వార ఫలాలు :09 జూలై 2023 నుంచి 15 జూలై 2023 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
చతుర్దాధిపతి అయిన చంద్రుడు:-అనవసరమైన ఖర్చులు పెరుగును. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. ఆస్తి వివాదాలు గందరగోళంగా నుండును. భూ గృహ క్రయవిక్రయాలు ఈవారం వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజము నందు అపవాదములు రాగలవు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వారాంతంలో శరీర సౌఖ్యం లభించును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారమునందు ఆచితూచి అడుగులు వేయటం మంచిది.
అశ్విని నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.10-7-23 సోమవారము.12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
భరణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము.11-7-23 మంగళవారము13-7-23 గురువారము.15-7-23 శనివారం
కృత్తిక నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము11-7-23 మంగళవారము.12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
తృతీయాధిపతిఅయిన చంద్రుడు:-జన్మరాశిలో సంచారము. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగము నందు అధికారుల యొక్క గౌరవ మర్యాదలు పొందగలరు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారులు లాభసాటికా సాగును. చేయ పనులలో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు.
కృత్తిక నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము11-7-23 మంగళవారము.
12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
రోహిణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము.12-7-23 బుధవారము.
13-7-23 గురువారము.15-7-23 శనివారం
మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.
13-7-23 గురువారము.14-7-23 శుక్రవారం.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర
ద్వితీయాధిపతి అయిన చంద్రుడు:-వ్యయ స్థానము నందు సంచారము. ఈ సంచారము అనుకూలమైనది కాదు. సమాజము నందు అవమానాలు కలగ గలవు. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా నుండును. మిత్రుల వలన నష్టపోయే సూచనలు కలవు. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొనవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగును. వారాంతంలో ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగును. కుటుంబ సౌఖ్యం లభించును. సుఖప్రాప్తి.
మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.14-7-23 శుక్రవారం.
ఆరుద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము.12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.15-7-23 శనివారం
పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.15-7-23 శనివారం
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
జన్మరాశి అధిపతి అయిన చంద్రుడు:-ఏకాదశ స్థానం నందు అనగా లాభ స్థానం నందుసంచారము.కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. స్త్రీ సౌఖ్యం లభించును. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందగలరు. ఆస్తి వృద్ధి ఆలోచనలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. వారాంతంలో అకారణంగా కలహాలు ఏర్పడగలవు. అనారోగ్య సమస్యలు. శత్రుపీడ. అనవసరమైన ఖర్చులు ఏర్పడగలవు.
పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.15-7-23 శనివారం
పుష్యమి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 10-7-23 సోమవారము12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
ఆశ్రేష నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.15-7-23 శనివారం
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
వ్యయాధిపతి అయిన చంద్రుడు:- ఈ సంచారం వలన తలపెట్టిన పనులు విజయవంతమగును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలు అగును. పుణ్యకార్యాలు ధనధర్మాలు చేస్తారు. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అధికారుల యొక్క అండదండలు లభించును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారాంతంలో మానసిక వేదనలు ఉద్రేకతలు పెరుగును. అకారణ విరోధాలు. శరీర పీడ. స్త్రీల వలన అపనిందలు కలుగును.
మఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.10-7-23 సోమవారము.
12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 10-7-23 సోమవారము.11-7-23 మంగళవారము
13-7-23 గురువారము.15-7-23 శనివారం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము11-7-23 మంగళవారము.12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
లాభాధిపతి అయిన చంద్రుడు:- నూతన వస్తు వాహనాలకు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకోనట్లుగా సాధిస్తారు. శారీరక మానసిక ఆనందం పొందగలరు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారులు జరుగును. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. శత్రువులు అణిగి మణగి ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అభివృద్ధి కార్యాలకు శ్రీకారం చేస్తారు.
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము11-7-23 మంగళవారము.12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
హస్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
10-7-23 సోమవారము.12-7-23 బుధవారము.
13-7-23 గురువారము.15-7-23 శనివారం
చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.
13-7-23 గురువారము.14-7-23 శుక్రవారం.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
రాజ్యాధిపతి అయిన చంద్రుడు:-వ్యవహారములలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ధనాధాయ మార్గాలు బాగుండును. ఈవారం శుభ ఫలితాలు పొందగలరు. ఉద్యోగముల అధికారుల యొక్క గౌరవ మర్యాదలు పొందగలరు. లాభకరమైన దూరపు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆలోచన శక్తితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక ఆనందం లభించును. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.
చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.
13-7-23 గురువారము.14-7-23 శుక్రవారం.
స్వాతి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము.12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.15-7-23 శనివారం
విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.
13-7-23 గురువారము.15-7-23 శనివారం
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర
భాగ్యాధిపతి అయిన చంద్రుడు:- తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భూ గృహ నిర్మాణ పనులు మందగించును. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. అనవసరమైన ఖర్చులు జాగ్రత్త అవసరం. మానసిక భయాందోళన అనేక రకమైన ఆలోచనలు చికాకు పుట్టించిను. ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు ఎదురవగలవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండును. సమాజం నందు అపనందులు. శారీరక మానసిక సుఖశాంతులు తగ్గును.
విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.
13-7-23 గురువారము.15-7-23 శనివారం
అనూరాధ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
జ్యేష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.
13-7-23 గురువారము.15-7-23 శనివారం
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
అష్టమాధిపతి అయిన చంద్రుడు:- సమస్తమైన ధన ధాన్యాలు ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగును. వ్యాపారములు లాభసాటిగా జరుగును. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కీలకమైన సమస్యలు పరిష్కారం లభించును. అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కోర్టు వ్యవహారములు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
మూల నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 9-7-23. ఆదివారము.10-7-23 సోమవారము.
12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
పూ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము.11-7-23 మంగళవారము
13-7-23 గురువారము.15-7-23 శనివారం
ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము11-7-23 మంగళవారము.
12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని
కళత్రాధిపతి అయిన చంద్రుడు:- తలపెట్టిన పనులు విజయవంతమగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. అప్రయత్నంగా ధనలాభం కలుగును. ఉద్యోగ మనం అభివృద్ధి. సమాజము నందు గౌరవ మర్యాదలకు పొందగలరు. వృత్తి వ్యాపారములు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధువర్గములో మీ యొక్క ప్రాముఖ్యత పెరుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రతి వ్యవహారము చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు. మానసిక ఆనందం పొందగలరు.
ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము11-7-23 మంగళవారము.
12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
శ్రవణం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము.12-7-23 బుధవారము.
13-7-23 గురువారము.15-7-23 శనివారం
ధనిష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.14-7-23 శుక్రవారం.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
షష్ఠమాధిపతి అయిన చంద్రుడు:- అనవసరమైన ఖర్చులు పెరుగును. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు చికాకు పుట్టించిను. సమాజము నందు అపవాదములు. తలపెట్టిన పనులలో ఊహించని ఆటంకాలు. ఆ కారణంగా బంధు వర్గముతోటి విరోధాలు. ఉద్యోగవనందు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. కుటుంబ కలహాలు రాగలవు. శత్రువుల మూలకంగా ఇబ్బందులు. అకారణ విరోధాలు ఏర్పడగలవు.
ధనిష్ఠ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.14-7-23 శుక్రవారం.
శతభిషం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 10-7-23 సోమవారము.12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.15-7-23 శనివారం
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.
13-7-23 గురువారము.15-7-23 శనివారం
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
పంచమాధిపతి అయిన చంద్రుడు:- మానసిక ఆనందం పొందగలరు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారం నందు ధనలాభము పొందగలరు. సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆధార అభిమానాలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. నూతన ఉత్సాహం తోటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.15-7-23 శనివారం
ఉ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-10-7-23 సోమవారము12-7-23 బుధవారము.14-7-23 శుక్రవారం.
రేవతి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-9-7-23. ఆదివారము.11-7-23 మంగళవారము.13-7-23 గురువారము.15-7-23 శనివారం