వారఫలితాలు తేదీ 24 సెప్టెంబర్ శుక్రవారం నుండి 30 గురువారం 2021

First Published | Sep 24, 2021, 11:20 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఊహించని రీతిలో అందుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ముఖమైన వ్యవహారాలలో మరింత పురోగతి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆర్థిక అవసరాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు.  ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.  పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో  చర్చల్లో ప్రతిష్ఠంభన. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఊహించని రీతిలో అందుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ప్రత్యర్థులు కూడా మీపట్ల విధేయత చూపుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తారు. కొంత అస్వస్థత కలిగినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగాలలో  కోరుకున్న  హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. మిత్రుల  నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కించుకుంటారు. ఆలోచనల అమలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. పలుకుబడి మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు∙అనుకూల వాతావరణం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం అనుకున్న విధంగా పనులు పూర్తి కాక నిరాశ చెందుతారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.  పనిఒత్తిడి  పెరుగుతుంది. కళారంగం వారి ఆశలు అంతగా ఫలించవు. వారం చివరిలో  శుభవార్తలు. కుటుంబంలో సంతోషకర వాతావరణం. విందువినోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం మధ్యమధ్యలో కొన్ని  సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఆస్తుల  కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఏదోవిధంగా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది.  వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాలలో∙ప్రతిభ చూపినా నిరాశ తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వారం ప్రారంభంలో వాహనయోగం. నూతన పరిచయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మనస్సులోని భావాలను పంచుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో బంధువులతో విరో«ధాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం చేపట్టిన పనులలో అవాంతరాలు తొలగుతాయి. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు సైతం తీరే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఎటువంటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి, హోదాలు కలిగిన వారు సహాయపడతారు. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. రావలసిన బాకీలు అందుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కొంత ఊరటనిస్తాయి.  ఉద్యోగాలలో మార్పులు తప్పవు.  పారిశ్రామికవర్గాలకు కొన్ని అవకాశాలు రావచ్చు. వారం దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు.  గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో విభేదిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. పరిచయస్తులే కొన్ని సమస్యలు సృష్టించవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు మధ్యలో నిలిపివేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలించవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. కళారంగం వారికి అవకాశాలు దూరం కాగలవు. వారం మధ్యలో శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం అన్ని వ్యవహారాలలోనూ విజయాలు వరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ అభిప్రాయాలను మిత్రులు గౌరవిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. భూములు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందుల బయటపడతారు. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు మరింతగా  పెరుగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వృథా ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు.  కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కొంత ఉపశమనం కలిగించే వార్త అందుతుంది. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాలలో కొద్దిపాటి వివాదాలు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు, అవకాశాలు చేజారవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. కొత్త పరిచయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

Latest Videos

click me!