weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఏ పని చేపట్టినా విజయమే..!

First Published Apr 1, 2022, 6:30 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం మొదట్లో ఇబ్బందులు, సమస్యలు కొంత కలత పెట్టవచ్చు. అయితే రానురాను పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగిపోతుంది. సమస్యలను అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం మీ కష్టం ఫలిస్తుంది. కొత్త పనులు చకచకా కొనసాగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. రుణవిముక్తి లభిస్తుంది. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహించే వీలుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారు ఊహించని కొన్ని అవకాశాలు సాధిస్తారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం మొదట్లో ఇబ్బందులు, సమస్యలు కొంత కలత పెట్టవచ్చు. అయితే రానురాను పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆలోచనల అమలులో కుటుంబసభ్యులు సహకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు అనూహ్యంగా దక్కుతాయి. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలలో రావలసిన పైకం అందుతుంది. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. పారిశ్రామికరంగం వారికి చెప్పుకోతగిన అభివృద్ధి కనిపిస్తుంది. వారం మధ్యలో శ్రమాధిక్యం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం అనుకున్న వ్యవహారాలు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశలు ఫలించే సమయం. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు సైతం మీకు మద్దతుగా నిలుస్తారు. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆపదలో ఉన్న వారికి మీ సేవలు అందిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం మీలో నూతనోత్సాహం నింపుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. కళారంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఎటువంటి పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలకు నేతృత్వం వహిస్తారు. ఆర్థిక పరిస్థితి సమతూకంగా ఉంటుంది. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. కళారంగం వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కొన్ని విషయాలలో మానసిక అశాంతికి లోనవుతారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం వీడక ముందుకు సాగడం మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. పనులలో అవాంతరాలు నెలకొని పరీక్షగా నిలుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనాలు కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కృషి, సేవలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రుల నుంచి ధనలాభ సూచనలు. రాబడి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొద్దిపాటి పదవులు దక్కే సూచనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం పొరపాట్లు సరిదిద్దుకుని చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో అంచనాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది వేడుకలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా చాతుర్యంగా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ విధుల్లో ఒత్తిడులు అధిగమిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
 

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

click me!