధాలలోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని సమస్యలుటాంయి. అనారోగ్య భావనలు, అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. నష్టాలు పొందకుండా చూసుకోవాలి. నిరాశాభావాలు పెరుగుతాయి. పెట్టుబడులు మంచిది కాదు. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామజపంమంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీరంగంలో గుర్తింపు ఏర్పడుతుంది. కాంపిటీషన్స్‌పై దృష్టి పెడతారు. ఎదిరింపు ధోరణి ఉంటుంది. మొండివైఖరి పనికిరాదు. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. నిర్ణయాదుల్లోనూ జాగ్రత్త అవసరం. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఇబ్బందులుటాంయి. నిరాశ తప్పదు. అన్ని పనుల్లో ఆలస్యం ఏర్పడుతుంది. భాగస్వాములతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ఖర్చులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. విందు వినోదాల్లో పాల్గొటాంరు. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. క్రియేివిీతో పనిచేస్తారు. సలహాలు బాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సంతానవర్గంతో సంతోషంతో కాలం గడుపుతారు. నిర్ణయాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. మానసికమైన ఉత్సాహం ఉంటుంది. పోీరంగంలో విజయం సాధిస్తారు. వ్యతిరేకతలను అధిగమిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. అన్నింలో ఎదురీదాల్సి ఉంటుంది. ఋణ రోగాదులపై విజయం సాధిస్తారు. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. దైవధ్యానం వల్ల మేలు. శ్రీరామ జయరామ జయజయ రామరామ .
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆహార విహారాలపై దృష్టి ఏర్పడుతుంది. ప్రయాణాది సౌకర్యాలు పెంచుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొటాంరు. గృహ, వాహనాదులపై ప్రత్యేకదృష్టి అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాలు లాభిస్తాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ ఉన్నప్పికీ సంతోషంగా కాలం గడుపుతారు. మానసిక ఒత్తిడులకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త ఆలోచనలు ఉన్నా తొందరగా ఫలించకపోవచ్చు. ఆలస్య నిర్ణయాదులుటాంయి. వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంప్రదింపులకు అనుకూలమైన సమయం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుటాంయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలమైన సమయం. పెద్దలతో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింరు. సోదరవ్గంతో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరులకు సహకరించడం వల్ల మేలు కలుగుతుంది. సౌకర్యాదులపై దృష్టి పెడతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. గృహ వాహనాదుల విషయంలో కొత్త నిర్ణయాదులు కూడదు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కుటుంబంలో, బంధువర్గ వ్యవహారాల్లో ప్రభావితం అవుతారు. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట తీరులో మంచి మార్పు కనబడుతుంది. కొత్త ఆలోచనలను మాటల ద్వారా చెప్పే అవకాశం ఏర్పడుతుంది. భావ వ్యక్తీకరణకు చాలా అనుకూల సమయం. సేవక వర్గంతో సంప్రదింపులు ఉంటాయి. శ్రామిక సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూల సమయం. దగ్గరి ప్రయాణాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం. సోదరులతో ఇబ్బందులకు అవకాశం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిర్ణయాదులకు అనుకూలమైన సమయం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం. గుర్తింపులభిస్తుంది. సామాజిక గౌరవం కూడా లభిస్తుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. మాట తీరులో ఇబ్బందులు ఏర్పడుతాయి. భావ వ్యక్తీకరణ ఆశించినంత బాగా ఉండక ఇబ్బంది పడతారు. కొంత నిరాశ ఏర్పడుతుంది. కుటుబ వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం. బంధువులతో సంప్రదింపుల్లోనూ ఇబ్బందులుటాంయి. శ్రీమాత్రేనమః జపంమంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఖర్చులు పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ప్రయాణావకాశాలుటాంయి. విందులు వినోదాల్లో గడుపుతారు. విశ్రాంతి లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. దైవ ధర్మ కార్యక్రమాల కోసం ప్రయానాలు, ఖర్చులు దానాలుటాంయి. నిర్ణయాదులకు అనుకూలమైన సమయం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాల్సి ఉంటుంది. బద్ధకంగా కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు పనికిరాదు. బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెడతారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుటాంయి. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఆలోచనలకు రూపకల్పన కుదురుతుంది. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. వ్యర్థమైన ఖర్చులుటాంయి. ప్రయాణాదుల్లో ఇబ్బందులు. విశ్రాంతిలోపిస్తుంది. అనారోగ్య భావాలకు అనుకూలమైన సమయం. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం. పెట్టుబడుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. అనుకోని బాధ్యతలు ఇబ్బందిపెడతాయి. శారీరక శ్రమ అధికం. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సౌకర్యాల విషయంలో ఆశించిన సంతోషం కనపడకపోవచ్చు. లాభాలపైదృష్టి ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. కొంత నిరాశ ఏర్పడుతుంది. ఆలోచనల్లో ఒత్తిడులుటాంయి. అనేక భావాలు ఇబ్బంది పెడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉన్నత వ్యవహారాలై దృష్టి ఉంటుంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. విద్యారంగంలో అత్యంత అనుకూలమైన సమయం. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. సుదూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ తప్పక పోవచ్చు. వ్యాపారాదుల్లో నష్టాలు వచ్చే సూచనలు. శారీరక, మానసిక మైన ఒత్తిడులు ఉంటాయి. ఎంతో శ్రమతో గుర్తింపు సంపాదిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.